నిమ్మగడ్డకు జగన్ మరో ట్విస్ట్ ఇస్తున్నారా ?

ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కు అధికార పార్టీ కి నడుమ యుద్ధం అందరికి తెలిసిందే. ఎపి ఎన్నికల కమిషనర్ ని పదవీచ్యుతుడ్ని [more]

Update: 2020-10-10 05:00 GMT

ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కు అధికార పార్టీ కి నడుమ యుద్ధం అందరికి తెలిసిందే. ఎపి ఎన్నికల కమిషనర్ ని పదవీచ్యుతుడ్ని చేసి కోర్ట్ ల చుట్టూ ఆయన్ని తిప్పి చుక్కలు చూపించింది జగన్ సర్కార్. స్థానిక ఎన్నికలను ప్రభుత్వంతో సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏకపక్షంగా వాయిదా వేయడంతో మొదలైన వివాదం అనేక మలుపులు తిరిగి ప్రస్తుతం శాంతించింది.

కోర్టు ప్రశ్నించడంతో….

అయితే తాజాగా మరోసారి స్థానిక ఎన్నికల అంశం నిమ్మగడ్డ వెర్సెస్ ఎపి సర్కార్ గా మరో కొత్త యుద్ధానికి హై కోర్ట్ తెరతీసినట్లే కనిపిస్తుంది. దేశంలో అనేక చోట్ల ఎన్నికలు జరిగిపోతుంటే కరోనా పేరుతో స్థానిక ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నారంటూ కోర్ట్ నిలదీయడంతో రెండు వర్గాలు ఏమి చేయనున్నాయి అనే ఆసక్తి ఎపి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

నిమ్మగడ్డ ఏం చెబుతారు …?

ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తుతం వైరస్ ఉన్న నేపథ్యంలో జరపలేమని తేల్చింది. కానీ దీనిపై ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని కోర్టు కోరింది. వాస్తవానికి వచ్చే ఏడాది మార్చి నాటికి నిమ్మగడ్డ పదవీకాలం పూర్తి కానుంది. ఆయన ఉండగా ఎన్నికలు జరపడం అధికారపార్టీకి ఇష్టం లేనట్లు స్పష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో ఏ కారణంతో నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారో అదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. అయితే ఈ విషయం ఎన్నికల కమిషన్ అధికారికంగా చెప్పాలని కోర్ట్ కోరడంతో నిమ్మగడ్డ గతంలో తన మాట మీద నిలబడే ఎన్నికలు వాయిదా వేస్తారా ? లేక జరిపించి అధికారపార్టీకి మరో సవాల్ విసురుతారా అన్నది చూడాలి.

ఎన్నికల నిర్వహణకు…..

ఎన్నికలు వాయిదాకు ఆయన మొగ్గు చూపితే ఎలాంటి వివాదం ఉండదు. అలా కాకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సై అంటే మాత్రం టిడిపి ఏజెంట్ గా ఆయన పై పడిన ముద్ర కు వైసిపి మరోసారి గట్టి ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదు. కేసులు ఏమి లేనప్పుడు ఎన్నికలు వాయిదా వేసి వేల కేసులు ఉన్నప్పుడు ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రెడీ ఎలా అయ్యారంటూ అధికారపార్టీ నానా అల్లరి చేసే ఛాన్స్ లేకపోలేదు. బాల్ ఇప్పుడు నిమ్మగడ్డ కోర్ట్ లో వుంది దాన్ని ఎలా ఆడినా జగన్ సర్కార్ తిప్పికొట్టేందుకు ఎదురుచూస్తుంది. చూడాలి ఏమి జరగనుందో ?

Tags:    

Similar News