వైసీపీలో ఆ ఇద్దరి వార్ మొదలైంది
ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రాజకీయంగా చైతన్యం ఉన్న జిల్లా విజయనగరం. ఇక్కడ నుంచి అనేక మంది మేధావులు రాజకీయాల్లో రాష్ట్రం నుంచి కేంద్రం వరకు కూడా చక్రం తిప్పారు. [more]
ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రాజకీయంగా చైతన్యం ఉన్న జిల్లా విజయనగరం. ఇక్కడ నుంచి అనేక మంది మేధావులు రాజకీయాల్లో రాష్ట్రం నుంచి కేంద్రం వరకు కూడా చక్రం తిప్పారు. [more]
ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రాజకీయంగా చైతన్యం ఉన్న జిల్లా విజయనగరం. ఇక్కడ నుంచి అనేక మంది మేధావులు రాజకీయాల్లో రాష్ట్రం నుంచి కేంద్రం వరకు కూడా చక్రం తిప్పారు. ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా ఈ జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే, తాజా ఎన్నికల్లో మాత్రం ఇక్కడ వైసీపీ పాగా వేసింది. తొమ్మిది స్థానాల్లో విజయం సాధించి దూకుడు ప్రదర్శించింది. అయితే, ఇప్పుడు ఈ జిల్లాలోనే నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి పెరిగి.. అది వివాదాలకు దారితీసి, పార్టీ పరువును నాశనం చేస్తోందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. విజయనగరం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరిందన్న టాక్ వైసీపీ కేడర్‌ని కలవరపెడుతోంది.
ఎవరి శిబిరం వారిదే….
2014లో కాంగ్రెస్ నుంచి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కోలగట్ల వీరభ్రదస్వామి, తానే ఆ పార్టీకి తిరుగులేని నాయకుడినని అనుకుంటున్న సందర్భంలో, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వైసీపీలో చేరడంతో సమస్య మొదలైంది. బొత్స-కోలగట్ల మధ్య అప్పటి నుంచి చాపకింద నీరులా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారి విభేదాలు గతంలో కొన్నిసార్లు బహిర్గతమైన సందర్భాలూ ఉన్నాయి. దీంతో ఎవరి శిబిరాన్ని వారే నిర్వహించుకుంటూ వస్తున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణకి మంత్రి పదవి దక్కింది. కోలగట్లకు గతంలో మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినా, చివరి నిమిషంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు.
సత్తిబాబు అడ్డుపడ్డారని….
నిజానికి కోలగట్లకు మంత్రి పదవి ఇవ్వాలని చివరి నిముషం వరకు కూడా జగన్ పరిశీలించారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన కోలగట్లకు ఇచ్చేందుకు ఆయన రెడీ అయ్యారు. అయితే, దీనికి బొత్స సత్యనారాయణ అడ్డుపడ్డారనేది బహిరంగ రహస్యం. దీంతో నిన్నగాక మొన్న పార్టీలోకి(కోలగట్లతర్వాత) వచ్చిన విజయవాడకు చెందిన వైశ్య వర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస్‌కు జగన్ ఛాన్స్ ఇచ్చారు. దీంతో బొత్స వర్సెస్ కోలగట్ల మధ్య వార్ ప్రారంభమైంది. ఇక, ఎలాగూ.. జగన్ కోలగట్లకు కేబినెట్‌లో బెర్త్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు జిల్లా బాధ్యతలు అప్పగించారు. అందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తూ కలిసి పనిచేసుకోవాలంటూ కోలగట్లకు సూచనలు చేసారట జగన్.
జోక్యం చేసుకుంటే…?
దీంతో కోలగట్ల తన నియోజకవర్గంపై ఎవరైనా జోక్యం చేసుకుంటే కుదిరేదిలేదని బహిరంగంగానే కార్యకర్తలకు ఆదేశించారని సమాచారం. అదే సమయంలో మంత్రి గా ఉన్న బొత్స సత్యనారాయణ వర్గం కూడా విజయనగరంలో ఏం జరిగినా తమ దృష్టికి రావాలని ఆదేశించారట. దీంతో బొత్సా-కోలగట్ల వర్గీయులు జిల్లా కేంద్రంపై పట్టు కోసం ఢీ అంటే ఢీ అని అంటున్నా రు. తాజాగా జరగిన జిల్లా అభివృద్ది సమీక్షలో సైతం, కోలగట్ల వీరభద్ర స్వామి, బొత్స వర్గానికి ఘాటైన హెచ్చరిక కూడా చేశారు. ఎవరైనా తనకి తెలియకుండా పనులు చేస్తామని, పథకాలు ఇప్పిస్తామని ప్రజలవద్దకు వెళితే, సొంత పార్టీ వారినైనా సరే అరెస్ట్ చేయాలని అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేస్తానని కోలగట్ల హెచ్చరించారు.
కోలగట్ల పరోక్ష హెచ్చరికలు….
ఇది పరోక్షంగా బొత్స సత్యానారాయణ వర్గానికి విజయనగరం పట్టణ వ్యవహారాల్లో వేలుపెట్టొద్దంటూ కోలగట్ల వేసిన స్కెచ్‌గా భావిస్తు న్నారు. ఇదిలావుంటే, మరోవైపు వచ్చే మున్సిపల్ ఎన్నికల నుంచి విజయనగం కార్పొరేషన్‌గా మారుతుండటంతో మేయిర్ పదవిని ఎలాగైనా సాధించాలని బొత్స వర్గం ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తోందని తెలుస్తోంది. మేయర్ తమ వారైతే విజయనగరం పట్టణం తమ ఆధీనంలోనే ఉంటుందని, కోలగట్ల దూకుడికి కళ్లెం వేయొచ్చనే భావనలో బొత్స వర్గం ఉన్నట్టు సమాచారం. అటు కోలగట్ల సైతం తన కుమార్తెను విజయనగరం మొదటి మేయర్‌గా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారట. ఈ నేపథ్యంలో బొత్స-కోలగట్ల మధ్య వార్ రానున్న రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.