ఈయన తప్ప ఇంకెవరూ లేరా?

తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే బలోపేతం అవుతుంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా పగ్గాలు అందుకున్న తర్వాత కొంత పార్టీ పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే పీసీసీ నియామకంలో [more]

Update: 2021-08-12 11:00 GMT

తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే బలోపేతం అవుతుంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా పగ్గాలు అందుకున్న తర్వాత కొంత పార్టీ పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే పీసీసీ నియామకంలో కొందరు సీనియర్ నేతలు పెదవి విరుస్తున్నారు. అనవసరంగా కొందరు నేతలకు పదవులు కట్టబెట్టారన్న విమర్శలు పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. అందులో అజారుద్దీన్ ఒకరు. అజారుద్దీన్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది.

కరెక్ట్ కాదంటూ…

అజారుద్దీన్ నియామకం కరెక్ట్ కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అజారుద్దీన్ పార్టీకి ఏనాడూ ఉపయోగపడలేదని, పార్టీయే అతనికి ఉపయోగపడిందనడంలో అతిశయోక్తి కాదు. అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది ఆయన ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ఆయన పార్టీలో పెద్దగా యాక్టివ్ గా ఉండింది లేదు. అజారుద్దీన్ ను తెలంగాణ రాజకీయాలకే పరిమితం చేయాలని హైకమాండ్ భావించింది.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా….

2018 ఎన్నికల్లోనూ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ గత మూడేళ్ల నుంచి ఆయన పార్టీలో యాక్టివ్ గా లేరు. అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన హెచ్.సి.ఏ కే పరిమితమయ్యారు. దీనికి తోడు అజారుద్దీన్ టీఆర్ఎస్ కు దగ్గరయ్యారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. హెచ్.సీ.ఏలో తన ప్రత్యర్థులను ఎదుర్కొనాలంటే అధికార పార్టీ అండ అవసరమని అజారుద్దీన్ భావిస్తున్నారు.

యాక్టివ్ గా లేని…

కాంగ్రెస్ పార్టీకి 2014 నుంచి ఎంఐఎం పార్టీ దూరంగా ఉంది. అప్పటి నుంచి ముస్లిం సామాజికవర్గం కాంగ్రెస్ కు అండగా లేదు. దీంతో ఆ సామాజికవర్గ నేతగా అజారుద్దీన్ ఎంపికను హైకమాండ్ చేసిందంటున్నారు. యాక్టివ్ గా లేని అజారుద్దీన్ ను కాకుండా అదే సామాజికవర్గానికి చెందిన మరో నేతను ఎంపిక చేసి ఉంటే బాగుండేందన్న సూచనలు అందుతున్నాయి. పార్టీ పిలుపు ఇచ్చిన ఏ కార్యక్రమంలోనూ ఆయన ఇంతవరకూ పాల్గొన్నది లేదు. మొత్తం మీద ఏ విధంగా పార్టీకి ఉపయోగపడని అజారుద్దీన్ ఎంపిక పార్టీలో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News