కొత్త నేత వచ్చినా ఇక అంతేనా?
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తన పార్టీలో నేతలకు కొదవలేదని చెప్పుకోవాడినికే ఈ నియామకం చేసినట్లుంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కిన నరసింహులును చంద్రబాబు ఎంపిక [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తన పార్టీలో నేతలకు కొదవలేదని చెప్పుకోవాడినికే ఈ నియామకం చేసినట్లుంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కిన నరసింహులును చంద్రబాబు ఎంపిక [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తన పార్టీలో నేతలకు కొదవలేదని చెప్పుకోవాడినికే ఈ నియామకం చేసినట్లుంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కిన నరసింహులును చంద్రబాబు ఎంపిక చేశారు. మాజీ ఎమ్మెల్యే అయిన ఆయనను సామాజికవర్గం కోణంలో టీటీడీపీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అయితే ఎంపికపై పార్టీలోనే తీవ్ర అసంతృప్తులు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు ఎవరూ రావడం లేదట.
రమణ వీడిన తర్వాత….?
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ సుదీర్ఘ కాలం కొనసాగారు. ఆయనకు అధ్యక్ష పదవిని చంద్రబాబు రెండోసారి కూడా రెన్యువల్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఎల్ రమణ తనకు అవకాశం రావడంతో పార్టీని వదిలేసి వెళ్లి పోాయారు. దీంతో అసలే తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పూర్తిగా దెబ్బతినింది. అప్పటికే అనేక మంది సీనియర్ నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు సయితం టీడీపీని వదలివెళ్లారు.
ఆయన ఉన్నప్పుడు…..
ఇక ఎల్.రమణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొద్దో గొప్పో టీటీడీపీ పేరు విన్పించేది. విపక్షాలతో కలసి ఆయన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడటంతో పసుపు జెండా కన్పించేది. అయితే కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పార్టీ ఊసే లేకుండా పోయింది. ఆయన పార్టీ కార్యక్రమాలకు పిలుపు ఇస్తుంది లేదు. ఇచ్చినా ఉన్న కొద్దిమంది నేతలు హాజరయ్యే అవకాశం లేదు. ఇటీవల కొత్త అధ్యక్షుడు దళితబంధుపై చర్చించేందుకు సమావేశానికి హాజరుకావాలని కోరినా ఎవరూ రాలేదట.
రేవంత్ కారణమేనా?
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉందట. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో చంద్రబాబు కావాలనే ఈ నియామకం చేపట్టినట్లు కూడా పార్టీ వర్గాల నుంచి విన్పిస్తుంది. కాంగ్రెస్ డ్యామేజీ కాకుండా ఉండాలంటే పెద్దగా ఇబ్బంది పెట్టని, పడని నేతను చంద్రబాబు నియమించారన్న టాక్ ఉంది. మొత్తం మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొత్త అధ్యక్షుడు రాక పార్టీలో ఎలాంటి మార్పులు తీసుకురాలేదు.