ఇంకా గాడిన పూర్తిగా పడలేదా …?

వివాదాల గోల నేపథ్యంలో టీం ఇండియా వెస్ట్ ఇండీస్ లో టూర్ మొదలు పెట్టినా కష్టపడి శుభారంభం చేసింది. విండీస్ టూర్ కి ముందు టీం లో [more]

Update: 2019-08-04 02:30 GMT

వివాదాల గోల నేపథ్యంలో టీం ఇండియా వెస్ట్ ఇండీస్ లో టూర్ మొదలు పెట్టినా కష్టపడి శుభారంభం చేసింది. విండీస్ టూర్ కి ముందు టీం లో కోహ్లీ వర్సెస్ రోహిత్ నడుమ అంతర్గత యుద్ధం జట్టుపై ప్రభావం చూపుతుందేమో అని ఒక పక్క క్రీడాభిమానులు ఆందోళన చెందారు. దీనికి తోడు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రెండు నెలల పాటు ఆర్మీకి సేవలందించేందుకు దూరం కావడంతో కరేబియన్ టూర్ లో కష్టాలు తప్పవా అన్న అనుమానాలను కుర్రాళ్ళు పటాపంచలు చేశారు. లాడెర్ హిల్ లో జరిగిన తొలి టి ట్వంటీ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది టీం ఇండియా.

చెలరేగిన బౌలర్లు ….

సొంత గడ్డపై విండీస్ ఎప్పుడు ఎలా చెలరేగి ఆడుతుందో అంతుపట్టదు. అయితే టూర్ మొట్టమొదటి మ్యాచ్ లో టీం ఇండియా బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. ముఖ్యంగా యువ బౌలర్ సైనీ నాలుగు ఓవర్ల బౌలింగ్ చేసి మూడు వికెట్లు నేలకూల్చేశాడు. ఇక భువనేశ్వర్ రెండు వికెట్లు జడేజా, సుందర్ తలో వికెట్ పడగొట్టడంతో 20 ఓవర్లు ముగిసే సరికి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది విండీస్.

బ్యాటింగ్ లో వీక్ గానే….

అయితే ప్రపంచ కప్ లో సెమిస్ ఓటమి టీం ఇండియా ను ఇంకా వెన్నాడుతూనే ఉన్నట్లు వుంది. యాధావిధిగా టాప్ ఆర్డర్ అనుకున్న రీతిలో రాణించలేకపోయింది. ఓపెనర్ రోహిత్ 24 పరుగులు, కోహ్లీ , రిషబ్ పంత్ లు 19 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగారు. విండీస్ బౌలర్లు సైతం గట్టి పోరాటం కనబరచడంతో అలవోకగా నెగ్గాలిసిన మ్యాచ్ లో ఆరువికెట్లను చేజార్చుకుంది కోహ్లీ సేన. అయినప్పటికీ 17.2 ఓవర్లలో లక్ష్యాన్ని 98 పరుగులతో ఛేదించింది ఇండియా. మొత్తానికి తొలి టి ట్వంటీ తో విజయాలకు బోణి కొట్టడంతో ఫ్యాన్స్ సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే విండీస్ లో కీలకమైన ఆల్ రౌండర్ రస్సెల్ గాయం కారణంగా టి ట్వంటీ సిరీస్ కి దూరం కావడం ఆ జట్టు ను తీవ్రంగా దెబ్బతీసింది. అదేవిధంగా సిక్సర్ల సుడిగాలి క్రిస్ గేల్ ముందే తాను అందుబాటులో ఉండనని చెప్పడం కూడా విండీస్ కి మైనస్ గానే చెప్పాలి.

Tags:    

Similar News