ఆ ఇద్దరు వైసీపీ మంత్రుల‌కు జ‌న‌సేన‌పై ఎంత ప్రేమో…!

ఏపీలో జ‌న‌సేన రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి అనేకంటే బీజేపీకి ఆ పార్టీ తోక‌పార్టీగా మారిపోయింద‌నే చెప్పాలి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంచ‌క్కా సినిమాలు చేసుకుంటున్నాడు. ప‌వ‌న్ ఓకే [more]

Update: 2020-09-17 00:30 GMT

ఏపీలో జ‌న‌సేన రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి అనేకంటే బీజేపీకి ఆ పార్టీ తోక‌పార్టీగా మారిపోయింద‌నే చెప్పాలి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంచ‌క్కా సినిమాలు చేసుకుంటున్నాడు. ప‌వ‌న్ ఓకే చెప్పిన సినిమాల లిస్ట్ చూస్తే వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఆయ‌న‌కు ఖాళీ లేదు. పార్టీ అధినేతే అంత బిజీగా ఉన్నప్పుడు స్థానికంగా కేడ‌ర్ మాత్రం ఎలాంటి సంచ‌ల‌నాలు చేస్తుంద‌ని ఆశించ‌లేం. బీజేపీతో మిత్రప‌క్షం కాబ‌ట్టి ఆ పార్టీ ఇచ్చిన పిలుపు మేర‌కే నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు ( అక్కడ‌క్కడా మాత్రమే) చేయ‌డం మిన‌హా ఈ నాలుగేళ్లలో జ‌న‌సేన చేసేదేం లేదు. ఇదిలా ఉంటే ఏపీలో జ‌గ‌న్ కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ఇద్దరు నేత‌లు మాత్రం ఓ చోట జ‌న‌సేన‌కు ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఫుల్ స‌పోర్ట్ చేస్తున్నార‌ని.. అక్కడ త‌మ పార్టీ నేత కంటే జ‌న‌‌సేన ఎమ్మెల్యేపైనే లెక్కలేనంత ప్రేమ కురిపించేస్తున్నార‌న్న ప్రచారం వైసీపీ వ‌ర్గాల్లోనే జ‌రుగుతోంది.

వైసీపీ ఎమ్మెల్యేగానే చెప్పుకుంటూ….

గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలులో మాత్రమే గెలిచింది. ఇక్కడ గెలిచిన రాపాక వ‌ర‌ప్రసాద‌రావు కొద్ది రోజుల‌కే ప‌వ‌న్‌కు షాక్ ఇచ్చేసి జ‌గ‌న్ చెంత చేరిపోయారు. ఇప్పుడు రాజోలులో ఆయ‌న అన‌ధికారిక వైసీపీ ఎమ్మెల్యేగానే ఉంటున్నారు. తాను వైసీపీ ఎమ్మెల్యేనే అని చెప్పుకుంటున్నారు. రాపాక‌కు జిల్లా వైసీపీ నేత‌లు… ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కోన‌సీమలో ఉన్న ఇద్దరు మంత్రులు పినిపే విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణు ఇద్ద‌రు ఫుల్‌గా కోప‌రేట్ చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు చెవులు కొరుక్కుంటున్నారు. వాస్తవానికి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఏడెనిమిదేళ్లుగ బొంతు రాజేశ్వర‌రావు పార్టీని నిల‌బెట్టారు. 2014, 2019 రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న స్వల్ప తేడాతోనే ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 800 ఓట్లతోనే ఓడారు.

పార్టీ కోసం కమిట్ మెంట్ తో…..

అయినా పార్టీ కోసం ఆయ‌న ఎంతో క‌మిట్‌మెంట్‌తో ప‌ని చేస్తున్నారు. అయితే మంత్రులు వేణు, విశ్వరూప్ ఇద్దరూ బొంతును ఏ మాత్రం గిట్టనీయ‌డం లేద‌ట‌. జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుండ‌డంతో పాటు ఆయ‌న చెప్పిన ప‌ని చెప్పిన‌ట్టు క్షణాల్లోనే చేసేస్తున్నార‌ట‌. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో 20కు పైగా అక్రమంగా ఇసుక త‌ర‌లిస్తోన్న ట్రాక్టర్లను పోలీసులు ప‌ట్టుకున్నారు. అవి రాపాక వ‌ర్గానికి చెందిన మ‌నుషుల‌వే. వెంట‌నే ఓ మంత్రి ఫోన్ చేసి వాటిని విడిపించేశారు. ఇక ఏ ప‌ద‌వులు ఉన్నా కూడా రాపాక సిఫార్సు చేయ‌డ‌మే ఆల‌స్యం ఆ ఇద్దరు మంత్రులు ఓకే చెప్పేసి నువ్వు ఎలా అంటే అలా అనేస్తున్నార‌ట‌. అస‌లు వీరి త‌మ పార్టీ కోసం ద‌శాబ్ద కాలంగా క‌ష్టప‌డుతోన్న రాజేశ్వర‌రావును ఎంత మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వైసీపీలోనే ఓ వ‌ర్గం గుర్రుగా ఉంది.

ఎన్నిక‌ల ముందే రాపాక‌కు స‌పోర్టా..?

ఈ ఇద్దరు మంత్రులు ఎన్నిక‌ల‌కు ముందే ప‌రోక్షంగా రాపాక‌కు గెలిపించార‌న్న ప్రచారం నియోజ‌క‌వ‌ర్గంలో ఉంది. అందుకే రాపాక స్వల్ప మెజార్టీతో గట్టెక్కాడ‌న్న టాక్ ఉంది. బొంతు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండ‌డంతో ఆయ‌నకు యాంత్రాంగంతో పాటు తెలంగాణ‌, ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో మంచి ప‌లుకుబ‌డి ఉంది. ఆయ‌న గెలిస్తే సీఎం జ‌గ‌న్ వ‌ర‌కు దూసుకుపోతాడ‌న్న అభిప్రాయం ఉంది. పైగా నాన్ కాంట్రవ‌ర్సీయ‌ల్ ప‌ర్సన్‌. ఎస్సీ కోటాలో మంత్రి ప‌ద‌వి రేసులో ఉంటాడ‌నే విశ్వరూప్ ప‌రోక్షంగా రాపాక‌కు పాత కాంగ్రెస్ ప‌రిచ‌యాల నేప‌థ్యంలో స‌పోర్ట్ చేశాడ‌ని అంటారు.

వేణు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో లాబీయింగ్…..

మంత్రి వేణు కూడా రాపాక‌కు స‌పోర్ట్ చేయ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయ‌ట‌. ఆయ‌న‌కు ఇది సొంత నియోజ‌క‌వ‌ర్గం. రాజోలు మండ‌లంలోని పొన్నమండ ఆయ‌న‌న స్వగ్రామం. ఆయ‌న రాజోలు, మ‌ల్కీపురంలో రెండుసార్లు జ‌డ్పీటీసీగా గెలిచారు. ఇక్కడ రాజుల‌తో బ‌ల‌మైన లాబీయింగ్ ఉంది. ఈ క్రమంలోనే బీసీల్లో శెట్టిబ‌లిజ‌లు, రాజుల‌తో ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందే త‌న‌దైన స్టైల్లో లాబీయింగ్ చేసి రాపాక‌కు ప‌రోక్ష స‌హ‌కారం అందిచార‌న్న గుస‌గుస‌లు అప్పుడే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పైగా వీరిద్దరు పాత కాంగ్రెస్ స్నేహితులే. రాపాక 2009లో ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వేణు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ జ‌డ్పీటీసీగా ఉండ‌డంతో పాటు తూర్పుగోదావ‌రి జిల్లా జ‌డ్పీచైర్మన్‌గా ఉన్నారు. ఇలా ఈ స్నేహ‌మే మొన్న ఎన్నిక‌ల్లో రాపాక‌కు స‌పోర్ట్ చేయ‌డానికి కార‌ణ‌మైంద‌ట‌. ఏదేమైనా కోన‌సీమ‌లో ఇద్దరు మంత్రులు కూడా వైసీపీ కోసం ఎంతో క‌మిట్‌మెంట్‌తో ఉన్న బొంతును కాద‌ని జ‌న‌సేన రాపాక‌పై అపార‌మైన ప్రేమ చూపిస్తున్నార‌న్న టాక్ ఇప్పుడు బ‌లంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News