వారి కంట్రోల్ లోకి వెళతారా?

శివసైనికుల కల నెరవేరుతుంది. దశాబ్దాల నాటి ఆకాంక్షను ఉద్ధవ్ థాక్రే తీరుస్తున్నారు. శివసేన అధినేత బాల్ థాక్రే కోరుకున్నట్లుగానే ఆయన తనయుడు ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ [more]

Update: 2019-11-27 17:30 GMT

శివసైనికుల కల నెరవేరుతుంది. దశాబ్దాల నాటి ఆకాంక్షను ఉద్ధవ్ థాక్రే తీరుస్తున్నారు. శివసేన అధినేత బాల్ థాక్రే కోరుకున్నట్లుగానే ఆయన తనయుడు ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మరాఠీల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లోకల్ పార్టీగా అవతరించిన శివసేన అనతి కాలంలోనే మహారాష్ట్రలో పట్టు సాధించింది. బాల్ థాక్రే జీవించి ఉన్నప్పుడే శివసేన మరాఠా ప్రజల సెంటిమెంట్ తో బలీయమైంది.

దశాబ్దాల కల….

అయితే శివసేన కొన్ని ప్రాంతాలకే పరిమితమయింది. ముంబయితో పాటు మరికొన్ని ప్రాంతాలకే పరిమితమయిన శివసేన గత మూడు దశాబ్దాలుగా బీజేపీ వెంట రాజకీయాలు నెరుపుతోంది. బీజేపీ, శివసేన సైద్ధాంతిక భావజాలం ఒక్కటే కావడంతో రెండు పార్టీలూ కలసి నడిచాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ శివసేన, బీజేపీ కలసి పోటీ చేశాయి. కానీ ఎన్నికల అనంతరం రెండు పార్టీల మధ్య పొడసూపిన విభేదాలు శివసేనకు కలసి వచ్చాయనే చెప్పాలి. ముఖ్యమంత్రి పదవి కావాలని శివసేన పట్టుబట్టడంతో బీజేపీ దూరం జరిగింది.

కలసి ప్రయాణం….

శివసేన తన సిద్ధాంతాలకు, ఆశలయాలకు విరుద్ధమైన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రయాణం చేస్తుంది. ఒక్కసారి శివసేన అధికారంొలోకి వస్తే మహారాష్ట్ర అంతటా విస్తరించవచ్చన్నది ఆ పార్టీ నేతల యోచన. తమకు పట్టులేని ప్రాంతాల్లో సయితం బలోపేతం కావడానికి ముఖ్యమంత్రి పదవి ఒక్కటే మార్గమని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు కలసి వచ్చిన అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు ఉద్ధవ్ థాక్రే ఉంటారని శివసేన బహిరంగంగా చెబుతుండటం విశేషం.

కంట్రోల్ చేయగలరా?

కానీ శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్ లతో ఎలా నెట్టుకొస్తారన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. శరద్ పవార్ తో వేగడం అంత ఈజీ కాదు. కాంగ్రెస్ వ్యూహం దానికి ఉండనే ఉంది. జాతీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ నిర్ణయం ఎప్పటికప్పుడు మార్చుకునే అవకాశముంది. రెండు పార్టీలూ ఉద్ధవ్ థాక్రేను కంట్రోల్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరో పక్క కేంద్ర ప్రభుత్వం సహకరించే అవకాశాలులేవు. ఈ నేేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా రాణించడం అంత ఈజీకాదు. ముఖ్యమంత్రి అయి పార్టీని ఉద్ధవ్ థాక్రే బలోపేతం చేస్తారా? లేక బలహీన పడతారా? అన్నద కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News