తాత్కాలికమేనా…?
టీం ఇండియా లో కెప్టెన్ విరాట్ కొహ్లికి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ల నడుమ నడుస్తున్న అంతర్యుద్ధం ప్రపంచ కప్ టోర్నీ తరువాత బయటపడింది. కెప్టెన్ [more]
టీం ఇండియా లో కెప్టెన్ విరాట్ కొహ్లికి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ల నడుమ నడుస్తున్న అంతర్యుద్ధం ప్రపంచ కప్ టోర్నీ తరువాత బయటపడింది. కెప్టెన్ [more]
టీం ఇండియా లో కెప్టెన్ విరాట్ కొహ్లికి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ల నడుమ నడుస్తున్న అంతర్యుద్ధం ప్రపంచ కప్ టోర్నీ తరువాత బయటపడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవి శాస్త్రి అనుకున్నదే టీం లో జరుగుతూ ఉండటంతో వైస్ కెప్టెన్ రోహిత్ అలకబూనాడు వైస్ కెప్టెన్ గా తనకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో రోహిత్ కొంతకాలంగా అసంతృప్తితో వున్నాడు. బిసిసిఐ సైతం కెప్టెన్, కోచ్ ల మాటకే విలువ ఇవ్వడంతో రోహిత్ టీం ఇండియా లో జరుగుతున్న ఈ గందరగోళాన్ని వివిధరూపాల్లో బయటపెట్టి చర్చకు తెరలేపాడు. ఇన్ స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ ని గతంలో ఆన్ ఫాలో అయ్యి ప్రపంచకప్ లో అనుష్కశర్మ ను ఆన్ ఫాలో చేసి టీం ఇండియా లో ఐక్యత లేదన్నది చెప్పక చెప్పాడు. ఇక వరల్డ్ కప్ ముగిశాక జట్టుకు టికెట్లు బిసిసిఐ ఏర్పాటు ఆలస్యం కావడంతో తన సొంత డబ్బుతో టికెట్ తీసుకుని రోహిత్ ఇండియా వారంముందే వచ్చేయడం మరిన్ని అనుమానాలకు తెరతీసింది. అయితే ప్రపంచకప్ సెమిస్ లో వైఫల్యం తరువాత నుంచి రెండువారాలు పైగా అయినప్పటికి అటు బిసిసిఐ, కానీ కెప్టెన్, కోచ్ లు మౌనం పాటించడం గమనార్హం. అలాగే వెస్ట్ ఇండీస్ టూర్ కి విశ్రాంతి కి రెడీ అయిన విరాట్ కోహ్లీ తన నిర్ణయం రద్దు చేసుకుని మరీ వెస్ట్ ఇండీస్ టోర్నీకి అన్ని ఫార్మాట్లకు తాను సిద్ధం అని చెప్పడంతో టీం లో ఏదో జరుగుతుందన్న ప్రచారాం తారాస్థాయికి చేరింది.
మొత్తానికి బిసిసిఐ చెక్ పెట్టింది ఇలా …
ఎప్పుడు లేనంతగా టీం ఇండియా వివాదం రోడ్డున పడటంతో బిసిసిఐ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒప్పించి మీడియా సమావేశం పెట్టించింది. అయితే ఈ సమావేశంలో కోచ్ రవిశాస్త్రి పాల్గొన్నాడు కానీ రోహిత్ హాజరుకాలేదు. తనకు రోహిత్ కి నడుమ ఎలాంటి వివాదాలు లేవని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. టీం లో అలాంటి పరిస్థితి ఉంటే కనుక వరల్డ్ కప్ లో టీం ఇండియా అంత బాగా రాణించేదే కాదని చెప్పాడు. తానెప్పుడూ రోహిత్ ను ప్రశంసిస్తూనే ఉంటానని వైస్ కెప్టెన్ పై ప్రేమ ఒలికించాడు. కోచ్ రవిశాస్త్రి సహకారం అద్భుతమని చెప్పుకొచ్చాడు. అయితే టీం లో విభేదాలు అంటూ వార్తలు రావడం అంతా మీడియా సృష్టి గా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభివర్ణించడం విశేషం. ప్రస్తుతం టీం ఇండియా రాణించడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపాడు.
ఒకప్పుడు ఇద్దరు జిగిని దోస్తులు …
విరాట్ కోహ్లీ, రోహిత్ ఇద్దరు కొంత కాలం క్రితం వరకు మంచి స్నేహితులు. టీం లో జోష్ నింపడంలో కానీ ఆటలో కానీ పోటాపోటీగా విరాట్ కోహ్లి, రోహిత్ లు ఉండేవారు. అయితే ప్రపంచ కప్ ముందు నుంచి ఈ స్టార్ ల నడుమ ఎడబాటు మొదలైంది. అది పెరిగి పెద్దదై టీం సంసారం వీధికెక్కించింది. అయితే వెస్ట్ ఇండీస్ టూర్ కి ముందు ఈ అనారోగ్య వాతావరణానికి తెరదించాలని బిసిసిఐ చికిత్స తాత్కాలికంగా చేసినప్పటికి పూర్తి స్థాయిలో అందరిలో ఐక్యత కు కృషి చేయాలిసి వుంది. అది ఎప్పటికి సాధ్యం అవుతుందో రాబోయే రోజుల్లో చుడాలిసి వుంది.