జగన్ ఇచ్చినట్లే ఇచ్చి….?
తూర్పుగోదావరి జిల్లాల్లో వైసిపి కి గట్టి దెబ్బ తగిలిన నియోజకవర్గాల్లో రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాలు. ఇక్కడ టిడిపి జండా తిరిగి ఘనంగా ఎగరేయడంతో ఈ నియోజకవర్గాలపై [more]
తూర్పుగోదావరి జిల్లాల్లో వైసిపి కి గట్టి దెబ్బ తగిలిన నియోజకవర్గాల్లో రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాలు. ఇక్కడ టిడిపి జండా తిరిగి ఘనంగా ఎగరేయడంతో ఈ నియోజకవర్గాలపై [more]
తూర్పుగోదావరి జిల్లాల్లో వైసిపి కి గట్టి దెబ్బ తగిలిన నియోజకవర్గాల్లో రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాలు. ఇక్కడ టిడిపి జండా తిరిగి ఘనంగా ఎగరేయడంతో ఈ నియోజకవర్గాలపై అధిష్టానం సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో పటిష్ట కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముందుగా భారీ మెజారిటీ తో ఓటమి చెందిన రాజమండ్రి కో ఆర్డినేటర్ రౌతు సూర్య ప్రకాశ రావు ను మార్చి ఆయన స్థానంలో మాజీ ఎపి ఐఐసి ఛైర్మెన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రమణ్యానికి పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే పార్టీ పదవితో పాటు అధికారం కూడా ఉంటే మంచిదని గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మెన్ గా నియమించాలని భావించింది.
ఆ కమిటీల్లో సభ్యుడనే ….
రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగాల్లో ఉన్నవారు గూడా ఛైర్మన్ గా అర్హత లేదనే నిబంధన ఇప్పుడు శివరాముడికి అడ్డుగా నిలిచినట్లు తెలుస్తుంది. కొన్ని వ్యాపార సంస్థల్లో సభ్యుడిగా వున్న వారు ఈ పదవి చేపట్టేందుకు వీలు లేకపోవడంతో బాటు పార్టీలో శివరాముడి ప్రత్యర్ధులు అధిష్టానంపై తెస్తున్న వత్తిడితో ఆయనకు ఈ పదవి దూరమైనదన్న టాక్ వైసిపి లో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి పార్టీ కో ఆర్డినేటర్ పదవి చిన్నదేమీ కానందున భవిష్యత్తులో పనితీరును బట్టి ఆయనకు ప్రమోషన్ ఇవ్వాలన్న వాదన అధిష్టానం ఆలోచనలో మార్పు తెచ్చిందంటున్నారు. గూడా ఛైర్మెన్ గిరి శివరాముడికే ఇవ్వాలంటే జీవో విడుదల చేయాలిసిన అవసరం పడుతుందని అంటున్నారు.
ఎవరి ప్రయత్నాలు వారివి …
గూడా ఛైర్మన్ పదవికి అంతర్గతంగా పోటీ తీవ్రంగానే వుంది. గత ఐదేళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్న మాజీ ఫ్లోర్ లీడర్ షర్మిల రెడ్డి, రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు కూడా రంగంలో ఉండటంతో అధినేత జగన్ ఆశీస్సులు ఎవరిపై ఉంటాయనేది చర్చనీయంగా మారింది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో బలపడాలంటే రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో వైసిపి ఆధిపత్యం ప్రదర్శించాలిసి ఉంటుంది. రాజమండ్రి అర్బన్ లో నాయకులు భారీగా ఉండటం తో పాటు పార్లమెంట్ స్థానం వైసిపి ఖాతాలో ఉండటంతో రూరల్ ఇంచార్జి ఆకుల వీర్రాజు కు ఇవ్వడం ద్వారా అక్కడ అన్ని ఈక్వేషన్స్ సెట్ అవుతాయన్న అంచనాల్లో అధిష్టానం ఉందంటున్నారు. అమ్మ ఒడి పథకం అందరికి చేరాకా స్థానిక ఎన్నికల సమరానికి జగన్ సై అంటారని ఈలోగా పదవుల పందేరం పూర్తి చేస్తారని తెలుస్తుంది. కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఆగి అందులో కష్టపడిన వారికి ఈ పదవిని కట్టబెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా గూడా ఛైర్మెన్ ప్రకటించకపోవడానికి కారణాల్లో ఒకటని కూడా తెలుస్తుంది.