Tdp : ధైర్యం వచ్చిందంట… ఆ భయం పోయిందట

తెలుగుదేశం పార్టీలో ఆశలు పెరుగుతున్నాయి. జగన్ పార్టీని వచ్చే ఎన్నికల్లో సమర్థవంతంగా ఢీకొట్టేందుకు అవసరమైన రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని తెలుగు తమ్ముళ్లు గ్రహించారు. పవన్ కల్యాణ్ తో [more]

Update: 2021-10-07 05:00 GMT

తెలుగుదేశం పార్టీలో ఆశలు పెరుగుతున్నాయి. జగన్ పార్టీని వచ్చే ఎన్నికల్లో సమర్థవంతంగా ఢీకొట్టేందుకు అవసరమైన రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని తెలుగు తమ్ముళ్లు గ్రహించారు. పవన్ కల్యాణ్ తో పొత్తు దాదాపుగా ఖరారయినట్లేనన్న భావనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో నేతలు ఇప్పటికే జనసేన నేతలతో ఇంటర్నల్ సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పొత్తు కుదిరితే జిల్లాలో సీట్ల సర్దుబాటుపై కూడా టీడీపీలో చర్చ మొదలయిందంటే….?

రెండున్నరేళ్లుగా….

ఆంధ్రప్రదేశ్ లో గత రెండున్నరేళ్లుగా టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. అధికార పార్టీ అక్రమ కేసులు పెట్టడం, పార్టీ నాయకత్వంపై నమ్మకం లేకపోవడం, తిరిగి అధికారంలోకి వస్తామో? రామో? అన్న డైలమా వారిని ఇంటికే పరిమితం చేసింది. అయితే ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు వారిలో కొంత ఆశలు కల్పించాయి. జనసేన అధినేత ఇటీవల విజయవాడ పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఊరట కల్గించాయి.

ఇప్పటి వరకూ అనుమానమే….

ప్రధానంగా టీడీపీ కమ్మ సామాజికవర్గం నేతలు పెద్దయెత్తున రిలీఫ్ ఫీల్ అయ్యారంటున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగాలని యావత్ పార్టీ క్యాడర్ కోరుకుంటుంది. చంద్రబాబు నాయకత్వంలో ఒంటరిగా పోటీ చేయడానికి ఏ ఒక్క నేత ఇష్టపడటం లేదు. అయితే జనసేన, బీజేపీ పొత్తుతో ఉండటంతో దాని సాధ్యాసాధ్యాలపై ఇప్పటి వరకూ పార్టీ నేతల్లో అనుమానాలున్నాయి. ఎంపీీటీసీ ఎన్నికల్లో పొత్తు కుదర్చుకున్నా అది అంతవరకే పరిమితమని భావించారు.

ఆయన కామెంట్స్ తో….

కానీ పవన్ కల్యాణ‌్ కామెంట్స్ తో ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు కొంత సుముఖత చూపుతున్నారని టీడీపీ నేతల్లో ధీమా పెరిగింది. వచ్చే ఎన్నికలలో జనసేనతో పొత్తు ఉంటే విజయం ఖాయమని నమ్ముతున్నారు. అందుకే కొన్ని చోట్ల టీడీపీ, జనసేన నేతలు అంతర్గత సమావేశాలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ప్రధానంగా గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో జనసేనతో కలసి దుమ్ము దులుపుతామని టీడీపీ నేతలు సవాల్ విసుతున్నారు.

Tags:    

Similar News