టీం ఇండియా ఓటమి వెనుక …??

ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచ కప్ లో టీం ఇండియా లీగ్ లో అదరగొట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అలాంటి టీం ఇండియా ఘోరంగా సెమిస్ [more]

Update: 2019-07-28 02:30 GMT

ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచ కప్ లో టీం ఇండియా లీగ్ లో అదరగొట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అలాంటి టీం ఇండియా ఘోరంగా సెమిస్ లో ఓటమి పాలు అవుతుందని ఏ ఒక్కరు భావించలేదు. కీలకమైన సెమిస్ లో అత్యంత చెత్తగా టాప్ ఆర్డర్ విఫలం అయ్యింది. అయితే న్యూజిలాండ్ అద్భుత బౌలింగ్ టాప్ ఆర్డర్ కూలడంలో కొంత కారణం అయినా టీం లో ఎదో జరుగుతుంది అని సగటు అభిమాని అనుమానించిన పరిస్థితి నిజమే అని తేలుతుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ల నడుమ నడుస్తున్న వార్ కాస్తా జట్టు కూర్పును సెమిస్ లో దెబ్బ తీసిందని తాజాగా తేలుతుంది.

మొగుడు పెళ్ళాన్ని ఒకేసారి అన్ ఫ్రెండ్ …

కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి నిర్ణయాలే టీం ఇండియా లో ఫైనల్. మరి వైస్ కెప్టెన్ గా రోహిత్ పాత్ర ఏంటి ? ఇదే స్టార్ ఓపెనర్ కి వచ్చిన కోపానికి కారణమని పరోక్షంగా ఇన్ స్ట్రాగ్రమ్ లో రోహిత్ చేసిన చర్య చెప్పక చెప్పింది. ప్రపంచ కప్ లో సెమిస్ ఓటమి తరువాత రోహిత్ కోహ్లీ ఆయన భార్య అనుష్క శర్మ లను ఫాలోవర్ నుంచి తొలగించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధోని ని ఏడో నెంబర్ బ్యాట్స్ మెన్ గా పంపడం నుంచి అంబటి రాయుడు ను జట్టులోకి ఎంపిక చేయకపోవడం వంటి తప్పుడు నిర్ణయాలకు కెప్టెన్, కోచ్ లతో రోహిత్ వాగ్వాదానికి దారితీసినట్లు ఇంగ్లీష్ మీడియా లో ప్రచారం నడుస్తుంది. తన మాటకు విలువ లేకపోవడంతో రోహిత్ వారిద్దరితో అంటి ముట్టనట్లుగా వున్నాడని తెలుస్తుంది. ఆ కోపంతోనే టోర్నీ ముగిసిన వెంటనే ఇన్ స్ట్రాగ్రామ్ లో తన అసంతృప్తి పరోక్షంగా వెళ్లగక్కినట్లు చెబుతున్నారు.

అందుకే ధోని కూడా …

టీం ఇండియాలో వివాదాల నేపథ్యంలోనే వివాదరహితుడిగా వుండే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వెస్ట్ ఇండీస్ టూర్ కి గుడ్ బై కొట్టి ఆర్మీ లో చేరి కొంతకాలం దూరంగా ఉన్నట్లు కూడా ఇప్పుడు కొందరు అనుమానిస్తున్నారు. టీం ఇండియా లో రెండు గ్రూప్ లు గా క్రికెటర్లు చీలిపోవడంతోనే కీలకమైన సమయంలో చతికిలపడ్డారని విమర్శలు ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అందుకే ఎప్పుడు లేని విధంగా ఇటీవల కోహ్లీ తమ వరల్డ్ కప్ టోర్నీ ప్రదర్శనపై మీడియా కు సుదీర్ఘ వివరణ ఇచ్చారని తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారాలపై అటు బిసిసిఐ కానీ ఇటు కోహ్లీ, రవిశాస్త్రి, రోహిత్, ధోని లనుంచి బహిరంగంగా ఎలాంటి సౌండ్ లేకపోవడంతో ఎదో జరిగిందనే అంతా నమ్మే పరిస్థితి ఏర్పడింది.

Tags:    

Similar News