ఫ్యాక్ట్ చెక్: బీహార్ లో ప్రజలు ఏనుగుపై పులిని తరలించారనే వాదన నిజం కాదు

బెంగాల్ టైగర్ భారతదేశం, చైనా మొదలైన ఆసియా దేశాలలోని సమశీతోష్ణ, ఉష్ణమండల ప్రాంతాలలో నివసిస్తుంది. భారతదేశం బెంగాల్ టైగర్

Update: 2024-12-27 06:03 GMT

Man eater killed

బెంగాల్ టైగర్ భారతదేశం, చైనా మొదలైన ఆసియా దేశాలలోని సమశీతోష్ణ, ఉష్ణమండల ప్రాంతాలలో నివసిస్తుంది. భారతదేశం బెంగాల్ టైగర్ సహజ ఆవాసం. భారతదేశంలోని ప్రసిద్ధ టైగర్ రిజర్వ్‌లు మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గర్ నేషనల్ పార్క్, రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్‌లోని కన్హా నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మొదలైన వాటిలో పులులు ఎక్కువగా జీవిస్తున్నాయి. 2023 నాటికి, భారతదేశంలో 3,682 అడవి పులులు ఉన్నాయని అంచనా , ఇది ప్రపంచంలోని అడవి పులుల జనాభాలో దాదాపు 75%. బెంగాల్ టైగర్ అంతరించిపోతున్న జాతి, వీటిని వేటాడటం నిషేధం.

ఏనుగు వీపుపై పులిని కట్టేసి, దానితో పాటు ఇద్దరు వ్యక్తులు కూర్చుని, పులి చెవులను వెనక్కు లాగుతూ ప్రయాణిస్తున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో హిందీలో “ये बिहार है,यहां उड़ती चिड़िया को हल्दी लगा देते हैं,बाघ को ऐसे ही घुमाते हैं।” అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో బీహార్‌కి చెందినదని, ఈ ఘటన ఇటీవల బీహార్‌లో జరిగిందని పేర్కొన్నారు.


క్లెయిం ఆర్కైవ్ లింకు ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో 2011 నాటిది. బీహార్‌ లో ఇటీవల చోటు చేసుకుంది కాదు.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి తనిఖీ చేసినప్పుడు, “2011లో, ఉత్తరాఖండ్‌లోని సుందర్‌ఖాల్, పులి ఆరు ప్రాణాలను బలిగొన్నట్లుగా కనుగొన్నాం. మాన్-ఈటర్‌గా మారిన ఈ పులి స్థానికులలో భయాన్ని రేకెత్తించింది." అని తెలిపారు. ఈ పులిని పట్టుకునేందుకు అధికారులు ఎడతెగని గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పట్టుకుని ప్రజలకు చూపించడం కోసం ఏనుగుపై ఊరేగించారు. భారతదేశంలో సంవత్సరానికి సగటున 55 పులుల మరణాలు నమోదవుతున్నాయి, ఎక్కువగా గ్రామస్తులు, అటవీ ప్రాంతాలకు చెందిన వాళ్లే ఉన్నారు. కుంచించుకుపోతున్న ఆవాసాలు మానవ-వన్యప్రాణుల సంఘర్షణల కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయి. 
బంధించిన పులిని ఊరేగించడం నైతిక ఆందోళనలను పెంచుతుంది, జంతువులకు సరైన చికిత్స, పరిరక్షణ అవగాహనల గురించి చర్చలకు దారి తీసింది.

Samburhunter అనే YouTube ఛానెల్‌ నుండి ఈ వీడియో తీసుకున్నట్లు ఇన్స్టా గ్రామ్ పోస్టులు చెబుతున్నాయి. మేము ఈ YouTube ఛానెల్ కోసం శోధించినప్పుడు, YouTube ఛానెల్ Samburhunter జనవరి 2012లో వీడియోకు సంబంధించి నిడివి ఎక్కువ ఉన్న వీడియోను అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. వీడియోలో వివరణలో “Jan 2011. Death became of the man-eater which killed 6 people and terrorized local villagers.” అని ఉంది. జనవరి 2011లో 6 మందిని పులి చంపిందంటూ తెలిపారు.
Full View
ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో 2011 సంవత్సరానికి చెందిన వీడియో ఇది అంటూ ఫారెస్ట్ అధికారి పర్వీన్ కస్వాన్ పోస్ట్‌ను కూడా కనుగొన్నాము. పులి 6 మందిని చంపింది, ఆ తరువాత పులిని అధికారులు వేటాడారు. బహుశా ఆ ప్రదేశానికి వాహనాలు వెళ్లలేకపోవడంతో ఏనుగుపై తరలించాల్సి వచ్చిందని తెలిపారు.
ఇండియా టుడే న్యూస్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన కథనం ప్రకారం, పులిని చంపేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 27 ఏళ్ల వ్యక్తిని చంపినట్లు అనుమానంతో కోసి నది శ్రేణి ప్రాంతంలో పులిని కాల్చి చంపారు. మనిషి మాంసం రుచి మరిగినందుకే పులిని చంపామని అధికారులు తెలిపారు. పులిని చంపిన ఘటనపై ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విచారణకు ఆదేశించగా, పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పట్లో నివేదిక కోరినట్లు తెలుస్తోంది.
కుమావోన్‌లోని కార్బెట్ రిజర్వ్‌, ఆ చుట్టుపక్కల భీభత్సం సృష్టించిన పులిని ఫారెస్ట్ అధికారులు కాల్చి చంపారు, గత మూడు నెలల్లో కనీసం ఆరుగురిని పులి చంపింది. 27 ఏళ్ల వ్యక్తిని చంపి తినేసింది. పురాణ్ చంద్‌గా గుర్తించిన వ్యక్తి అవశేషాలు కనుగొన్న తరువాత 10 అడుగుల పొడవు గల పెద్ద పిల్లిని గుర్తించడానికి అటవీ అధికారులు విస్తృతమైన కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు నెలల పాటు ప్రజలను వేటాడిన పులిని అంతం చేసినట్లు ఉత్తరాఖండ్ అటవీ అధికారులు ధృవీకరించారు.
కాబట్టి, వైరల్ వీడియో 2011 నాటిది, ఉత్తరాఖండ్‌కు చెందినది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  బీహార్‌లో ప్రజలు ఏనుగుపై పులిని తరలిస్తున్నారు
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News