సోమిరెడ్డి స్కెచ్ అదేనా?
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాను ఓటమి పాలయిన చోటే తిరిగి నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. తన ప్రత్యర్థి కాకాణి గోవర్థన్ [more]
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాను ఓటమి పాలయిన చోటే తిరిగి నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. తన ప్రత్యర్థి కాకాణి గోవర్థన్ [more]
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాను ఓటమి పాలయిన చోటే తిరిగి నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. తన ప్రత్యర్థి కాకాణి గోవర్థన్ రెడ్డిని బలహీన పర్చేందుకు ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాకాణి గోవర్థన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడానికి ఏ చిన్న అవకాశమొచ్చినా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వదులుకోవడం లేదు. ఆనందయ్య మందు విషయంలోనూ మరోసారి స్పష్టమయింది.
ఐదు సార్ల నుంచి….
సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పట్టు లేదు. గత ఐదుసార్లు నుంచి వరస అపజయాలు ఆయనను వెక్కిరిస్తున్నాయి. గత ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకే తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి మరి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ప్రజలు మాత్రం మరోసారి కాకాణి గోవర్థన్ రెడ్డికే పట్టం కట్టారు. అయితే ఈసారి ఎలాగైనా విజయం సాధించి తీరాలన్నది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లక్ష్యంగా కన్పిస్తుంది.
సర్వేపల్లి నుంచే?
తాను నియోజకవర్గాన్ని మారుస్తున్నానన్న వార్తలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండిస్తున్నారు. తాను సర్వేపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని ఆయన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు తెలుస్తోంది. సర్వే పల్లి నియోజకవర్గంలోనూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ప్రతి కార్యక్రమానికి వెలుస్తున్నాయి. తరచూ ఆయన నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నారు.
వారసుడికి కూడా…?
తన వారసుడిని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలన్న ఆలోచనను కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరమించుకున్నట్లు తెలిసింది. ఎలాగైనా ఈసారి కాకాణి గోవర్థన్ రెడ్డి ని ఓడించడమే తన లక్ష్యమని, అందుకే తాను మళ్లీ సర్వేపల్లి నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని ఆయన చెబుతున్నారు. అందుకే ప్రతి చిన్న విషయంలోనూ కాకాణి గోవర్థన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్కెచ్ ఎంతమేరకు ఫలిస్తుందనేది చూడాల్సి ఉంది.