Tdp : పొత్తుకు ముందే భారీ ఎఫెక్ట్

తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో మంచి పట్టు ఉండేది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఈ జిల్లాలో నేతలు అనే వారు లేకుండా పోయారు. [more]

Update: 2021-10-13 06:30 GMT

తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో మంచి పట్టు ఉండేది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఈ జిల్లాలో నేతలు అనే వారు లేకుండా పోయారు. 19 నియోజకవర్గాలుంటే అందులో ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్ గా ఉండటం విశేషం. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా జిల్లాలో నేతలు పార్టీ కార్యక్రమాల్లో పొల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు దక్కించుకున్న వారు సయితం మొఖం చాటేశారు.

సీనియర్ నేతలున్నా….

తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి సీనియర్ నేతలున్నారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. వీరిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్పలు యాక్టివ్ గా ఉన్నారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు చురుగ్గా లేరు. ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడు అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెట్టడం తప్ప జిల్లాలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయడం లేదు.

పార్టీ కార్యక్రమాల వల్లనే….

కొద్దో గొప్పో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కొంత చురుగ్గానే ఉన్నారు. మిగిలిన నేతలందరూ కాడి కిందపడేశారనే చెప్పాలి. ఎవరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. క్యాడర్ కు కూడా దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గాల్లో పర్యటనలు కూడా చేయడం లేదు. ఇటీవల రైతు కోసం ఇచ్చిన కార్యక్రమంలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే నేతలు పాల్గొన్నారు. దీనిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

పొత్తు ఉంటుందని…..

జనసేనతో పొత్తు ఉంటుందని సంకేతాలు బయటకు రావడంతో నేతలు కూడా నిరాశలో ఉన్నారని తెలిసింది. ఈ జిల్లాలోనే జనసేన ఎక్కువ స్థానాలను కోరే అవకాశముంది. అందుకే ఇప్పటి నుంచి లేని పోని ఖర్చు ఎందుకన్న నిరాశలో అనేక మంది నేతలు ఉన్నారు. అందుకే ఖర్చు చేసేందుకు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎవరూ ఉత్సాహం చూపడం లేదు. పొత్తుకు ముందే ఈ జిల్లాలో టీడీపీపై భారీ ఎఫెక్ట్ పడినట్లే కనపడుతుంది.

Tags:    

Similar News