ఫ్యాక్ట్ చెక్: పాస్టర్ల మధ్య గొడవ ఇటీవల జరిగిందంటూ పాత వీడియోను ఇటీవలిదా ప్రచారం చేస్తున్నారు

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో లూథరన్ చర్చ్ లో పాస్టర్ల్ మధ్య గొడవ

Update: 2024-12-28 17:12 GMT

డిసెంబర్ 25న క్రిస్మస్ ను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. పలు ప్రముఖ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.


తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న మెదక్ కేథడ్రల్ చర్చిని క్రిస్మస్ రోజున సందర్శించారు. ఈ చర్చికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు. మెదక్‌లోని చర్చి శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొని క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. చర్చి అభివృద్ధికి ప్రభుత్వం తగినన్ని నిధులు విడుదల చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ హోదాలో చర్చికి వెళ్లి ఆశీస్సులు పొందానని, మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తానని శపథం చేశానని రేవంత్‌ రెడ్డి గుర్తు చేసుకున్నారు. క్రిస్మస్, చర్చి శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి చర్చిని సందర్శించానని చెప్పారు.


ఇంతలో ఇద్దరు పాస్టర్లు కొట్టుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.. గందరగోళంగా ఉన్న చర్చి ప్రాంగణంలో ఓ పాస్టర్ మైక్ లో ఏదో చదువుతూ ఉండగా మరో పాస్టర్ వచ్చి తోసేయడం మనం చూడొచ్చు. ఆ తర్వాత ఇరువురూ గొడవ పడుతూ ఉండగా మరికొందరు వచ్చి ఆ గొడవను ఆపడానికి ప్రయత్నించారు.

సైఫా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో లూథరన్ చర్చ్ లో పాస్టర్ల్ మధ్య ఈ గొడవ జరిగిందంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.

"సైఫా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో లూథరన్ చర్చ్ లో పాస్టర్ల్ మధ్య వివాదం. కానుకల విషయం లో తెలెత్తిన గొడవ. #Christmas #church #pastor #BREAKING" అంటూ పోస్టులు పెట్టారు.



"చర్చ్‌లో పాస్టర్ల మధ్య గొడవ ..వైరల్ అవుతున్న వీడియో | Fight b/w Church Pastors Goes Viral | ABN" అంటూ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ABN న్యూస్ కూడా వీడియోను పోస్టు చేసింది. తాజాగా జరిగిన ఘటన అంటూ క్రైమ్ కరస్పాండెంట్ చెప్పడం కూడా మనం వినవచ్చు.

Full View



కానుకల విషయంలో పాస్టర్ల మధ్య గొడవ జరిగిందంటూ NTV కూడా కథనాన్ని నివేదించింది

Full View


వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు


 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు.

వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియో ఏడాది కిందట నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని తేలింది.


India Against Urban Naxals 2 అనే ఫేస్ బుక్ పేజీలో

"In Rajahmundry, AndhraPradesh Church pastors fighting for their share of the 10% looted from the crypto sheep. Warning : the translation is a Parody !" అనే టైటిల్ తో ఇదే వీడియోను పోస్టు చేశారు.

Full View



ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జరిగిన ఘటన అంటూ ఫిబ్రవరి 3, 2023న ఈ వీడియోను అప్లోడ్ చేశారు.


Mission Kaali - English అనే ఫేస్ బుక్ పేజీలో కూడా "Pastors of Rajamahendravarman (Rajahmundry) church fighting over 10% share.Andhra Pradesh." అనే టైటిల్ తో వీడియోను ఫిబ్రవరి 4, 2024న అప్లోడ్ చేశారు.

Full View


కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో 2023 నుండి ఆన్ లైన్ లో ఉందని గుర్తించాం.

ఇక ఈ పోస్టులను క్యూ గా తీసుకుని సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేశాం. జనవరి 21, 2019లో కూడా ఈ వీడియోను పోస్టు చేశారని తెలిసింది.



ఇక ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఫిబ్రవరి 3, 2023న వైరల్ వీడియో గత కొన్నేళ్లుగా ఆన్ లైన్ లో ఉందంటూ వివరణ ఇచ్చింది.



ఇది పాత వైరల్ వీడియో, గత 4-5 సంవత్సరాలుగా విభిన్న సందర్భాలతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనవరి 2019, ఏప్రిల్ 2019లో ఈ వీడియోని ఆన్ లైన్ లో పోస్టు చేసారంటూ ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ వివరించింది.

ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటూ తెలుగు పోస్ట్ స్వతంత్రంగా ధృవీకరించనప్పటికీ.. ఈ ఘటన ఇటీవల చోటు చేసుకున్నది కాదని స్పష్టం చేశాం.

వైరల్ వీడియో 2019 సంవత్సరం జనవరి నుండి ఆన్ లైన్ లో ఉందని తెలుస్తోంది. 
వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Claim :  సైఫా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో లూథరన్ చర్చ్ లో పాస్టర్ల్ మధ్య గొడవ జరిగింది
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News