కన్పించడమే మానేశారే…!!

కాంగ్రెస్ అంటేనే అదో మోజు, అదో క్రేజ్. ఇక ఆ పార్టీలో వార్డు స్థాయి పార్టీ పదవి అయినా ప్రైం మినిస్టర్ లెవెల్ అన్నమాటే. అయితే ఇదంతా [more]

Update: 2019-08-01 05:00 GMT

కాంగ్రెస్ అంటేనే అదో మోజు, అదో క్రేజ్. ఇక ఆ పార్టీలో వార్డు స్థాయి పార్టీ పదవి అయినా ప్రైం మినిస్టర్ లెవెల్ అన్నమాటే. అయితే ఇదంతా గత వైభవం. ఇపుడు పీసీసీ చీఫ్ పదవి ఇస్తామన్నా వద్దంటున్నారు. ఏపీ పీసీసీ పదవి చాలా నెలలుగా ఖాళీగా పడి ఉంది. అయిదేళ్ల పాటు ఆ పదవిని చేపట్టిన ఎన్ రఘువీరారెడ్డి కాడి వదిలేశారు. విభజన తరువాత అయిదేళ్ళ పాటు ఏదో ఆశతో పార్టీకి నాయకత్వం వహించారు ఎక్కడైనా రాజకీయంగా కలసిరాకపోతుందా అని కూడా వేచి చూశారు. ఇక ఓ దశలో టీడీపీతో పొత్తు అంటే కాంగ్రెస్ నేతలు ఎగిరి గంతేశారు, కొద్దో గొప్పో సీట్లు తెచ్చుకుని గెలవగలిగితే ఎమ్మెల్యే కావచ్చు. టీడీపీ అధికారంలోకి వస్తే పొత్తుల్లో భాగంగా మంత్రి పదవి కూడా సాధించవచ్చునని కలలు కన్నారు. అయితే ఆ ఆశలన్నీ అడియాశలైపోయాయి.

నోటా కంటే దారుణం….

ఇక ఏపీలో అయిదేళ్ళ నాటి కంటే కాంగ్రెస్ పరిస్థితి మారుతుందని, ఉనికి బలంగా చాటుకుంటుందని ఆశించిన ఖద్దరు నేతలకు ఫలితాలు షాక్ కొట్టించాయి. నోటా కంటే దారుణంగా ఓట్లు రావడంటో పీసీసీ చీఫ్ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశేశారు. ఇదంతా మే నెలలో ముచ్చట. ఇక ఇప్పటికి చాలా కాలమే అయినా కూడా ఆ పదవి భర్తీ కాక అలాగే ఉంది. రఘువీరారెడ్డి తాను రాజకీయాల నుంచే కొంత కాలం సెలవ్ తీసుకుంటున్నానని చెప్పి తప్పుకున్నారు. ఓ వైపు దేశంలోనే రాహుల్ గాంధి కాంగ్రెస్ నుంచి తప్పుకుని పెను సవాల్ పార్టీకి విసిరారు. ఇపుడు ఏపీని ఎవరు పట్టించుకుంటారన్న మాట కూడా వినిపిస్తోంది.

వద్దు బాబోయ్ అంటున్నారు….

ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు అర కొరగా ఏపీలో మిగిలి ఉన్నారు. వారిలో వైఎస్సార్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు ఉన్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రులు చింతా మోహన్, పళ్ళం రాజు వంటి వారు కనిపిస్తున్నారు. కొత్తగా కాంగ్రెస్ లో మళ్ళీ చేరిన సాయిప్రతాప్ కూడా ఉన్నారు. వీరంతా కూడా తాము ఏదో కాంగ్రెస్ లో ఉన్నామంటే ఉన్నామనిపించుకుంటున్నారు. పీసీసీ చీఫ్ పదవి వద్దంటే వద్దు అని చెప్పేస్తున్నారు. కేరళ పెద్దాయన ఉమన్ చాందీ అని ఎన్నికల ముందు ఏపీ ఇంచార్జి హోదాలో తెగ తిరిగారు. ఇపుడు ఆయన కూడా కనిపించడంలేదు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఎక్కడికక్కడ మిగిలిన కాంగ్రెస్ నేతలు కూడా ఫ్యాన్ పార్టెలోకి చేరిపోతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన సాకే శైలజానాధ్ వంటి వారు కూడా తమ దోవ తాము చూసుకుంటున్నారు. మొత్తానికి రఘువీరా కాడి వదిలేస్తే కాచుకునేందుకు ఒక్క నాయకుడు కూడా శతాధిక వత్సరాల కాంగ్రెస్ లో కనిపించకపోవడం విడ్డూరమే.

Tags:    

Similar News