టీజర్ ని వదిలిన జగన్..బొమ్మ అదిరిపోతుందటగా ?

జగన్ మాట్లాడరు, తన మనసులో ఏముందో అసలే చెప్పరు. అలాగని ప్రత్యర్ధులు రిస్క్ చేసి చెడుగుడు ఆడదామనుకుంటే మాత్రం సినిమా మొత్తం చూపిస్తారు. జగన్ కి ఏమీ [more]

Update: 2020-10-16 02:00 GMT

జగన్ మాట్లాడరు, తన మనసులో ఏముందో అసలే చెప్పరు. అలాగని ప్రత్యర్ధులు రిస్క్ చేసి చెడుగుడు ఆడదామనుకుంటే మాత్రం సినిమా మొత్తం చూపిస్తారు. జగన్ కి ఏమీ తెలియదు అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. కానీ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం జగన్ ని ఏమీ కానట్లుగా పక్కన పెట్టేశారు. కొన్ని నెలలుగా ఆయన జగన్ సహనాన్ని పరీక్షించేశారు. దీన్ని చూసిన వైసీపీ నేతలు జగన్ ఏంటి సైలెంట్ గా ఉన్నారు. రాజు గారు రెచ్చిపోతూంటే పట్టనట్లుగా ఉన్నారని గొణుక్కోవడాలూ, సణుకోవడాలూ జరిగిపోయాయి. ఇలాగే ఉంటే పార్టీ కట్టు తప్పి కంగాళీ అవుతుందని కూడా బడా నాయకులు అనుకోవడమూ జరిగింది.

సరిగ్గా షాక్…..

మరి అక్కడ ఉన్నది జగన్. మాటలు ఉండవు. అన్నీ చేతలే. జగన్ వరసపెట్టి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అని టీడీపీ నేతలు అడిగినా చాలా మందిని డౌట్ వచ్చినా దానికి సమాధానాలు మాటల్లో దొరకవు. ఇపుడు ఆర్ ఆర్ ఆర్ ని మీడియా ముద్దుగా పిలుచుకునే రాజు గారి మీద సీబీఐ దెబ్బ పడిపోయింది. జగన్ ఢిల్లీ పరమార్ధం కూడా అందరికీ మెల్లగానే అర్ధమైంది. జగన్ ఎక్కడ స్విచ్ నొక్కారో కానీ వందల కోట్ల బ్యాంక్ రుణాలు కొల్లగొట్టిన కేసులన్నీ ఆర్ ఆర్ ఆర్ ముందు పెట్టి సీబీఐ రఫ్ఫాడించేస్తోంది. తనను కేంద్రం మోడీ ఆదుకుంటాయని ఈ సమయంలో రాజు గారు భావిస్తే అంతకన్నా అమాయకత్వం మరోటి ఉండదు. ఈ సంగతి అర్ధమయ్యేసరికి నర్సాపురం రాజావారికి సైలెంటే ఫ్రెండ్ అవుతుంది మరి.

డొంక కదలాలా ….

సరే జగన్ సీఎం, యువ నేత, బలవంతుడైన ప్రాతీయ పార్టీ సారధి. ఆయన చూసి చూసి గురిపెట్టింది రాజు గారికేనా అని ఎవరైనా సెటైర్లు వేస్తే వేయవచ్చు కానీ కాస్తా లోతుగా ఆలోచించిన వారికి మాత్రం ఇది కేవలం తీగ మాత్రమేనని బోధపడుతుంది. జగన్ అసలు టార్గెట్ వేరే వారున్నారు అంటున్నారు. సూత్రధారిగా ఉన్న చంద్రబాబు మీదనే ఆయన పంతం, పట్టుదల అన్నది కూడా అందరికీ తెలిసిదే. మరి ఎక్కే ఫ్లైట్, దిగే ఫ్లైట్ గా జగన్ హడావుడి హస్తిన పర్యటనల పర్యవసానాలు, ఫలితాలు కూడా గట్టిగానే ఉంటాయి కదా. అంటే రాజు గారి ఎపిసోడ్ కేవలం టీజర్ అనుకుంటే అసలు సినిమా ముందుందన్న మాట.

అదే రూట్లో …

జగన్ ఢిల్లీ ఫ్లైట్ దిగుతూనే సీబీఐ ని వెంటబెట్టుకువచ్చారు. అందాకా రాజు గారి కధ చూడమన్నారు. కాస్తా నిదానించాక అసలు కధ మొదలవుతుంది. అమారావతి భూముల కుంభకోణాన్ని కచ్చితంగా సీబీఐ కి అప్పగించేలా జగన్ యాక్షన్ ప్లాన్ ఉంటుందని అంటున్నారు. అది కనుక చేయకపోతే జగన్ కి వచ్చిన 151 సీట్ల మెజారిటీ, కేంద్రంతో దోస్తీ ఇవన్నీ దండుగే మరి. అందుకే రాజు విషయాన్ని తేల్చేసిన జగన్ అసలు బాకీ అలాగే ఉంచారు. ఆ సస్పెన్స్ అలా కొనసాగుతూండగానే రేపో మాపో ఏపీలో పెను రాజకీయ సంచలనం కూడా నమోదు అవుతుందని అంటున్నారు. మొత్తానికి మోడీ పదవులు ఇస్తామని అంటున్నారు. జగన్ మాత్రం సీబీఐ అడుగుతున్నారు. బేరం సరిగ్గా సరిపోయింది. ఇక ఎంతెంత దూరం అని టార్గెట్ వర్గాలు రోజులు లెక్కలు వేసుకోవాల్సిందేనట.

Tags:    

Similar News