ఇక్కడ లోకల్ ఎప్పుడూ వీకేనా?

ఏపీలో అతి పెద్ద నగరంగా విశాఖను చెప్పుకుంటారు. విశాఖ ఉమ్మడి ఏపీలో కూడా హైదరాబాద్ తో పాటు తరచూ ప్రస్థావనకు వచ్చే సిటీగా ఉండేది. ఇక విభజన [more]

Update: 2021-03-06 05:00 GMT

ఏపీలో అతి పెద్ద నగరంగా విశాఖను చెప్పుకుంటారు. విశాఖ ఉమ్మడి ఏపీలో కూడా హైదరాబాద్ తో పాటు తరచూ ప్రస్థావనకు వచ్చే సిటీగా ఉండేది. ఇక విభజన తరువాత ఏపీకి రాజసం తో కూడిన సిటీ ఏదినా ఉంది అంటే అది విశాఖ మాత్రమే అని అంతా ఒప్పుకుంటారు. ఆ విశాఖ మీద ఇపుడు ఆధిపత్య కులాల కన్ను పడింది. అంతే కాదు, రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా విశాఖ వైపు చూస్తున్నాయి. పంతం నీదా నాదా విశాఖ నా సొంతం అంటూ పెద్ద సవాళ్ళే చేసుకుంటున్నాయి.

ఢీ అంటే ఢీ ….

తెలుగుదేశం పుట్టక ముందు విశాఖలో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం ఉండేది. విశాఖ కార్పొరేషన్ మొదటి మేయర్ ఆ సామాజికవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. టీడీపీ రాకతో కమ్మ వారి పెత్తనం ఎక్కువైపోయింది. దానికి తోడు కాంగ్రెస్ కూడా రాజకీయంగా వీక్ కావడంతో ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా టీడీపీ విశాఖలో పట్టు సాధించింది. దాంతో స్టీల్ సిటీలో అప్రతిహతంగా ఆ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. దానికి బ్రేకులు వేయడానికి వైసీపీ అన్ని విధాలుగా చూస్తోంది.

రాజధాని అందుకే…?

విశాఖనే రాజధానిగా చేసుకొవడం వెనక కులాల ఆధిపత్యమే ఉందని చెబుతారు. వైసీపీ ఇపుడు రెడ్లకు దొరికిన బలమైన ప్రాంతీయ పార్టీగా చూస్తున్నారు. గతంలో టీడీపీ మీద ఉన్న మోజు ఇపుడు వైసీపీ మీద జనాలకు ఉంది. దాంతో పాటు యువకుడు అయిన జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలా చూసుకున్నా మరో మూడు దశాబ్దాల దాకా వైసీపీ రాజకీయ వెలుగులకు ఢోకా లేదు అన్న మాట కూడా ఉంది. దాంతో రెడ్లు ఒక్కసారిగా జూలు విదిలిస్తున్నారు. విశాఖను కేంద్రంగా చేసుకుని తమదైన రాజకీయానికి తెర తీస్తున్నారు.

లోకల్ వీక్…..

ఈ మొత్తం పోరాటంలో స్థానికులే బలి అవుతున్నారు. విశాఖ సహా ఉత్తాంధ్రా జిల్లాలో బీసీలు, ఇతర సామాజిక వర్గాల వారు అధికంగా ఉన్నారు. అయితే వీరికి రాజకీయంగా ఆధిపత్యం చేసే స్థాయి లేకపోవడంతో పాటు, ఆర్ధికంగా కూడా వెనకబాటుతనం కూడా ఆసరాగా చేసుకుని రెండు పార్టీలు, రెండు ప్రధాన కులాలు సంకుల సమరానికి తెర లేపాయని అంటున్నారు. ఇంతకాలం టీడీపీ వెనక ఉన్న బీసీలు ఇపుడు వైసీపీని అనుసరిస్తారు. ఈ మొత్తం పోరులో విజేత అటు నుంచి ఇటు అయినా లోకల్ ఎపుడూ వీకే అన్న మాట మేధావుల నోటి వెంట వస్తోంది.

Tags:    

Similar News