Tdp : రెండు కలసి పోయాయా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. పొత్తు ఒకరితో, పదవుల కోసం ప్రయాణం మరొకరితోనూ సాగుతుండటం చర్చనీయాంశమైంది. పార్టీ అధినేతల ప్రమేయం లేకుండానే ఇవి జరిగిపోతున్నాయా? లేదా [more]

Update: 2021-09-24 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. పొత్తు ఒకరితో, పదవుల కోసం ప్రయాణం మరొకరితోనూ సాగుతుండటం చర్చనీయాంశమైంది. పార్టీ అధినేతల ప్రమేయం లేకుండానే ఇవి జరిగిపోతున్నాయా? లేదా అంతా తెలిసే భవిష్యత్ లో జరిగేదే ఇప్పుడు మొదలయిందా? అన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన, టీడీపీ పొత్తుపై గత కొంతకాలంగా ఊహాగానాలు విన్పిస్తున్నాయి. రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో పొత్తుతో కలసి వెళతాయని చాలా విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

ఎన్నికలకంటే ముందుగానే…

అయితే అంతకంటే ముందుగానే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడం విశేషం. ఇటీవల పరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. చాలా తక్కువ స్థానాల్లోనే జనసేన, బీజేపీ గెలిచాయి. ఈ రెండు ఎన్నికల్లో పొత్తుతో కలసి ప్రయాణించాయి. అయితే ఫలితాల తర్వాత జనసేన స్థానిక నేతలు టీడీపీతోనే పొత్తు కోరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ జనసేన, టీడీపీ అభ్యర్థులు గెలవడంతో ఎంపీపీ పదవిని కైవసం చేసుకోవడానికి రెండు పార్టీలు కలసి పోతున్నాయి.

టీడీపీతో కలసి…

ప్రధానంగా ఇది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కన్పిస్తుంది. మున్సిపల్ , ఎంపీటీసీ ఎన్నికల సమయంలోనే చింతలపూడి ప్రభాకర్ వంటి నేతలు బహిరంగంగానే చెప్పారు. తాము అవసరమైతే జనసేనతో కలసి పోటీ చేస్తామని ఆయన అనడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కానీ అదే ఇప్పుడు జరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కడియం, వీఆర్ పురం, ఆలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట, వీరవాసరం వంటి ప్రాంతాల్లో టీడీపీ, జనసేన కలసి పదవులను దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఫిఫ్టీ… ఫిప్టీ సమయం…

ఇది కూడా పదవులు చెరి రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలన్న ప్రాతిపదికన ఈ పొత్తు కుదుర్చుకుంటున్నారు. అయితే ఈ పొత్తు ివిషయంలో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. టీడీపీతో పొత్తు పెట్టుకోమని అనైకతమని ఒక వర్గం బీజేపీ నేతలు అంటున్నారు. కానీ పదవుల కోసం టీడీపీతో పొత్తు పెట్టుుకుంటే తప్పేమిటని స్థానిక జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికలు ఏపీలో సాధారణ ఎన్నికలకు ముందే ప్రత్యేక పరిస్థితులను తెచ్చి పెట్టాయనే చెప్పాలి.

Tags:    

Similar News