మళ్లీ ఆయనే దిక్కయ్యారా?
కృష్ణాజిల్లాలో ఒకప్పుడు టీడీపీకి కంచుకోట వంటి గుడివాడ నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ వేడెక్కా యి. ఇక్కడ వరుస విజయాలు సాధిస్తున్న కొడాలి శ్రీవేంకటేశ్వరరావు, ఉరఫ్ నానిని బలంగా [more]
కృష్ణాజిల్లాలో ఒకప్పుడు టీడీపీకి కంచుకోట వంటి గుడివాడ నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ వేడెక్కా యి. ఇక్కడ వరుస విజయాలు సాధిస్తున్న కొడాలి శ్రీవేంకటేశ్వరరావు, ఉరఫ్ నానిని బలంగా [more]
కృష్ణాజిల్లాలో ఒకప్పుడు టీడీపీకి కంచుకోట వంటి గుడివాడ నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ వేడెక్కా యి. ఇక్కడ వరుస విజయాలు సాధిస్తున్న కొడాలి శ్రీవేంకటేశ్వరరావు, ఉరఫ్ నానిని బలంగా ఢీకొట్టేందు కు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ఎప్పటికప్పుడు విధాన నిర్ణయాలు మార్చు కుంటున్నా పార్టీలో పాత హవా కనిపించడం లేదు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం కావడం, ఆయన ఇక్కడ ఒకసారి గెలుపుగుర్రం ఎక్కడం తర్వాత పార్టీ పుంజుకోక పోవడం తెలిసిందే. దీనికి తోడు పార్టీలో నుంచి బయటకు వచ్చిన కొడాలి నాని ఇప్పుడు పార్టీకి “అమ్మ మొగుడుగా“ అవ తరించడం టీడీపీలో కలకలం సృష్టిస్తోంది.
ఒక్క ఛాన్స్ ఇచ్చి…..
విషయంలోకి వెళ్తే.. టీడీపీకి గుడివాడ ఒకప్పుడు కంచుకోట. అయితే, కొడాలి నాని ఎంట్రీతో అప్పటి వరకు పార్టీ పరంగా ఉన్న ఓటు బ్యాంకు వ్యక్తిగతంగా మారిపోయింది. వ్యక్తిని బట్టి ఓటు వేయడం ఏర్పడింది. ఈ క్రమంలోనే 2004లో చంద్రబాబు కొడాలి నానికి ఇక్కడ ఒక్క ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రావి వెంకటేశ్వరరావును కాదని జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతోనే కొడాలి నానికి సీటు దక్కింది. ఆ ఎన్నికల్లో గెలిచిన కొడాలి నాని తన పట్టు పెంచుకున్నారు. అంటే పార్టీతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో వ్యక్తిగత ఇమేజ్‌తో దూసుకు వెళ్లడం ప్రారంభించారు.
పార్టీలతో సంబంధం లేకుండా….
ఈ నేపథ్యంలోనే 2009లో మరోసారి ఆయన ఇక్కడ నుంచి టీడీపీ జెండాపై విజయం సాధించారు. ఇక, ఆ తర్వాత చంద్రబాబుతో తీవ్రస్థాయిలో విభేదించి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు కొడాలి నాని. అయితే, నానికి ఎలాగైనా చెక్ పెట్టాలని అనుకున్న చంద్రబాబు 2014లో రావి వెంకటేశ్వరావుకు టికెట్ ఇచ్చారు. టీడీపీ తరపున ఈయన బరిలోకి దిగగా వైసీపీ తరపున కొడాలి నాని పోటీ చేశారు. అయితే, కొడాలి నాని విజయంసాధించారు. పార్టీలతో సంబంధం లేకుండా నానిదే గెలుపు అవుతూ వస్తోంది.
మళ్లీ రావికే పగ్గాలు?
2014 ఎన్నికల్లో ఓడిన రావి 2019 ఎన్నికల్లో సీటు కోసం ప్రయత్నించారు. అయితే, ఎన్నికల సమయానికి చంద్రబాబు రావిని పక్కన పెట్టి విజయవాడ నుంచి దేవినేని అవినాష్‌ను దింపారు. ఈయన కూడా గత ఏడాది ఎన్నికల్లో కొడాలి నానిపై పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అవినాష్ ఏకంగా టీడీపీనే విడిచి బయటకు వచ్చేసి అధికార పార్టీతో చేతులు కలిపారు. అవినాష్ వైసీపీ జెండా కప్పుకుని విజయవాడ తూర్పు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. దీంతో ఇప్పుడు గుడివాడలో టీడీపీ జెండా మోసే నాయకులు లేకుండా పోయారు. ఈ పరిణామాలను గమనించిన చంద్రబాబు మళ్లీ ఇప్పుడు రావి వెంకటేశ్వరరావునే దువ్వుతున్నారని సమాచారం.
అలిగిన రావి…..
2019లో తనకు టికెట్ ఇవ్వకపోవడంపై అలిగిన రావి వెంకటేశ్వరరావు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ అసలు ఉంటుందా? ఉండదా? అనే చర్చ వచ్చింది. దీంతో అలెర్ట్ అయిన చంద్రబాబు వెంటనే రావిని ఇక్కడ నుంచి రంగంలోకి దింపుతామని సిగ్నల్స్ పంపారని తెలిసిందే. మరి దీనికి రావి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కొసమెరుపు ఏంటంటే.. వాడుకుని వదిలేసే నాయకుడు మా నేతే! అంటూ గత ఏడాది ఎన్నికలకు ముందు అంతర్గత విమర్శలు చేసిన రావిని ఇప్పుడు చంద్రబాబు దువ్వుతుండడం.