మళ్లీ ఆపరేషన్ స్టార్ట్… ఇద్దరు ఎమ్మెల్యేలు…?

పంచాయతీ ఎన్నికల తర్వాత మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు కానుంది. వరసగా ఏపీలో పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలు [more]

Update: 2021-02-24 02:00 GMT

పంచాయతీ ఎన్నికల తర్వాత మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు కానుంది. వరసగా ఏపీలో పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే ముగిశాయి. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 80 శాతం వైసీపీ గెలుచుకుంది. పల్లె ప్రాంతాల్లో ఏమాత్రం పట్టుతగ్గలేదని ఈ ఫలితాలను బట్టి వెల్లడవుతుంది. దీంతో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

పంచాయతీ ఫలితాలతో…..

ఇరవై నెలల జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని విపక్షాలు అంచనా వేశాయి. కానీ ప్రజలు పంచాయతీ ఎన్నికలకు బారులు తీరారు. దాదాపు 70 శాతానికి పైగానే పోలింగ్ జరిగింది. నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటే అధికార పార్టీ మద్దతుదారులు ఇంత పెద్ద సంఖ్యలో విజయం సాధించి ఉండేవారు కాదు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంతటి విజయాన్ని సాధించిపెట్టాయని చెప్పకతప్పదు.

మరింత వీక్ చేసేందుకు…..

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని మరింత బలహీనం చేసేందుకు వైసీపీ ప్రయత్నాలను త్వరలోనే ప్రారంభిస్తుందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడంతో టీడీపీ నేతలు కూడా పునరాలోచనలో పడ్డారంటున్నారు. ఇప్పటికే అనేక చోట్ల ద్వితీయ శ్రేణి నేతలు వైసీీపీ కండువాలు కప్పేసుకుంటున్నారు. కానీ ఎమ్మెల్యే స్థాయి నేతలు మాత్రం వైసీపీ వైపు చూడటం లేదు. అయితే త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతారంటున్నారు.

అమరావతి వ్యవహారమూ…..

ఇన్నాళ్లూ రాజధాని వ్యవహారం జగన్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని భావించారు. కానీ అమరావతి ప్రాంతంలోనే టీడీపీకి గెలుపు దక్కలేదు. వైసీపీయే విజయం సాధించింది. 13 జిల్లాల్లోనూ ఒకే రకమైన ఫలితాలు రావడంతో మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలు వ్యతిరేకించడం లేదని అర్థమయింది. దీంతో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ లో చేరేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ మద్దతుదారులుగా చేరిపోతారంటున్నారు.

Tags:    

Similar News