ఫ్యాక్ట్ చెక్: ఏటీఎం పిన్ ను వెనుక నుండి ముందుకు టైప్ చేస్తే పోలీసులు వస్తారనే వాదన నిజం కాదు.
ఏటీఎం పిన్ ను వెనుక నుండి ముందుకు టైప్ చేస్తే దగ్గర లోని
ఏటీఎం కార్డుల చుట్టూ ఎన్నో ఫ్రాడ్లు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్‌లు (ATM) ఉపయోగించి ప్రజలను మోసం చేయడానికి స్కామర్లు కొత్త సాంకేతికతతోనూ, కొత్త ట్రిక్స్ తోనూ ముందుకు వస్తూ ఉన్నారు. ఏటీఎంలు అవసరమైనప్పుడు డబ్బులు తీసుకోడానికి వినియోగదారులకు ఎంతో సహాయకరంగా ఉంటాయి. ఈ సౌలభ్యం చుట్టూ ఎన్నో రిస్క్ లు కూడా ఉంటాయి. అదే స్థాయిలో ATM మోసాలు కూడా పెరుగుతున్నాయి, ఈ మోసాలను ఎదుర్కోవడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఏటీఎం కార్డు వివరాలను, పిన్ ను ఇతరులతో పంచుకోకండి. అంతేకాకుండా మీరు ఏటీఎం నుండి డబ్బులు విత్ డ్రా చేసుకునే సమయంలో మీ చుట్టూ ఎవరూ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే!!
కొన్ని కొన్ని సార్లు ఏటీఎం మెషీన్లకు సంబంధించిన కీబోర్డ్ ను జామింగ్ చేసేస్తూ ఉంటారు. స్కామర్‌లు ఉద్దేశపూర్వకంగా ATM కీప్యాడ్‌లోని 'Enter', 'Cancel' లేదా న్యూమరిక్ కీల వంటి కీ బటన్‌లను నిలిపివేస్తారు. ఇలా చేయడం ద్వారా వినియోగదారు ట్రాన్సక్షన్ ను ఆ తర్వాత స్కామర్లు పూర్తీ చేసుకుంటారు.
ఇక ఏటీఎంలలో డబ్బులు తీసుకునే సమయంలో కొందరు మీ వెనకాలే వచ్చి డబ్బులు తీసివ్వాలంటూ బెదిరించే ప్రమాదం కూడా పొంచి ఉంది. అలాంటి సమయాల్లో మీ పిన్ ను రివర్స్ కొడితే పోలీసులు మీకు సహాయం చేయడానికి వస్తారంటూ కూడా కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
"మిమ్మల్ని ఎప్పుడైనా దొంగలు బలవంతంగా ATM నుండి మనీ తియ్యమంటే. మీరు గొడవపడకుండా ప్రశాంతంగా మీ ATM PIN ను రివర్స్ లో ఎంటర్ చెయ్యండి. ఉదాహరణకు : మీ ATM PIN 1234 అనుకోండి మీరు 4321 అని ఎంటర్ చేస్తే అప్పుడు మనీ ATM మెషీన్ SLOT మధ్యలో ఆగిపోతుంది. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు అలర్ట్ చేస్తుంది" అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఇక ఏటీఎంలలో డబ్బులు తీసుకునే సమయంలో కొందరు మీ వెనకాలే వచ్చి డబ్బులు తీసివ్వాలంటూ బెదిరించే ప్రమాదం కూడా పొంచి ఉంది. అలాంటి సమయాల్లో మీ పిన్ ను రివర్స్ కొడితే పోలీసులు మీకు సహాయం చేయడానికి వస్తారంటూ కూడా కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
"మిమ్మల్ని ఎప్పుడైనా దొంగలు బలవంతంగా ATM నుండి మనీ తియ్యమంటే. మీరు గొడవపడకుండా ప్రశాంతంగా మీ ATM PIN ను రివర్స్ లో ఎంటర్ చెయ్యండి. ఉదాహరణకు : మీ ATM PIN 1234 అనుకోండి మీరు 4321 అని ఎంటర్ చేస్తే అప్పుడు మనీ ATM మెషీన్ SLOT మధ్యలో ఆగిపోతుంది. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు అలర్ట్ చేస్తుంది" అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఈ వైరల్ పోస్టు గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో హల్‌చల్ చేస్తోంది. భారతదేశంలో కూడా పలు మార్లు ఈ పోస్టు వైరల్ అయింది.
మేము ఈ విషయం నిజమా కాదా అని తెలుసుకోడానికి పలువురు బ్యాంకింగ్ ఉద్యోగులకు, బ్యాంకు మేనేజర్లకు కాల్ చేశాం. వారెవరూ కూడా ఇలాంటి ఎమర్జెన్సీ టెక్నాలజీ భారతదేశంలో అందుబాటులో లేదని తెలిపారు. దయచేసి ఇలాంటి వదంతులను నమ్మకండని సూచించారు.
ఏటీఎంలలో ఇలాంటి ఎమర్జెన్సీ టెక్నాలజీ ఉందన్న వార్త ఫేక్ అంటూ ‘బిజినెస్ ఇన్‌సైడర్ ఇండియా’ గతంలోనూ ఓ కథనాన్ని ప్రచురించింది. ATM తయారీదారు డైబోల్డ్ భారతదేశంలో ఏ ATMలకు ఎమర్జెన్సీ-పిన్ వ్యవస్థ లేదని ధృవీకరించింది.
పలు మీడియా నివేదికల ప్రకారం, ఈ సాంకేతికత ఉన్నప్పటికీ ఇప్పటివరకు, బ్యాంకులు దానిని అమలు చేయలేదు. ఒకవేళ ఒక వ్యక్తి తన పాస్ వర్డ్ ను 1111 లేదా 2332 అని పెట్టుకున్నారనుకోండి.. అలాంటి వ్యక్తి రివర్స్ లో టైపు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి, ఈ ఫీచర్ ను వాడలేమని బ్యాంకింగ్ నిపుణులు కూడా తెలిపారు.
ఈ వైరల్ పోస్టులో ఎలాంటి నిజం లేదంటూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయి.
ATMలలో ఉపయోగించడానికి ఇటువంటి అత్యవసర సాంకేతికత ఉనికిలో ఉన్నప్పటికీ, వాటిని ఉపయోగించాలంటే వచ్చే ఇబ్బందుల కారణంగా ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా అమలు చేయలేదు. ఏటీఎంలలో డబ్బులు తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మీ కార్డును ఇతరులకు ఇచ్చి కూడా మోసపోవద్దు. మీ ట్రాన్సక్షన్ అయిపోయిన తర్వాత మీ చేతులతోనే మీ కార్డును తీసుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా ఫాలో చేస్తున్నారా, మీ లావాదేవీలను ఎవరైనా చూస్తున్నారా అనే విషయాలను కూడా మీరు ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకోకండి. అనుకోని ఆపదలు ఎదురైన సమయంలో ధైర్యంగా ఉండండి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ఏటీఎం పిన్ ను వెనుక నుండి ముందుకు టైప్ చేస్తే దగ్గర లోని పోలీసు స్టేషన్ కు అలర్ట్ పంపుతుంది
Claimed By : Social Media Users
Fact Check : False