ఇప్పట్లో వీటికి లాక్ డౌన్ లేనట్లే

కరోనా కు వ్యాక్సిన్ కనుగొనేవరకు అన్ని రంగాలు పడకేసినట్లే. అయితే కొన్ని రంగాల్లో అయితే చాలా కాలం పూర్తిస్థాయిలో దెబ్బయిపోయినట్లే అంటున్నారు నిపుణులు. వీటిలో హోటల్ రంగం [more]

Update: 2020-04-18 18:29 GMT

కరోనా కు వ్యాక్సిన్ కనుగొనేవరకు అన్ని రంగాలు పడకేసినట్లే. అయితే కొన్ని రంగాల్లో అయితే చాలా కాలం పూర్తిస్థాయిలో దెబ్బయిపోయినట్లే అంటున్నారు నిపుణులు. వీటిలో హోటల్ రంగం కోలుకోలేనంతగా నష్టపోతుందని స్పష్టం చేస్తున్నారు. గుంపులుగా ఉండటం కొన్ని నెలలపాటు నిషేధించాల్సి ఉండటంతో హోటల్స్ తెరవడం ఇప్పట్లో సాధ్యం కాదు. దాంతో ఈ రంగంపై ఆధారపడిన లక్షలాదిమంది ఉపాధి కోల్పోవడం ఖాయం చేసింది కరోనా.

పర్యాటకం కూడా పడకేసినట్లే …

దేశంలోని పర్యాటక రంగం ఇకపై పూర్తిగా పడకేసినట్లేనని చెప్పేస్తున్నారు. ప్రయాణాలు తప్పనిసరి అయినవారు మాత్రమే రైళ్ళు , బస్సులు, విమానాలను ఆశ్రయించనున్నారు. అందులో కూడా సామాజిక దూరం పాటించక తప్పదు. దీనితో ఆయా రంగాల్లో టికెట్ల ధరలను భారీగా పెంచకతప్పదు. విమానరంగం అయితే దీనివల్ల ఘోరంగా నస్టపోనుంది. ఫలితంగా పర్యాటక రంగం ఘోరంగా మారనుంది. టూరిజం నెమ్మదిస్తే దీనిపై ఆధారపడిన అన్నిరకాల ప్రత్యామ్నాయ సంస్థలు మూతవేయాలిసి రావొచ్చంటున్నారు.

ఇలా చేస్తే గుడ్డిలో మెల్ల …

తీవ్రంగా నష్టపోయే రంగాల్లో ఉన్న రవాణా, పర్యాటక రంగాల్లో కొన్ని మార్పుల ద్వారా వ్యాపారాలు కొనసాగించవచ్చు. అయితే సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళలిసి ఉంటుంది. హోటల్స్ వ్యాపారాలకు బ్రేక్ పడనున్న నేపథ్యంలో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ బుకింగ్ లు మొదలు పెట్టుకుని తక్కువమంది సిబ్బంది తో కొంతమేర గట్టెక్కాలిసివుంటుంది. అలాగే క్యాబ్ లకు డిమాండ్ పెరగనుంది. ప్రజా రవాణా వ్యవస్థ లో ప్రయాణాలు చేయడానికి ప్రజలు వెనుకాడే అవాకాశాలు ఉండనున్నాయి. దాంతో వ్యక్తిగత వాహనాలు, క్యాబ్ లే రోడ్లపై అధికంగా కనిపించనున్నాయి. ఇలా ఎన్నడూ చూడని చిత్ర విచిత్రాలు కరోనా కారణంగా అంతా చూడటం ఖాయంగా కనిపిస్తుంది.

Tags:    

Similar News