అమ్మో.. జగన్ మైండ్ బాబును మించిపోయిందే…?
రాజకీయాల్లో కొన్ని కొన్నిసార్లు.. చిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. చంద్రబాబు హయాంలో పార్టీ నేతలు.. ఆయన మేధా శక్తిపై కథలు కథలు చెప్పుకొనేవారు. బాబుకున్న జ్ఞాపక శక్తిని [more]
రాజకీయాల్లో కొన్ని కొన్నిసార్లు.. చిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. చంద్రబాబు హయాంలో పార్టీ నేతలు.. ఆయన మేధా శక్తిపై కథలు కథలు చెప్పుకొనేవారు. బాబుకున్న జ్ఞాపక శక్తిని [more]
రాజకీయాల్లో కొన్ని కొన్నిసార్లు.. చిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. చంద్రబాబు హయాంలో పార్టీ నేతలు.. ఆయన మేధా శక్తిపై కథలు కథలు చెప్పుకొనేవారు. బాబుకున్న జ్ఞాపక శక్తిని వారు పదే పదే తలుచుకునేవారు. అమ్మో.. బాబు ఏం అడుగుతారో.. మనం ఏం చెప్పాలో.. ఏం మరిచిపోతామో.. అని అప్పట్లో మంత్రులుగా ఉన్న కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు వంటి తొలిసారి మంత్రులుగా ఉన్నవారు ఓ నోట్‌పుస్తకం పెట్టుకునిమరీ కేబినెట్ భేటీలప్పుడు రాసుకునేవారు. ఈ విషయాన్ని చూచాయగా కొందరుపాత్రికేయులకు కూడా చెప్పేవారు. “బాబు గారి సంగతిమీకు తెలీదు. ఆయనకన్నీ గుర్తే. మనమే మరిచిపోతాం“ అని నవ్వుతూ అనేవారు. తర్వాత ఆయన పేపర్‌లెస్‌కేబినెట్ అంటూ కొత్త పంథాను తెరమీదకు తెచ్చారు.
జగన్ జ్ఞాపకశక్తిపై…..
చంద్రబాబు జ్ఞాపక శక్తిపై ఎల్లోమీడియాలో పుంఖాను పుఖాలుగా అప్పట్లో వార్తలు, కథనాలు కూడా వచ్చాయి. అయితే, ఒక్క బాబేనా.. ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ కూడా అంతే అంటున్నారు వైసీపీ నాయకులు. ఇటీవల కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మరిచిపోయిన ఓ విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావించారని, ఆయన జ్ఞాపక శక్తిని చూసి మేమంతా ఆశ్చర్య పోయామని మంత్రి పేర్ని నాని చెప్పిన విషయం తెలిసిందే. ఆయనేకాదు.. ఈ విషయాన్ని మరోమంత్రి కన్నబాబు కూడా చెప్పుకొచ్చారు. కృష్ణానది నీటిని ఒడిసి పట్టే విషయంలో ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప యాత్రలో జిల్లా రైతులకు జగన్ హామీ ఇచ్చారు.
తొలి కేబినెట్ లో…..
ఫస్ట్ కేబినెట్లోనే జగన్ ఈ విషయంపై మాట్లాడారు. కృష్ణానదిపై అవనిగడ్డ దగ్గర, మరో చోట.. రెండు ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధ చేయాలని,ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని కూడా సీఎం జగన్ మంత్రి పేర్నినానిని ఆదేశించారు. దీనికి సంబంధించి అవసరమైతే.. తన సలహాదారుల సూచనలను కూడా పాటించాలని జగన్ సూచించారు. అయితే, ఈ విషయాన్ని మంత్రి పేర్ని నాని మరిచిపోయారు. కానీ, ఇటీవల కృష్ణాకు వరదలు వచ్చి.. నీరు వృథాగా బంగాళా ఖాతంలో కలిసిపోయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఎవరూ లేవనెత్తకుండానే…?
ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన కేబినెట్ భేటీ లో ఎవరూ ప్రశ్నించకుండానే జగన్.. ఈ విషయాన్ని లేవనెత్తారు. మంత్రి పేర్ని నానిని ప్రశ్నించారు. ఈ విషయం ఎక్కడిదాకా వచ్చిందని జగన్ అడిగారు. దీంతో అవాక్కయిన మంత్రి పేర్ని.. సార్..సార్.. నేను మరిచిపోయాను. సారీ.. ఇప్పుడే ఈ విషయంపై ఏం జరిగిందో చూస్తాను. అని వివరణ ఇచ్చుకున్నారట. ఇది వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. అమ్మో.. చంద్రబాబే అనుకున్నా.. జ్ఞాపక శక్తిలో జగన్.. బాబును మించిపోయారే! అని చర్చించుకుంటున్నారు.