మళ్లీ దారి మార్చారా…?
పాపం ప్రత్యర్థులు… ఒక్కటైనా చిత్తయ్యారు. వారి స్వార్థపూరిత పాచికలు జనంపై పారలేదు. అనుచరులు అంతకన్నా ఆదరించలేదు. కొట్లాటను పక్కనబెట్టి ఓట్ల కోసం ఒక్కటై.. నోట్లు గుమ్మరించినా ప్రజలు [more]
పాపం ప్రత్యర్థులు… ఒక్కటైనా చిత్తయ్యారు. వారి స్వార్థపూరిత పాచికలు జనంపై పారలేదు. అనుచరులు అంతకన్నా ఆదరించలేదు. కొట్లాటను పక్కనబెట్టి ఓట్ల కోసం ఒక్కటై.. నోట్లు గుమ్మరించినా ప్రజలు [more]
పాపం ప్రత్యర్థులు… ఒక్కటైనా చిత్తయ్యారు. వారి స్వార్థపూరిత పాచికలు జనంపై పారలేదు. అనుచరులు అంతకన్నా ఆదరించలేదు. కొట్లాటను పక్కనబెట్టి ఓట్ల కోసం ఒక్కటై.. నోట్లు గుమ్మరించినా ప్రజలు వారికి దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. ఇంతకీ.. ఎవరా ప్రత్యర్థులు..? ఏమిటా కథా..? అని ఆలోచిస్తున్నారా..? అయితే మీరు ఈ చిన్నపాటి ఆసక్తికరమైన కథనాన్ని చదవాల్సిందే. అది కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం. నిత్యం పగలూ ప్రతీకారాలతో రగిలిపోయే ప్రత్యర్థులు రామసుబ్బారెడ్డి, ఆది నారాయణరెడ్డి. పొరపాటున ఎదురుపడితే.. బాబోయ్..! ఏం జరుగుతుందోనని జనం బెంబేలెత్తిపోవాల్సిందే. అంతలా ప్రభావితం చేశారు.. కాదు కాదు.. భయపెట్టారు జనాన్ని.
ఇద్దరూ ఒక్కటయినా….
ఇలా నిత్యం రగిలిపోతున్న ఇద్దరినీ కలిపి.. వైసీపీ అధినేత జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత చంద్రబాబు తాను అనుకున్నది అనుకున్నట్లు చేశారు. జమ్ములమడుగు నుంచి వైసీపీ అభ‌్యర్థిగా గెలిచి, తర్వాత టీడీపీలో చేరి, మంత్రి పదవి కొట్టేశారు ఆదినారాయణ రెడ్డి. 2019 ఎన్నికల్లో ఆయన ఏకంగా కడప ఎంపీగా పోటీ చేశారు. అదే సమయంలో చిరకాల ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి జమ్ములమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే.. గతమంతా మరిచిపోయి.. ఒకరికొకరు కలిసిపోయి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమ ఇద్దరినీ గెలిపించాలని ప్రజలను కోరారు.
వారు మెచ్చలేదుగా….
ఇద్దరు ప్రత్యర్థులు కలవడంతో.. ఇక వారి విజయం ఖాయమని అనుకున్నారు. చంద్రబాబు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కానీ.. వైసీపీ అధినేత జగన్ తుఫాన్‌లో అందరూ కొట్టుకుపోయారు. జమ్ములమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామసుబ్బారెడ్డి, కడప ఎంపీగా పోటీ చేసినా ఆదినారాయణరెడ్డిలిద్దరూ ఓటమిపాలయ్యారు. స్వార్థ రాజకీయాల కోసం ఒక్కటైన వీరిని జనం ఆదరించలేదన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే సమయంలో అనుచరులు కూడా వీరి స్వార్థ కలయికను స్వాగతించలేదు. దీంతో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలతో చంద్రబాబు వేయించిన ప్లాన్ అట్టర్‌ఫ్లాప్‌గా మిగిలిపోయింది. చివరకు ఈ ఇద్దరు నేతలకు ఇప్పుడు రాజకీయ సన్యాసమే ఆల్ట్రనేటివ్‌గా ఉందన్న చర్చలు కూడా జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఓటమి తర్వాత తిరిగి ఎవరి దారి వారిదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు.