లంగర్ ఇప్పట్లో తీసేది లేదా …?

ఉభయగోదావరి జిల్లాల పేరు వింటేనే అంతా పులకరించేస్తారు. అందమైన ప్రకృతి నడుమ గలగలా పారే గోదావరి. పాపికొండల అందాలు. దిండి రిసార్ట్స్ లో విశ్రాంతి తీసుకుంటు ఆంధ్రా, [more]

Update: 2020-04-29 00:30 GMT

ఉభయగోదావరి జిల్లాల పేరు వింటేనే అంతా పులకరించేస్తారు. అందమైన ప్రకృతి నడుమ గలగలా పారే గోదావరి. పాపికొండల అందాలు. దిండి రిసార్ట్స్ లో విశ్రాంతి తీసుకుంటు ఆంధ్రా, కేరళ వంటి కోనసీమ అందాలు ఆస్వాదించే అనుభవాలే వెళ్ళివచ్చినవారికి తీపిగుర్తులు. ఇక అలాగే దేశంలోనే తలమానికమైన నర్సరీలు. కొంత దూరం వెళ్లగలిగితే మారేడుమిల్లి ఎకో టూరిజం. విశిష్ట దేవాలయాలు అన్నవరం, పంచారామక్షేత్రాల్లోని ద్రాక్షారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, కాకినాడ చుట్టూ ఉండే మడ అడవులు ఇలా ఒకటేమిటి గోదావరి జిల్లాలను చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలే కాదు రుచులకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు.

సీన్ రివర్స్ …

పాపికొండల సందర్శనకు గోదావరి వరదల్లో బయల్దేరి బోటు బోల్తా పడిన సంఘటన తరువాత మొత్తం పర్యాటకం పెద్ద కుదుపునకు లోనయింది. ఆ తరువాత వేసవిలో కోలుకుంటుంది అనుకుంటే కరోనా రూపంలో మరో రక్కసి గోదావరి టూరిజం పై ఆధారపడిన వేలకుటుంబాలను రోడ్డున పడేశాయి. అటు బోట్ లు లంగరేసి చాలా నెలలే అయ్యింది. దాంతో సరంగుల నుంచి హోటల్ పరిశ్రమపై ఆధారపడే వారి వరకు ఉపాధి కోల్పోయారు. అలాగే గోదావరి జిల్లాలకు పర్యాటకులను తీసుకువచ్చే టూరిస్ట్ బస్సులు, క్యాబ్ లు తిరుగుతున్నదె లేదు. ఇలా పర్యాటకం పై ఆధారపడ్డ అన్ని వర్గాలు ఇప్పుడు కరోనా మహమ్మారి కి బలైపోయారు. దాంతో ప్రభుత్వం తమను అన్ని విధాలా ఆదుకుంటుందని ఆశగా ఎదురు చూస్తున్నాయి ఈ వర్గాలు.

Tags:    

Similar News