టీం ఇండియా లో వారిద్దరికి ఛాన్స్ లేదు
ప్రపంచ కప్ టోర్నీ ముగిసింది. ఇక వెస్ట్ ఇండీస్ టూర్ ముందు వుంది. ఈ టూర్ కి బిసిసిఐ టీం ను ప్రకటించింది. ఆగస్టు 3 నుంచి [more]
ప్రపంచ కప్ టోర్నీ ముగిసింది. ఇక వెస్ట్ ఇండీస్ టూర్ ముందు వుంది. ఈ టూర్ కి బిసిసిఐ టీం ను ప్రకటించింది. ఆగస్టు 3 నుంచి [more]
ప్రపంచ కప్ టోర్నీ ముగిసింది. ఇక వెస్ట్ ఇండీస్ టూర్ ముందు వుంది. ఈ టూర్ కి బిసిసిఐ టీం ను ప్రకటించింది. ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్న విండీస్ టూర్ లో అందరు ఊహించినట్లే ఇందులో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, హార్దిక పాండ్య లకు చోటు లభించలేదు. ధోని స్థానంలో రిషబ్ పంత్ ఎంపిక చేసింది బిసిసిఐ. ఇక టెస్ట్, వన్డే, టి ట్వంటీ మూడు ఫార్మాట్ లకు విరాట్ కోహ్లీ నే కెప్టెన్ గా సెలెక్ట్ చేసింది కమిటీ. తాను వెస్ట్ ఇండీస్ టూర్ కి అందుబాటులో ఉండనని ధోని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్మీ లోని ప్యారాచూట్ విభాగంలో రెండు నెలల శిక్షణ కోసం ఇప్పటికే ధోని దరఖాస్తు చేశాడు. ఆ దరఖాస్తును ఆర్మీ స్వాగతించి ఆమోదించింది.
పాండ్యాకు విశ్రాంతి…..
పాండ్య కు విశ్రాంతి ఇచ్చిన బిసిసిఐ అనేకమంది యువ క్రికెటర్లకు టీం ఇండియాలో అవకాశం కల్పించింది. ప్రపంచ కప్ టోర్నీ లో కొట్టొచ్చినట్లు కనిపించిన నాలుగో స్థానం లోటు ను భర్తీ చేయడం పై సెలెక్షన్ కమిటీ దృష్టి పెట్టింది. ప్రపంచ కప్ లో గాయపడిన ఓపెనర్ ధావన్ పూర్తిగా కోలుకోవడంతో తిరిగి జట్టులోకి ఎంపిక అయ్యాడు. వచ్చే టి ట్వంటీ ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని టీం ఇండియా ను సన్నద్ధం చేసే దిశగా కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు సెలెక్టర్లు. తమకు ఎవరిపైనా పక్షపాతం, ద్వేషం ఉండవని అంబటి రాయుడు వన్డేలకు ఫిట్ అవ్వడని భావించే ప్రపంచ కప్ కి దూరం పెట్టినట్లు ఈసందర్భంగా సెలెక్షన్ కమిషన్ వివరణ ఇవ్వడం గమనార్హం.
ఏ ఫార్మాట్ కి ఎవరు ..?
టీం ఇండియా మూడు టి ట్వంటీ మ్యాచ్ లకు ఎంపికైన వారిలో విరాట్ కోహ్లీ ( కెప్టెన్ ) రోహిత్ శర్మ ( వైస్ కెప్టెన్ ) శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ ( వికెట్ కీపర్ ) కృనల్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చావహర్, భువనేశ్వర కుమార్, ఖలీల్ అహమ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ ఉన్నారు. మూడు వన్డేల టోర్నీ కి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కె ఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కులదీప్ జాదవ్, యుజ్వేంద్ర చాహల్, కేడర్ జాదవ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ వున్నారు. ఇక రెండు టెస్ట్ ల సిరీస్ కి విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర పుజారా, కె ఎల్ రాహుల్, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ జాదవ్, ఇశాంత్ శర్మ చోటు దక్కించుకున్నారు.