చెప్పనంటూనే అంతా చెప్పేస్తున్నారుగా

రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు రాజకీయల గురించి మాట్లాడకూడదు. అయితే నిత్యం రాజకీయాలు మాట్లాడే నాలికను కట్టిపడేసుకోమంటే అంతకంటే కష్టం మరొకటి ఉండదు మరి. నిజానికి వెంకయ్యనాయుడు [more]

Update: 2019-12-28 11:00 GMT

రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు రాజకీయల గురించి మాట్లాడకూడదు. అయితే నిత్యం రాజకీయాలు మాట్లాడే నాలికను కట్టిపడేసుకోమంటే అంతకంటే కష్టం మరొకటి ఉండదు మరి. నిజానికి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి నుంచి ప్రమోషన్ మీద ఈ పదవిలోకి వచ్చారు. అపుడు ఆయన ఒక మాట అన్నారు, తాను ఇకపై నోరు కట్టేసుకోవాల్సివస్తుందని. ఆ విషయంలో ఆయన బాగానే మధన‌పడ్డారు. ఆ తరువాత రెండున్నరేళ్ళ ఆయన ఉపరాష్ట్రపతి ప్రస్థానంలో తనదైన శైలిలో వ్యవహారాలను నడిపిసున్నారు. గతంలో ఉన్న ఉప రాష్ట్రపతులకు భిన్నంగా ఆయన వైఖరి ఉంటోంది. దీని మీద ఎంత రచ్చ జరుగుతున్నా వెంకయ్య నాయుడు తనదైన బాణీలో సాగిపోతున్నారంతే.

అన్నీ చెప్పేశారు…..

వెంకయ్యనాయుడు తాజా ఏపీ టూర్లో అనేక విషయాలు మాట్లాడారు. ఆయన వచ్చేటప్పటికే మూడు రాజధానుల మంటలు ఏపీలో అంటుకున్నాయి. దాని మీద ఆయన అధికార వికేంద్రీకరణ ఉండాలని అంటూనే పాలన మాత్రం కాదని చెప్పేశారు. రాజధాని రైతులు తనని కలసినపుడు ఆయన వారి పట్ల తనకు పూర్తి సానుభూతి ఉందని, కానీ రాను రాజ్యాంగ పదవిలో ఉన్నాయని అందువల్ల ఎక్కడ చెప్పాలో అక్కడే తన మాట చెబుతానని కొంత క్లారిటీ ఇచ్చారు. ఆ తరువాత మాత్రం వెంకయ్య నాయుడు ఎక్కడా దాచుకోలేదు మరి. రాజధాని ఒకే చోటా ఉండాలని కుండబద్దలు కొట్టేశారు.

ఒకే చోట అయితేనే…?

రాజధానిలో అన్నీ ఒకే చోట ఉండాలన్నది తన అభిప్రాయంగా వెంకయ్యనాయుడు చెప్పేశారు. హైకోర్టు, సచివాలయం, ముఖ్యమంత్రి ఆఫీస్ ఇలా అన్నీ ఒకే చోట ఉంటే పాలన సులువుగా ఉంటుందని, ఖర్చు కూడా తగ్గుతుందని వెంకయ్యనాయుడు అంటున్నారు. అభివ్రుద్ధిని కావాలిస్తే వేరు వేరు చోట్ల వికేంద్రీకరించుకోవచ్చు కానీ పరిపాలన మాత్రం అలా కాదంటూ వెంకయ్యనాయుడు అన్నాక ఇక ఆయన ఓటు ఎటువైపో తెలిసిపోతోందని అంటున్నారు.

తెలుగే ముద్దు…..

ఇదే కాదు, ఏపీలో ఆంగ్ల మీడియం మీద కూడా వెంకయ్యనాయుడు తన వాదన కొనసాగిస్తున్నారు. ఆయన ఇంతకు ముందే తెలుగు మీడియం కి మద్దతు ఇచ్చారు. దాని మీద ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా సెటైర్లు వేశారు. అయినా వెంకయ్యనాయుడు మరో సారి ఏపీ గడ్డ మీదనే తన వాదన గట్టిగానే వినిపించారు. తెలుగు భాషలో చదువుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇదే కాదు ఏ రాజకీయ విషయమైనా నాయుడు గారు తన అభిప్రాయాలను పక్కాగా చెప్పేస్తున్నారు.

రచ్చ అయినా?

కొన్ని రోజులు క్రితం వెంకయ్యనాయుడు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమని గాంధీయే చెప్పారంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి ఆగ్రహం తెప్పించాలి. దీని మీద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు ఘాటుగానే రిప్లై ఇచ్చారు. వెంకయ్యనాయుడు భాష ఇంకా బీజేపీగానే ఉందని కూడా ఆయన అనడం విశేషం. కానీ ఇలా రాజకీయ కామెంట్స్ మాత్రం ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు చేయడం విడ్డూరమే. మరి ఆయన నేరుగా జగన్ ని, ఆయన పాలనని టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఇపుడు రాజధానుల విషయంలో వెంకయ్యనాయుడు అభిప్రాయంపైన జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News