మా..యమ్మ…సోనియమ్మే
కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి నాధుడు లేకుండానే మూడు నెలల పుణ్య కాలం గడచిపోయింది. ఎపుడైతే ఎన్నికల ఫలితాలు దారుణంగా వచ్చాయో [more]
కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి నాధుడు లేకుండానే మూడు నెలల పుణ్య కాలం గడచిపోయింది. ఎపుడైతే ఎన్నికల ఫలితాలు దారుణంగా వచ్చాయో [more]
కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి నాధుడు లేకుండానే మూడు నెలల పుణ్య కాలం గడచిపోయింది. ఎపుడైతే ఎన్నికల ఫలితాలు దారుణంగా వచ్చాయో అప్పుడే యువరాజు రాహుల్ గాంధి కాడి వదిలేశారు. నా కొద్దీ ప్రెసిడెంట్ గిరీ అంటూ కిరీటం పక్కన పెట్టేశాడు. నాటి నుంచి కాంగ్రెస్ లో మలుపులు అన్నీ ఇన్నీ కావు. టీవీ సీరియల్ మాదిరిగా, జీడిపాకంలా సాగుతోంది కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి కధ. గతంలో కాంగ్రెస్ లో మేరు నగధీరులు ఉండేవారు. గాంధీ వారసులతో సరిసమానమైన సత్తా చూపించే దిగ్గజాలు ఎందరో ఉండేవారు. అందుకే సులువుగా అధ్యక్ష పదవికి సరైన నేతలు దొరికేవారు. తన నియంత్రుత్వపు పోకడలతో వారిని పోగొట్టుకున్న కాంగ్రెస్ కి ఇపుడు మిగిలింది అంగుష్టమాత్రులే. దాంతో కాంగ్రెస్ పార్టీ ఇపుడు పిలిచి పీఠమెక్కిస్తామన్నా ఆ స్థాయి కలిగిన నాయకులు పార్టీలో కాగడా పెట్టి వెతికినా దొరికేట్టులేరు.
అలవాటు పడిన ప్రాణాలు…
ఇక కాంగ్రెస్ లో జీ హుజూర్ కల్చర్ కి అలవాటు పడిన ప్రాణాలే మొత్తానికి మొత్తంగా ఉన్నాయి. వారందరికీ గాంధీ కుటుంబం తప్పితే మరొకరిని అధ్యక్ష పీఠంపై చూసి సహించే ఓపిక, భరించే సహనం అసలే లేవు. తాము అంతా ఒక్కటి, గాంధీ కుటుంబం మాత్రమే దేశాన్ని, పార్టీని ఉద్ధరించేందుకు దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతలను కాంగ్రెస్ నేతలకు అతి పెద్ద భ్రమలు ఉన్నాయి. ఇప్పటికిపుడు వాటిని తొలగించుకుని మేమూ నాయకులమే అని బోరవిడిచి నిలబడే సత్తా ఎవరికీ లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీలో నాయకుడు అన్న వారే లేకుండా పోయారు. ఇపుడు ఈ విచిత్ర పరిస్థితే కాంగ్రెస్ కు లీడర్ అన్న వారు లేకుండా చేస్తోంది. రాహుల్ గాంధి వద్దు పొమ్మంటున్నా వర్కింగ్ కమిటీ తీర్మానల మీద తీర్మానాలు చేస్తూ శరణం అంటోంది. నిజంగా ప్రజాస్వామిక లక్షణాలు ఏవీ ఆ పార్టీకి లేవన్నది తాజా ఉదంతం చూస్తే అర్ధమవుతోంది.
అమ్మే రావాలట…
కొడుకు పార్టీని విడిచిపెడితే తల్లి సోనియమ్మే అధ్యక్షురాలు కావాలని కాంగ్రెస్ మొత్తం కోరుకుంటోంది. 2017 డిసెంబర్ లో ఆర్భాటంగా కాంగ్రెస్ కిరీటాన్ని స్వయంగా సోనియా రాహుల్ కు తొడిగారు. ఈనాడు పార్టీకి అధ్యక్షుడు, రేపు దేశానికి ప్రధాని అంటూ నాడు సోనియమ్మతో సహా అంతా ఆనందించిన సందర్భమది. ఆ మురిపాలు తీరకుండానే కాంగ్రెస్ పార్టీ పుట్టె ముంచుతూ రాహుల్ పదవిని కాలదన్నారు. మరో వైపు తన కుటుంబం నుంచి ఎవరూ పార్టీ బాధ్యతలు స్వీకరించరారదని షరతు కూడా పెట్టారు. ఎవరెన్ని చెప్పినా కూడా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం వినేలా లేవు. రాహుల్ కాకపోతే సోనియమ్మ మా పెద్ద అంటున్నారు. ఆమెను అధ్యక్షురాలిగా చేసుకుంటామంటున్నారు. నిజమే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇపుడు దయనీయంగా ఉంది. సోనియా ప్రెసిడెంట్ గా ఉన్నపుడు ఇలా లేదు. రెండు సార్లు యూపీయేను ఆమె అధికారంలోకి తీసుకువచ్చారు. మిత్ర పక్షాలతో ఆమె కలసి కూటమిని కట్టారు. ఇపుడు ఆ చొరవ తెగువ రాహుల్ లో లేకపోవడం ఓ కారణమైతే సోనియా మీద ఉన్న నమ్మకం, గౌరవం కొడుకు మీద మిత్రులకు కూడా లేదు. అందువల్లనే కాంగ్రెస్ శ్రేణులు కూడా సోనియా అయితేనే ఈ సంక్షోభం నుంచి పార్టీని గట్టెక్కిస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. మరి సోనియాగాంధీ పార్టీని గట్టెక్కిస్తారా? లేదా? చూడాలి.