అందుకే ఆ అసహనమట

ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో కీల‌క నాయ‌కుడు, గ‌తంలో టీడీపీలో చ‌క్రం తిప్పి. అనూహ్యంగా కేసీఆర్‌కు మ‌ద్దతిచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర [more]

Update: 2020-02-21 09:30 GMT

ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో కీల‌క నాయ‌కుడు, గ‌తంలో టీడీపీలో చ‌క్రం తిప్పి. అనూహ్యంగా కేసీఆర్‌కు మ‌ద్దతిచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల‌పై ఆయ‌న విస్మయం వ్యక్తం చేయ‌డ‌మే కాకుండా విమ‌ర్శలు కూడా సంధిస్తుండ‌డం ఆస‌క్తిగా మారింది. ప్రధానంగా గ‌త 2018 ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌పై ఆయ‌న అక్కసు వెళ్లగ‌క్కుతున్నారు. ఈ ప‌రిణామం జిల్లా రాజ‌కీయాల్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది.

పువ్వాడకు మంత్రి పదవి…..

నిజానికి ఆ ఎన్నిక‌ల్లో తుమ్మల నాగేశ్వరరావు గెలుస్తార‌ని అనుకున్నా.. ఓడిపోయారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేంద‌ర్‌రెడ్డి విజ‌యం సాధించారు. అదే టైంలో ఖ‌మ్మం నుంచి వ‌రుస‌గా రెండోసారి పువ్వాడ అజ‌య్‌కుమార్ విజ‌యం సాధించారు. అనంత‌రం ఆయ‌న కేసీఆర్ ఆశీస్సుల‌తో మంత్రి ప‌ద‌విని కూడా చేప‌ట్టారు. ఎన్నిక‌ల్లో ఓడినా త‌న‌కే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నుకున్న తుమ్మల‌కు ఇది మింగుడుప‌డ‌ని వ్యవ‌హారంగా మారిపోయింది. ఆ త‌ర్వాత పాలేరులో త‌న‌నో ఓడించిన ఉపేంద‌ర్‌రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకోవ‌డంతో పాటు ఆయ‌న‌కు ప్రయార్టీ ఇస్తున్నారు.

తనను ఓడించిన వారిపై….

ఒక‌ప్పుడు ఉమ్మడి ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు చివ‌ర‌కు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ప‌ట్టు నిలుపుకోలేక‌పోతున్నారు. దీంతో ఆయ‌న చాలా కాలంగా పార్టీ కార్యక్రమా ల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అయితే, ఇటీవ‌ల ఆయ‌న స్థానిక సంస్థల ఎన్నిక‌ల త‌ర్వాత స్థానిక నేత‌ల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా పార్టీ విధానాల‌ను త‌ప్పు ప‌ట్టను అంటూనే విమ‌ర్శలు చేయ‌డం గ‌మ‌నార్హం. పాలేరు నియోజకర్గానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తనను ఓడించడమే లక్ష్యంగా పనిచేశారని తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. వారు నన్ను కాదు… రాజకీయ జీవితాన్ని అందించిన కన్నతల్లి లాంటి పార్టీకి మోసం చేశారని అన్నారు.

ప్రాధాన్యత తగ్గడంతో…..

ఇలా మోసాలు, కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు చేస్తూ పార్టీకి మోసం చేసే వారు ఎక్కువకాలం రాజకీయాల్లో వుండలేరని తుమ్మల విమర్శించారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్‌ను మోసేవారిని గెలిపించుకోవాల్సిన అవసరం లేదన్న ఆయన పదవులెప్పుడూ శాశ్వతం కాదన్నారు. ఈ వ్యాఖ్యల అంత‌రార్థం ప‌రోక్షంగా మంత్రి అజ‌య్‌ను టార్గెట్ చేయ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అజ‌య్ జిల్లా కేంద్రంలో ఉన్న తుమ్మల వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తూ త‌న వ‌ర్గానికి పెంచుకుంటున్నారు. అదే టైంలో యువ‌నేత కేటీఆర్ అండ‌దండ‌లు కూడా అజ‌య్‌కు ఉండ‌డంతో తుమ్మల నాగేశ్వరరావు ప్రాధాన్యం మ‌రింత త‌గ్గిపోయింది. దీంతో తుమ్మల త‌న అస‌హ‌నాన్ని ఇలా బ‌య‌ట పెట్టుకుంటున్నారు.

Tags:    

Similar News