ఫ్యాక్ట్ చెక్: లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి ఏడుస్తున్న వీడియో ఇటీవలిది కాదు

భారతదేశంలో అవినీతి, లంచగొండితనం ఇప్పటికీ ప్రధాన సమస్యలుగానే ఉన్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై అవినీతి తీవ్ర ప్రభావాన్ని

Update: 2024-12-24 07:36 GMT

Tahsildar office

భారతదేశంలో అవినీతి, లంచగొండితనం ఇప్పటికీ ప్రధాన సమస్యలుగానే ఉన్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై అవినీతి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రతి సంవత్సరం అవినీతి కారణంగా భారతదేశం జిడిపిలో 0.5% కోల్పోతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. భారతదేశంలో లంచం తీసుకోవడం ఒక క్రిమినల్ నేరం, జైలు శిక్ష, జరిమానాలు లేదా రెండూ విధిస్తారు. లంచం ఇస్తే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ ఉంటాయి. ఆహారం, పానీయం, వినోదం లేదా ఇతర సదుపాయాలను అందించడం వంటి వాటి ద్వారా కూడా లంచం ఇస్తుంటారు. అవినీతి నిరోధక సంస్థ ఎప్పటికప్పుడు లంచగొండి అధికారులను పట్టుకుంటూ ఊచలు లెక్కిస్తూ వస్తోంది.

అలాగే, లంచం తీసుకుంటూ కరీంనగర్‌లో డిప్యూటీ తహశీల్దార్‌ని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కరీంనగర్‌లో ఏసీబీకి పట్టుబడిన అధికారి వీడియోను టుడే న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసింది. “చూడండి: రెడ్ హ్యాండెడ్ గా అవినీతికి పాల్పడిన అధికారిని కరీంనగర్ లో పట్టుకున్నారు. అతడు ఏడుస్తూ ఉన్నాడు” అనే శీర్షికతో షేర్ చేశారు. 22 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారి చేతులను రెండు గ్లాసుల నీళ్లలో ముంచి ‘ఫినాల్‌ఫ్తాలియన్ టెస్ట్’ చేయడాన్ని చూపారు. పట్టుబడిన అధికారి ఏడుస్తూ ఉండడం మనం చూడవచ్చు.

Full View


హుజూరాబాద్, కరీంనగర్‌లోని ఆర్‌డిఓ కార్యాలయంలో ఏసీబీ ఒక ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకున్నట్లు కొన్ని వెబ్‌సైట్‌లు వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను కూడా పంచుకున్నాయి. ఈ వార్తా కథనాలు డిసెంబర్ 22, 2024న తెలంగాణ టుడే, సఫీర్ న్యూస్‌లో కూడా ప్రచురించారు.

ఈ ఉదంతం గురించి తెలంగాణ టుడే ఇలా ప్రచురించింది "హుజూరాబాద్‌లోని రెవిన్యూ డివిజనల్ అధికారికి క్యాంపు క్లర్క్ సందీప్ అనే అధికారిని సాధారణ దుస్తులలో ఉన్న అధికారులు పట్టుకున్నట్లు వీడియో చూపిస్తోంది, అతను కల్తీ కరెన్సీ వాడ్‌ను స్వీకరించిన తర్వాత 'ఫినాల్ఫ్తలీన్ పరీక్ష' చేయడానికి రెండు గ్లాసుల నీటిలో చేతులు ముంచమని వారు చెప్పడం, అతని చేతులు గులాబీ రంగు లోకి మారాయి. చేతులపై ఫినాల్ఫ్తలీన్ రసాయనం ఉన్న నీటిని తాకినప్పుడు, నీరు గులాబీ రంగులోకి మారుతుంది, అలా మారినప్పుడు లంచం డబ్బు అంగీకరించినట్టు రుజువు అవుతుంది. అవినీతి నిరోధక బ్యూరో (ఆఛ్భ్) సాధారణంగా కరెన్సీ నోట్లకు కనిపించని రసాయనం కోటును పూసిన తర్వాత లంచం డిమాండ్ మొత్తాన్ని ఫిర్యాదుదారుడికి అందజేస్తుంది. ఫిర్యాదుదారుడు లంచం డబ్బును అధికారికి అందజేసిన తరువాత, ఆ డబ్బును స్వీకరించినట్టు ఫిర్యాదుదారు నుండి సిగ్నల్ అందడంతో, సాధారణ దుస్తులలో వేచి ఉన్న ఆఛ్భ్ అధికారులు అతనిపై దాడి చేశారు. కరెన్సీని స్వాధీనం చేసుకుని లంచం కోరే అధికారి చేతులను రెండు గ్లాసుల నీటిలో ముంచారు. పింక్ కలర్ వాటర్ కరెన్సీ నోట్లతో పాటు సీలు వేయబడుతుంది, వాటి సంఖ్యలను నమోదు చేసి, లంచం అంగీకరించినట్టు శాక్ష్యాన్ని కోర్టుకు సమర్పిస్తారు. కరెన్సీ కేసులో, ఋడో క్యాంపు క్లర్క్ (లేదా సహాయకుడు) సందీప్ 'నాలా మార్పిడి'కి అధికారికంగా సహాయం చేసేందుకు ఒక రైతు నుండి రూ. 75,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అరెస్టు చేసిన అధికారిని కోర్టులో హాజరు పరిచారు. " 

క్లెయిం స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.


ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. వైరల్ వీడియో ఇటీవలిది కాదు. ఈ సంఘటన 2019 సంవత్సరంలో జరిగింది.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ శోధనను ఉపయోగించి సెర్చ్ చేశాం. వీడియో 5 సంవత్సరాల క్రితం యూట్యూబ్ లో అప్లోడ్ చేశారని తెలుస్తోంది.
ఏజి -న్యూస్ ఏజెన్సీ అనే యూట్యూబ్ ఛానెల్ డిసెంబర్ 16, 2019న “AZ-NEWS: S.Sandeep Kumar RDO Huzurabad Karimnagar District Arrested By Anti Corruption Bureau”. అనే శీర్షికతో వీడియోను షేర్ చేశారు. 75,000 రూపాయలని లంచంగా స్వీకరిస్తున్నప్పుడు శ్.సందీప్ కుమార్ అనే ఋడో కరీంనగర్ జిల్లా అవినీతి నిరోధక బ్యూరో ద్వారా అరెస్టు చేశారని వీడియో వివరణ పేర్కొంది.
Full View
న్యూస్‌మీటర్‌ వెబ్‌సైట్లో ప్రచురించిన వార్తా కథనాన్ని కూడా మేము కనుగొన్నాము. వైరల్ వీడియో స్క్రీన్‌షాట్‌లను ఆ కథనంలో భాగస్వామ్యం చేశారు. కరీంనగర్‌లోని హుజూరాబాద్‌లోని రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహశీల్దార్ శ్రీరామోజు సందీప్‌కుమార్‌ రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు కథనంలో తెలిపారు. వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా మార్చడానికి సంబంధించిన నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ మంజూరు కోసం లంచం డిమాండ్ చేశారు. జోజిరెడ్డి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు సందీప్‌కుమార్‌ను అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
వైరల్ వీడియో ఇటీవలిది కాదు, డిసెంబర్ 2019 లో జరిగిన సంఘటన. ఇటీవల చోటు చేసుకున్న ఘటన అనే వాదన తప్పుదారి పట్టిస్తూ ఉంది.
Claim :  లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి ఏడ్చేసిన వీడియో వైరల్‌గా మారింది
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News