Tdp : ఆ రెండు జిల్లాలే… వారే ఎందుకు ఫైర్ బ్రాండ్ లు?

ఆ రెండు జిల్లాల్లోనే తెలుగుదేశం పార్టీ నేతలు యాక్టివ్ గా ఉన్నారు. ఆ రెండు జిల్లాల వైసీపీ నేతలనే టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో [more]

Update: 2021-10-03 15:30 GMT

ఆ రెండు జిల్లాల్లోనే తెలుగుదేశం పార్టీ నేతలు యాక్టివ్ గా ఉన్నారు. ఆ రెండు జిల్లాల వైసీపీ నేతలనే టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. పదమూడు జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ లో కేవలం రెండు జిల్లాల నేతల హడావిడి పార్టీలో ఎక్కువగా కన్పిస్తుంది. వీరికి వచ్చే ఎన్నికల్లో తమకు గెలుపు ఖాయమన్న ధీమా కన్పించడమే కారణమా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. మిగిలిన జిల్లాల నేతల్లో అయ్యన్న పాత్రుడు లాంటి వారు ఒకరిద్దరు నేతలు మినహా ఎవరూ పెద్దగా కన్పించడం లేదు.

మూడు రాజధానుల ప్రతిపాదనతో….

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాలు మాత్రమే అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో ఇటు గుంటూరు, అటు కృష్ణా జిల్లాల్లో అన్ని రకాలుగా లబ్ది చేకూరింది. ఇంటి అద్దెల నుంచి స్థలాల ధరల వరకూ నింగినంటాయి. రాజధాని రాకతో అన్ని వర్గాల ప్రజలు సంతోషించారు.

ఇక్కడి నేతలే….

కానీ జగన్ వచ్చిన తర్వాత మూడు రాజధానులు ప్రకటన చేయడంతో ఇంటి అద్దెలు తగ్గిపోయాయి. రియల్ ఎస్టేట్ కూడా మందగించింది. భూముల ధరలు నేలను చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించిన ఈరెండు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు పార్టీలో యాక్టివ్ గా కన్పిస్తున్నారు. బొండా ఉమ, పట్టాభి, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, బుద్దా వెంకన్న, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, యరపతినేని శ్రీనివాస్ వంటి నేతలే ప్రముఖంగా పార్టీలో యాక్టివ్ గా కన్పిస్తున్నారు.

వైసీీపీ నేతలే టార్గెట్….

ఈ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలపైనే విమర్శలకు ఎక్కువగా దిగుతున్నారు. కొడాలి నాని, సామినేని ఉదయభాను, మల్లాది విష‌్ణు, జోగి రమేష్ వంటి వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. డ్రగ్స్ గుజరాత్ లో దొరికితే ఇక్కడ వైసీపీ నేతలకు దానిని అంటగట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. డీజీపీ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. మొత్తం మీద ఈ రెండు జిల్లాల నేతలే తమకు రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో లాభిస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నట్లుంది. మిగిలిన జిల్లాల టీడీపీ నేతలు మాత్రం పెద్దగా ఎక్కడా కన్పించకపోవడం విశేషం.

Tags:    

Similar News