అచ్చెన్న తర్వాత ఆయనేనా?

అచ్చెన్నాయుడు అరెస్ట్ తో తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈఎస్ఐ స్కాం అచ్చెన్నాయుడు మెడకు చుట్టుకుంది. అచ్చెన్నాయుడు తర్వాత మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పేరు [more]

Update: 2020-06-13 00:30 GMT

అచ్చెన్నాయుడు అరెస్ట్ తో తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈఎస్ఐ స్కాం అచ్చెన్నాయుడు మెడకు చుట్టుకుంది. అచ్చెన్నాయుడు తర్వాత మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పేరు బలంగా విన్పిస్తుంది. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మందులు, ఫర్నీచర్ కొనుగోళ్లలో పెద్దయెత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అచ్చెన్నాయుడు తర్వాత కార్మిక శాఖ మంత్రిగా పితాని సత్యనారాయణ బాధ్యతలను చేపట్టారు.

పెద్దయెత్తున కొనుగోలు తర్వాత?

ఈఎస్‌ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషథాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్‌ కిట్స్, ఫర్నీచర్‌ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రూ.975.79 కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు ఆ కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్‌ టెండర్లు కూడా పిలవలేదు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. ఇందులో పితాని సత్యనారాయణ ప్రమేయం ఉందని కూడా ఆరోపణలు ఉన్నాయి.

మార్కెట్ ధర కంటే?

మందుల కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఓ నివేదికను విడుదల చేసింది. ఆరేళ్లుగా కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్లు విజిలెన్స్‌ అధికారులు పేర్కొన్నారు. నకిలీ కొటేషన్లు సృష్టించి రేట్ కాంట్రాక్టులో లేని సంస్థలనుంచి మందులు కొనుగోలు చేసి నట్లు తెలిపారు. ప్రభుత్వం రూ. 89 కోట్లు చెల్లిస్తే, అందులో రేట్ కాంట్రాక్ట్ లో ఉన్న సంస్థలకు 38 కోట్లు చెల్లించినట్టు గుర్తించారు. మిగతా రూ. 51 కోట్లను దారి మళ్లించి రేట్‌ కాంట్రాక్ట్‌ లేని సంస్థలకు వాస్తవ ధర కం టే 132 శాతం అధనంగా అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి.

నకిలీ బిల్లులు….

అయితే, ఈఎస్ఐ కుంభ‌కోణం మొత్తంలోనూ మాజీ మంత్రి అచ్చెన్న పేరుతో పాటు ఆయ‌న త‌ర్వాత కార్మిక శాఖ ప‌గ్గాలు చేప‌ట్టిన మ‌రో మాజీ మంత్రి పితాని స‌త్యనారాయ‌ణ ప్రమేయం కూడా ఉంద‌ని అధికారులు గుర్తించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నానికి కారణమయింది. తన వాళ్లకు చెందిన టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ కంపెనీకి కాంట్రాక్ట్‌ అప్పగించాలని ఈఎస్‌ఐ డైరెక్టర్లకు లేఖ రాసినట్లు తెలిసింది. మంత్రి చొరవతోనే సదరు డైరెక్టర్లు రూ. 975 కోట్ల మందుల కొనుగోలు చేసి, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. మరి అచ్చెన్నాయుడు తర్వాత నెక్ట్స్ టార్గెట్ పితాని సత్యనారాయణ అన్న ప్రచారం ఊపందుకుంది.

Tags:    

Similar News