కాంగ్రెస్ లో లుకలుకలు.. శివసేనకు చెమటలు

ప్రస్తుతం కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు దాని మిత్రపక్షాలను వణికిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం తమకు ఎక్కుడ ముప్పు తెస్తుందోనన్న ఆందోళనలో ఉన్నాయి. ప్రధానంగా [more]

Update: 2020-09-04 18:29 GMT

ప్రస్తుతం కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు దాని మిత్రపక్షాలను వణికిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం తమకు ఎక్కుడ ముప్పు తెస్తుందోనన్న ఆందోళనలో ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అయితే మహారాష్ట్ర, పుదుచ్చేరి వంటి చోట్ల సంకీర్ణ సర్కార్ ఏర్పాటయింది.

అంతర్గత సంక్షోభంతో…..

ఇటీవలే రాజస్థాన్ సంక్షోభం నుంచి కాంగ్రెస్ బయటపడింది. సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడంతో కథ సుఖాంతమైంది. లేకుంటే రాజస్థాన్ లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండేది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లోని 23 మంది సీనియర్లు లేఖ ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం, నాయకత్వంపై విమర్శలు చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ అధిష్టానం కూడా దీనిపై సీరియస్ గా తీసుకుంది.

శివసేన భయం అదే….

అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు తమకు ముప్పు తెస్తాయని వాటి మిత్రపక్షాలు భావిస్తున్నాయి. అందులో శివసేన ఒకటి. మహారాష్ట్రలో శివసేన కాంగ్రెస్, ఎన్సీపీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ మహారాష‌్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. కేంద్ర నాయకత్వంలోని లుకలుకలతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళతారన్న ఆందోళన శివసేనను వెంటాడుతోంది.

అందుకే స్మూత్ వార్నింగ్…..

అందుకే శివసేన కేంద్ర నాయకత్వాన్ని సుతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో వెల్లడించింది. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టకుండా నిరోధిస్తే కాంగ్రెస్ సర్వ నాశనమైపోతుందని హెచ్చరించింది. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు మిత్రపక్షమైన శివసేనకు ఇబ్బందికరంగా మారాయి. అందుకే పార్టీని సత్వరమే సెట్ చేయకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.

Tags:    

Similar News