గుణపాఠం నేర్చుకుంటారా

సెమి ఫైనల్ వరకు అద్భుతంగా రాణించింది ప్రపంచ కప్ లో టీం ఇండియా. లీగ్ లో ఒక్క మ్యాచ్ తప్ప అన్నింటా విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో [more]

Update: 2019-07-13 09:30 GMT

సెమి ఫైనల్ వరకు అద్భుతంగా రాణించింది ప్రపంచ కప్ లో టీం ఇండియా. లీగ్ లో ఒక్క మ్యాచ్ తప్ప అన్నింటా విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించింది. సెమి ఫైనల్ లో మాత్రం ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఇండియన్ టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో గెలిచే మ్యాచ్ కాస్తా ఓటమి ని తెచ్చిపెట్టింది. టీం ఇండియా బౌలర్ల శ్రమ అంతా కోహ్లీ సేన బూడిదలో పోసేసింది. మరి ఇంతటి పరాజయానికి కారకులు ఎవరు ? టీం లో లోపం ఎక్కడ ? ధోని బ్యాటింగ్ ఆర్డర్ ఎందుకు మార్చారు ? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సగటు క్రికెట్ అభిమానినే కాదు బిసిసి ఐ ని తొలిచేస్తున్నాయి.

వారి ముగ్గురికి పిలుపు …

టీం ఇండియా కు వెన్నెముకగా నిలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి , మేనేజర్ ఎమెస్కే ప్రసాద్ లకు బిసిసిఐ నుంచి పిలుపు వచ్చింది. జట్టు సెమిస్ ఓటమి పై వారు సమాధానం చెప్పాలిసి వచ్చింది. ఆటలో గెలుపు ఓటములు సహజమే అయినా ఈ స్థాయిలో గెలవాలిసిన మ్యాచ్ దూరం ఎందుకు అయ్యిందన్న దానిపై పంచాయితీ పెట్టక తప్పడం లేదు క్రికెట్ బోర్డు కి. మరో సెమీఫైనల్ లో లీగ్ టేబుల్ లో రెండో స్థానంలో వున్న ఆస్ట్రేలియా సైతం ఘోరంగానే ఇంగ్లాండ్ పై ఓడిపోయింది.

అన్ని రంగాల్లో రాణిస్తేనే….

భారత్ – న్యూజిలాండ్ కి ఇచ్చిన పోటీ కూడా ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ కి ఇవ్వలేక పోయింది. ఎంతటి జట్టు అయినా అన్ని రంగాల్లో రాణిస్తేనే ఆ రోజు విజేతగా నిలుస్తుంది. అప్పటివరకు వుండే ట్రాక్ రికార్డ్ లు విజేతలను నిర్ణయించలేవు. కానీ ఇప్పుడు చేసిన పొరపాట్లు భవిష్యత్తులో చేయకుండా ఉండాలనే బిసిసిఐ తాపత్రయం అయినా చేతులు కాలాకా ఆకులు ఎందుకు పట్టుకోవడం అన్నది భారత క్రీడాభిమానుల టాక్.

Tags:    

Similar News