Ys sharmila : షర్మిలను జగన్ ఆ విధంగా చేద్దామనుకుంటున్నారా?

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించి ఇరవై రోజులు దాటుతోంది. పాదయాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. రోజుకూ పన్నెండు కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది. [more]

Update: 2021-11-11 09:30 GMT

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించి ఇరవై రోజులు దాటుతోంది. పాదయాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. రోజుకూ పన్నెండు కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది. ఇప్పటికే షర్మిల పాదయాత్ర 200 కిలోమీటర్లు దాటింది. మరో 3,800 కిలోమీటర్ల మేర పాదయాత్రను వైఎస్ షర్మిల కొనసాగించాల్సి ఉంటుంది. అయితే పాదయాత్ర ముగిసే సమయానికి తెలంగాణలో షర్మిల పార్టీపై కొంత క్లారిటీ వచ్చే అవకాశముంది.

పరోక్ష సహకారం….

ఇటీవల వైఎస్సార్ అవార్డుల కార్యక్రమానికి వెళ్లిన విజయమ్మ షర్మిల పాదయాత్రపై జగన్ తో చర్చించారని చెబుతున్నారు. షర్మిలకు వైసీపీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను నిలిపివేసినట్లు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే వైసీపీకి ఇంకా క్యాడర్, నేతలు ఉన్నారు. వారిని షర్మిల పార్టీ వైపు మళ్లేలా ఏపీ వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

అండగా ఉంటామన్న సంకేతాలు…

వైఎస్ షర్మిలకు తాము అండగా ఉన్నామన్న సంకేతాలను కూడా ఇవ్వనున్నారు. దీంతో వైఎస్ షర్మిల పాదయాత్ర ముగించే నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ కూడా పరోక్షంగా సహకరించనున్నారు. వైఎస్ షర్మిల పాదయాత్ర కు ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు వచ్చి సంఘీభావాన్ని ప్రకటించి వెళ్లిపోయారు. మరికొందరు నేతలు కూడా షర్మిలకు మద్దతు తెలిపేందుకు రానున్నారు.

ఏపీ నాయకుల ప్రయత్నాలతో….

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓటర్లు తెలంగాణలో కోటి మంది వరకూ ఉన్నారు. వీరిలో అన్ని సామాజికవర్గాలున్నా వారిని ఆకట్టుకునేందుకు వైఎస్ షర్మిల ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ ఓట్లు అధికార టీఆర్ఎస్ వైపు మళ్లాయి. వీటిని షర్మిల సాధించేలా కొందరు వైసీపీకి చెందిన నాయకులు ప్రయత్నిస్తారంటున్నారు. మొత్తం మీద 2023 ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఫెయిల్ కాకుండా ఉండేలా జగన్ పరోక్షంగా సహకరిస్తున్నారన్న చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News