Tdp : ఇక్కడ ఉండటం వేస్ట్ అట.. అటు వైపు వెళ్లడమే బెటరట

తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇప్పుడు అవకాశం దొరికింది. వారికి జనసేన పార్టీ నీడ దొరికేటట్లుంది. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలో ఇటువంటి నేతలు [more]

Update: 2021-10-14 08:00 GMT

తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇప్పుడు అవకాశం దొరికింది. వారికి జనసేన పార్టీ నీడ దొరికేటట్లుంది. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలో ఇటువంటి నేతలు ఎక్కువ మంది కన్పిస్తున్నారు. ఈ జిల్లాలో గతంలో టీడీపీ బలంగా ఉంది. కానీ కొందరి నేతల ఆధిపత్యంతో ఇక్కడ టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. కొందరు పార్టీని వీడతామని గతంలో హెచ్చరికలు కూడా జారీ చేశారు.

కాపు సామాజికవర్గం….

తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గెలవాలంటే ఆ సామాజికవర్గం అండ అవసరం. అనేక నియోజకవర్గాల్లో వాళ్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అయితే టీడీపీలో కొందరి పెత్తనమే నడుస్తుంది. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పల మాటే చెల్లుబాటు అవుతుంది. మిగిలిన వారిని నాయకత్వం పెద్దగా పట్టించుకోదు. ఇటీవల గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇచ్చిన జర్క్ తో కొంత ఆయనకు ప్రిఫరెన్స్ ఈ మధ్యకాలంలో పెరిగింది.

పార్టీ నేతల వైఖరి కారణంగానే…

కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి 2014లో గెలిచిన పిల్లి అనంతలక్ష్మి పార్టీ పై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నిమ్మకాయల చినరాజప్ప కారణంగానే తాము పార్టీని వీడుతున్నట్లు వారు అప్పుడు ప్రకటించారు. అయితే తాజాగా వీరు జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన క్యాడర్ బలంగా ఉండటంతో వీరు ఆ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

ఈ మాజీ ఎమ్మెల్యే కూడా….

రాజానగరం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పెందుర్తి వెంకటేష్ కూడా జనసేన వైపు చూస్తున్నారని తెలిసింది. టీడీపీ కన్నా జనసేన గుర్తు అయితే ఈసారి గెలిచే అవకాశాలున్నాయని ఆయన భావిస్తున్నారు. అందుకే పెందుర్తి వెంకటేష్ ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. రాజానగరంలో వైసీపీని ఓడించాలంటే జనసేనలో చేరడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. మొత్తం మీద తూర్పు గోదావరి జిల్లా నుంచి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టీడీపీని వీడి జనసేనలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News