tdp : దమ్మున్న నేతలు ఏమైపోయారు?

తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతినింది. దీంతో నేతలతో పాటు క్యాడర్ కూడా డీలా పడ్డారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో సయితం టీడీపీ [more]

Update: 2021-10-02 13:30 GMT

తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతినింది. దీంతో నేతలతో పాటు క్యాడర్ కూడా డీలా పడ్డారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో సయితం టీడీపీ దెబ్బతినడం పార్టీ అధినేతకు ఇబ్బందికరంగా మారింది. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడం కష్టమే. చంద్రబాబుకు ఉన్న నమ్మకమంతా తానే. తన సమర్థతను ఏపీ ప్రజలు గుర్తిస్తారని చంద్రబాబు ఇప్పటికీ నమ్ముతున్నారు.

వేవ్ వీచినా?

గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ వీచినా కొన్ని జిల్లాల్లో తట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ప్రకాశం జిల్లా ఒకటి. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికలలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. అద్దంకి, పర్చూరు, చీరాల, కొండపి నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రకాశం జిల్లాలోని 55 జడ్పీటీసీ స్థానాలకు 55 ను వైసీపీ సొంతం చేసుకుంది. ఎంపీటీసీ స్థానాలను కూడా అధిక సంఖ్యలోనే గెలుచుకుంది.

బహిష్కరించినా…..

ీఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ రెండు చోట్ల టీడీపీ తో కాకుండా వ్యక్తిగతంగా ప్రభావం చూపే నేతలున్నారు. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పర్చూరులో ఏలూరు సాంబశివరావులు సొంత ఇమేజ్ తో అభ్యర్థులను గెలిపించుకునే దమ్మూ, ధైర్యం ఉంది. కానీ ఈ ఎన్నికల్లో పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రభావం చూపకపోవడం చర్చనీయాంశమైంది.

సైకిల్ కు ఓవర్ హాలింగ్ తప్పదా?

ప్రకాశం జిల్లా మాదిరిగానే అన్ని చోట్ల అదే పరిస్థితి. పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా గెలిపించుకునే సత్తా ఉన్న నేతలున్నప్పటికీ ఎన్నికలను వదిలేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ను ఓవర్ హాలింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. ఈ రెండేళ్ల కాలంలో నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఇప్పటి నుంచే చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టాల్సి ఉంటుంది.

Tags:    

Similar News