Tg Bharath : అదే తనకు కలసివస్తుందట
కర్నూలు జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. అక్కడ గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. గత రెండుసార్లు నుంచి కర్నూలు టౌన్ నియోజకవర్గం [more]
కర్నూలు జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. అక్కడ గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. గత రెండుసార్లు నుంచి కర్నూలు టౌన్ నియోజకవర్గం [more]
కర్నూలు జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. అక్కడ గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. గత రెండుసార్లు నుంచి కర్నూలు టౌన్ నియోజకవర్గం నుంచి టీడీపీ వరసగా ఓటమి పాలవుతూ వస్తుంది. ఇక్కడ వైసీపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలన్న భావనతో ఉంది. వైసీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో గెలవడంతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని టీడీపీ భావిస్తుంది. కర్నూలు టౌన్ నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీలో తలెత్తిన విభేదాలు టీడీపీకి అడ్వాంటేజీగా మారాయి.
టీడీపీ వీక్ అయినా….
తెలుగుదేశం పార్టీకి టీజీ భరత్ కర్నూలు టౌన్ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి బీజేపీలో ఉన్నా ఆయన టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. కర్నూలు టౌన్ లో పారిశ్రామికవేత్తగా టీజీ కుటుంబానికి మంచి పేరుంది. టీజీ వెంకటేష్ ను సయితం ఎమ్మెల్యేగా ప్రజలు ఆదరించారు. ఇక్కడ టీడీపీకీ పెద్దగా పట్టులేకపోయినా ఇప్పుడు వైసీపీలో నెలకొన్న విభేదాల కారణంగా పార్టీ పుంజుకునే అవకాశాలున్నాయి.
వారి మధ్య విభేదాలే….
వైసీపీలో గ్రూపు విభేదాలు తీవ్రమయ్యాయి. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య నువ్వా? నేనా? అన్నట్లు పోరు సాగుతుంది. గత ఎన్నికల్లోనూ టీడీపీ తరుపున టీజీ భరత్ పోటీ చేశారు. హఫీజ్ ఖాన్ పైన కేవలం ఐదువేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. అంతటి జగన్ వేవ్ లోనూ హఫీజ్ ఖాన్ మెజారిటీ సాధించలేకపోయారు. ఆ ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ కు ఎస్వీమోహన్ రెడ్డి కూడా మద్దతు తెలిపారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ….
కానీ ఈసారి ఎస్వీ, హఫీజ్ ఖాన్ ల మధ్య నెలకొన్న విభేదాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయంపై ప్రభావం చూపే అవకాశముంది. అందుకే టీజీ భరత్ యాక్టివ్ అయ్యారు. కోవిడ్ సమయంలోనూ కీలకంగా మారారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో టీజీ భరత్ పనిచేస్తున్నారు. కర్నూలు టౌన్ నిత్యం పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం మీద వైసీపీలో విభేదాలు తనకు కలసి వస్తాయని ఈసారి టీజీ భరత్ బలంగా నమ్ముతున్నారు.