Tdp : టీడీపీలో వీఆర్ఎస్… వేర్వేరు రీజన్స్ తో సీనియర్ నేతలు?

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటో ఆ పార్టీ నేతల వైఖరే చెబుతుంది. వరసగా టీడీపీ నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నారు. ఇది [more]

Update: 2021-09-25 00:30 GMT

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటో ఆ పార్టీ నేతల వైఖరే చెబుతుంది. వరసగా టీడీపీ నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నారు. ఇది పార్టీలో ప్రమాదకరమైన సంకేతాలు పంపుతున్నాయి. ఎన్నికల ముందు నుంచే ఈ రాజకీయ సన్యాసాలు పసుపు పార్టీలో ప్రారంభమయ్యాయి. సీనియర్ నేతలు రాజకీయాలు దూరం కావడానికి కారణాలేంటి? పార్టీ పరిస్థిితి బాగాలేదనా? నాయకత్వంపై నమ్మకం లేకనా? టీడీపీకి రాజకీయ భవిష‌్యత్ లేదనా? ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కేఈ ఎన్నికలకు ముందే…

2019 ఎన్నికలకు ముందు పార్టీలో సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి రాజీకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆయనకు రాజకీయాల్లో సమకాలీకుడు చంద్రబాబు ఇంకా పాలిటిక్స్ లో ఉన్నా కేఈ మాత్రం తాను ఇక రాజకీయాల్లో ఉండనని చెప్పారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయను అని కూడా చెప్పారు. దీంతో పత్తికొండ ఎమ్మెల్యే స్థానాన్ని ఆయన కుమారుడు శ్యాంబాబుకు ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ఎన్నికలలో ఓటమి పాలయ్యారు.

జేసీ, గల్లాలు కూడా….

ఇక అనంతపురంలో సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక్కడా సేమ్ అలాగే ఆయన కుమారుడు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక చిత్తూరు రాజకీయాల్లో కీలకంగా ఉన్న గల్లా కుటుంబం నుంచి కూడా రాజకీయ సన్యాసం మాట విన్పించింది. గల్లా అరుణకుమారి పార్టీ పదవుల నుంచి తప్పుకోవడం దీనికి సంకేతంగా చెబుతున్నారు. గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఉండటంతో ఆమె పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

తాజాగా నాని….

తాజాగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ ఎన్నికల్లోనూ తన కుటుంబం పోట ీచేయదని చంద్రబాబుకు నేరుగా చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, వేరే వారికి టిక్కెట్ ఇచ్చుకోవచ్చని చంద్రబాబుకు నేరుగా చెప్పడంతో ఆయన అవాక్కయినట్లు తెలిసింది. తనపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమపై చర్యలు తీసుకోకపోవడంపై నాని ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు నాయకత్వంలో అనేక మంది సీనియర్ నేతలు స్వచ్ఛందంగానే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు.

Tags:    

Similar News