ఫ‌స్ట్ టైం.. సోముకు షాక్‌: ప‌వ‌న్ విష‌యంలోనే..?

రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఒకేలా ఉండ‌వు. నేత‌లు విమ‌ర్శలు చేసే ముందు.. వాటికి ఎదుర‌య్యే కౌంట‌ర్ విమ‌ర్శల‌ను త‌ట్టుకునే స్థాయి ఉండాలి. ఏదో నోటికి వ‌చ్చింది క‌దా.. చేతికి [more]

Update: 2020-09-23 09:30 GMT

రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఒకేలా ఉండ‌వు. నేత‌లు విమ‌ర్శలు చేసే ముందు.. వాటికి ఎదుర‌య్యే కౌంట‌ర్ విమ‌ర్శల‌ను త‌ట్టుకునే స్థాయి ఉండాలి. ఏదో నోటికి వ‌చ్చింది క‌దా.. చేతికి దొరికింది క‌దా.. అనుకుంటే.. ఇప్పుడు సోము వీర్రాజు మాదిరిగా మీడియా మీటింగ్ అంటేనే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌తో సోము వీర్రాజు మీడియా మీటింగ్ అంటేనే జంకుతున్నార‌ట‌. సార్ మీడియా వాళ్లు వ‌చ్చారు.. అన‌గానే.. వ‌ద్దులే.. మ‌రో రోజు చూసుకుందాం! అనే స్థాయికి ఆయ‌న వెళ్లిపోయారు. మ‌రి ఇలా ఎందుకు జ‌రిగింది ? అనేది కీల‌క ప్రశ్న.

నిత్యం మీడియాలో…..

వాస్తవానికి పార్టీలు చిన్నవైనా.. పెద్దవైనా.. మీడియాతో ఉండే అనుబంధం.. ఏర్పరుచుకునే సంబంధాలు వేరు. నిత్యం మీడియాలో క‌నిపించే నాయ‌కులు.. క‌నీసం వారానికి నాలుగుసార్లయినా.. మీడియా ముందుకు వ‌చ్చే నేత‌లు సాధార‌ణం. మీడియాతో మాట్లాడ‌కపోతే.. మీడియాలో త‌న ఫొటో రాక‌పోతే.. అన్నం కూడా స‌హించ‌ని నాయ‌కులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో చంద్రబాబు ముందుంటార‌న్న విష‌యం మ‌న‌కు అంద‌ర‌కూ తెలిసిందే. విష‌యం ఏదైనా కావొచ్చు.. ఆయ‌న నిత్యం మీడియాలో క‌నిపించాల‌నే కాన్సెప్టుతో ముందుకు సాగుతున్నారు.

మీడియాను మేనేజ్ చేయలేక…..

ఇక‌, బీజేపీ మాజీ చీఫ్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా తాను ఎక్కడికి వెళ్లినా.. ముందుగానే మీడియాకు స‌మాచారం చేర‌వేసేవారు. మీడియా క‌వ‌రేజ్ కోసం త‌హ‌త‌హ‌లాడేవారు. మీడియా నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా దీటుగా స‌మాధానం చెప్పేవారు. కొన్నిసార్లు లౌక్యంగా స‌మాధానం చెప్పి త‌ప్పించుకునేవారు. ఇది అంద‌రూ చేసేదే. అయితే, ప్రస్తుత బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రం మీడియాను ఎలా మేనేజ్ చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆలయాలపై జరుగుతున్న….

తాజాగా ఆయ‌న ఆల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను తీసుకుని పోరు సాగిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆయ‌న మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. తాను మాట్లాడాల్సింది మాట్లాడారు. గ‌త ప్రభుత్వంపైనా విమ‌ర్శలు చేశారు. చంద్రబాబు హ‌యాంలోనూ దేవాల‌యాల‌పై దాడులు జ‌రిగాయ‌న్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా ఇప్పుడు ఆల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను ఖండించారంటూ.. మీడియా మిత్రులు ట్విట్టర్‌లో బాబు చేసిన కామెంట్లను ప్రస్తావించారు. దీనిపై సోము ఫైర‌య్యారు.

సమాధానం చెప్పలేక…

“హైద‌రాబాద్‌లో ఉండి మాట్లాడ‌డం కాదు.. అస‌లు బాబును ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న‌కు మాట్లాడే అర్హత లేదు“ అనేశారు. వెంట‌నే మీడియా మిత్రులు.. మీ మిత్రప‌క్షం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా హైద‌రాబాద్‌లో ఉండే క‌దా విమ‌ర్శలు చేస్తున్నారు.. మ‌రి దానికేమంటారు? అని ప్రశ్నించ‌గానే.. సోము వీర్రాజు చిర్రెత్తిపోయారు. మీడియా స‌మావేశం నుంచి హుటాహుటిన లేచి వెళ్లిపోయారు. మరి ఇలా మీడియాకే స‌మాధానం చెప్పలేని సోము వీర్రాజు రేపు రాజ‌కీయంగా ఎదుర‌య్యేవాటికి ఎలా స‌మాధానం చెబుతార‌నేది చూడాలి.

Tags:    

Similar News