జగన్ నడపలేక పోతున్నారా ?

జగన్ ఎన్నడూ లేని తీవ్ర వత్తిడిలో ఉన్నారు. ఆయన అనుకున్నట్లుగా పాలన చేయలేకపోతున్నారు. ఓ వైపు పాలనాపరమైన కష్టాలు వెంటాడుతున్నాయి. మరో వైపు జగన్ మీద వ్యక్తిగతంగా [more]

Update: 2020-11-21 02:00 GMT

జగన్ ఎన్నడూ లేని తీవ్ర వత్తిడిలో ఉన్నారు. ఆయన అనుకున్నట్లుగా పాలన చేయలేకపోతున్నారు. ఓ వైపు పాలనాపరమైన కష్టాలు వెంటాడుతున్నాయి. మరో వైపు జగన్ మీద వ్యక్తిగతంగా కేసులు ఉన్నాయి. దానికి తోడు పాలనలో ఎదురవుతున్న కోర్టు కేసులు, మొట్టికాయలు బోలెడు ఉన్నాయి. ఖాళీ ఖజానా అప్పులు పుట్టని దుస్థితి. కేంద్రంలో బలమైన మోడీ సర్కార్ మొండి వైఖరి, వీటికి తోడు ఏపీలో చాణక్య చంద్రబాబు ఇలా అన్ని వైపుల నుంచి జగన్ ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు అన్నట్లుగా ఇపుడు సొంత పార్టీలో నేతల తిరుగుబాట్లు జగన్ కి ఏమీ పాలుపోనీయకుండా ఉన్నాయి.

జోడు గుర్రాల స్వారీ…?

అధికారంలో ఉన్న పార్టీని నడపడం బహు కష్టం. ఎన్నో ఆశలు ఉంటాయి. ఆకాంక్షలు ఉంటాయి నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా వివిధ కేటగిరీల్లోని నాయకులు ఉంటారు. వీరందరికీ పార్టీ లైన్ దాటనీయకుండా చూసుకోవడం కత్తి మీద సాము. పైగా ప్రజల కన్ను కూడా ఎపుడూ అధికార పార్టీ మీదనే ఉంటుంది. ఎక్కడ తప్పు జరిగినా భూతద్దంలో చూపించే మీడియా కూడా ఎటూ రెడీగా ఉంటుంది మరి జగన్ ఈ సమయంలో జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. ప్రభుత్వం ఏడాదిన్నర గడచినా గాడిన పడలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక పార్టీని జగన్ పట్టించుకునే తీరిక ఓపిక రెండూ లేవు అంటున్నారు. దాంతో నేతల నోళ్ళు లేస్తున్నాయి. ఎక్కడికక్కడ కంపు చేసేలా కొందరు వ్యవహరిస్తున్న వైనం మొత్తం పార్టీ కొంపనే ముంచేలా ఉంది.

కొత్త నేత రావాల్సిందే…?

వైసీపీలో జగన్ తప్ప మరో నేతను ఎవరూ ఊహించలేరు. అయితే అన్నీ ఆయనే అంటే అది అసలు కుదిరే పని కాదు. జగన్ ప్రభుత్వ పాలనే చూసుకుంటారా? పార్టీ పంచాయతీలే తీరుస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. అందువల్ల జగన్ పార్టీ బాధ్యతలను వదిలేసి తనకు నమ్మకమైన వారికి అప్పగించాలన్న మాట ఇపుడు వైసీపీలో వినిపిస్తోంది. జగన్ కి రాను రానూ ప్రభుత్వ పరంగా మరింత బాధ్యత పెరుగుతుంది. మరో ఏడాది గడిస్తే మళ్ళీ 2024 ఎన్నికల మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అందువల్ల జగన్ పార్టీని ఇపుడున్న బిజీ షెడ్యూల్ మధ్యలో అసలు నడపలేరు. దాంతో పార్టీ పగ్గాలు వేరొకరికి అప్పగించడం అంత ఉత్తమం లేదని, అపుడే కరెక్ట్ గా పార్టీ కంట్రోల్ లోకి వస్తుందని కూడా అంటున్నారు.

చెల్లెమ్మ ఆదుకుంటుందా…?

జగనన్న వదిలిన బాణాన్ని అని ఎనిమిదేళ్ళ క్రితం దూసుకువచ్చిన షర్మిల గత ఎన్నికల వేళ వూరూ వాడా తిరిగి బై బై బాబూ అంటూ ప్రచారం చేశారు అది చాలా పవర్ ఫుల్ గా సాగి జగన్ విజయాన్ని రెట్టింపు చేసింది. షర్మిలలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. పైగా ఆమెకు కూడా పార్టీ నేతలందరితో పరిచయాలు ఉన్నాయి. చూడబోతే లోకల్ బాడీ ఎన్నికలు దగ్గర అవుతున్నాయి ఈ కీలకమైన సమయంలో ఆమెను తీసుకువచ్చి పార్టీ పగ్గాలు అప్పగిస్తే మళ్ళీ మునుపటిలా పరుగులు తీస్తుందని అంటున్నారు. జగన్ ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షర్మిలకు పార్టీ బాధ్యతలు అందించడం ద్వారా వైసీపీని గాడిన పెట్టవచ్చునని విలువైన సూచనలే అందుతున్నాయట. మరి జగన్ దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News