ఆయననే నియమించడంలో అర్థమదేనా?
జమ్మలమడుగు రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. పార్టీని వీడిన నేతలకు తిరిగి టిక్కెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో రామసుబ్బారెడ్డికి నో ఎంట్రీ అని [more]
జమ్మలమడుగు రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. పార్టీని వీడిన నేతలకు తిరిగి టిక్కెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో రామసుబ్బారెడ్డికి నో ఎంట్రీ అని [more]
జమ్మలమడుగు రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. పార్టీని వీడిన నేతలకు తిరిగి టిక్కెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో రామసుబ్బారెడ్డికి నో ఎంట్రీ అని చెప్పాలి. ఒకవేళ పార్టీలోకి వచ్చినా కండువా కప్పుతారు కాని టిక్కెట్ ఇచ్చే పరిస్థిితి లేదు. అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల జమ్మలమడుగు నియోజకవర్గంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేవగుడి ఫ్యామిలీ నుంచే….
జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జిగా దేవగుడి భూపేశ్ రెడ్డి పేరును ఖరారు చేశారు. దీంతో ఇద్దరు నేతలకు చంద్రబాబు చెక్ పెట్టినట్లయింది. పార్టీని వీడి వెళ్లిన రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలకు ఒకరకంగా షాక్ ఇచ్చారనే చెప్పాలి. నిజానికి బీజేపీలోకి వెళ్లిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ వేధింపులుంటాయని భావించి ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీలో చేరిపోయారు.
ఇద్దరు నేతలను…
ఇక మరో నేత రామసుబ్బారెడ్డి సయితం వైసీీపీలో ఇమడలేకపోతున్నారు. జమ్మలమడుగు టిక్కెట్ ను కూడా వచ్చే ఎన్నికల్లో సుధీర్ రెడ్డికే అని రామసుబ్బారెడ్డికి వైసీపీ అధినాయకత్వం స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పింది. అయితే రామసుబ్బారెడ్డి మాత్రం తన క్యాడర్ లో నెలకొన్న అసంతృప్తితో తిరిగి టీడీపీ గూటికి చేరాలనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నిర్ణయంతో ఆయన పునరాలోచనలో పడినట్లు తెలిసింది.
టీడీపీ క్యాడర్ కోసమే…
జమ్మలమడుగులో ఇన్ ఛార్జిగా నియమించిన దేవగుడి భూపేశ్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కుమారుడు. ఆదినారాయణ రెడ్డి సోదరుడు టీడీపీలో కొనసాగుతున్నారు. జమ్మలమడుగులో కొంత పట్టు సాధించాలంటే దేవగుడి కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఇన్ ఛార్జిగా భూపేశ్ రెడ్డిని నియమించినా ఎన్నికల సమాయానికి ఈక్వేషన్లు బట్టి నిర్ణయం ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పటి పరిస్థితుల్లో చంద్రబాబు ఇద్దరు కీలక నేతలకు చెక్ పెట్టినట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.