Tdp : మెంటల్ గా ఫిక్స్ అయిపోయారట

తెలుగుదేశం పార్టీ అనవసర తలనొప్పులు కొని తెచ్చుకుంటుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని మరింత బలహీన పర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ నేతలు ఇప్పుడు మానసికంగా [more]

Update: 2021-10-16 00:30 GMT

తెలుగుదేశం పార్టీ అనవసర తలనొప్పులు కొని తెచ్చుకుంటుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని మరింత బలహీన పర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ నేతలు ఇప్పుడు మానసికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోకుంటే గెలవలేమన్న నిర్ణయానికి వచ్చారు. పొత్తుకు బాబు ప్రయత్నించాల్సందేనని కొన్ని ప్రాంతాల నేతలు తీవ్ర వత్తిడి కూడా తెస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు జనసేనతో పొత్తు ఉంటుందని మాత్రం ఫిక్స్ అయిపోయారు.

ఒంటరిగా పోటీ చేసి….

ఇప్పటికే ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమని 2019 ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. అందుకే మానసికంగా పొత్తుల ఉంటాయనే టీడీపీ నేతలు సిద్ధపడిపోయారు. కొన్ని సీట్లను రెండు, మూడు జిల్లాల్లో త్యాగం చేసైనా పొత్తు పెట్టుకోవాలని కొందరు నేతలు సూచిస్తున్నారు. అయితే ఇది కొంతమంది నేతల అభిప్రాయమే. పొత్తు ఉన్నా లాభం లేకపోవచ్చన్న వాదన కూడా గత కొద్దిరోజులుగా పార్టీలో వినిపిస్తుంది.

వాళ్లు ఓట్లేస్తారన్న….?

జనసేనతో పొత్తుతో నేరుగా దిగినా కాపు సామాజికవర్గం టీడీపీకి టర్న్ అయ్యేది అనుమానమే అంటున్నారు. టీడీపీ అభ్యర్థి ఉన్న చోట కాపుల ఓట్లు పడవని, జనసేన ఓట్లు కూడా బదిలీ కావని కొందరు అభిప్రాయపడుతున్నారు. అక్కడ లోకల్ నాయకత్వాన్ని బట్టి కాపు సామాజికవర్గం ఓట్లు వేసే అవకాశముందన్న అంచనాలు కూడా పార్టీలో వినపడుతున్నాయి. టీడీపీ మాత్రం బలహీనంగా ఉందని పార్టీలో అందరూ నేతలు అంగీకరిస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లోనే….?

కానీ పవన్ కల్యాణ్ తో పొత్తు కారణంగా కేవలం కొన్ని ప్రాంతాల్లోనే అనుకూలత ఉంటుందని, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యతిరేకత ఉంటుందన్న లెక్కలు కూడా టీడీపీ నుంచి విన్పిస్తున్నాయి. జనసేనతో పొత్తుకు దిగితే ఎక్కువ స్థానాలను ఆశించే అవకాశముందని, దానికి ఇరవైకి మించి సీట్లు ఇవ్వకుండా పొత్తు పెట్టుకోవడం మేలన్న సూచనలు కూడా వినపడుతున్నాయి. మొత్తం మీద టీడీపీ నేతల్లో పొత్తు లేకుంటే గెలవలేమని భయం మాత్రం గట్టిగా పట్టుకుంది.

Tags:    

Similar News