ఫ్యాక్ట్ చెక్: నటుడు విజయ్ జోసెఫ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఇటీవల కలిశారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
విజయ్ జోసెఫ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్;

తమిళనాడు చిత్ర పరిశ్రమలో తనకంటూ గొప్ప పేరు తెచ్చుకున్న ఇళయదళపతి విజయ్ జోసెఫ్ ఆ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఓ వైపు తన 69వ సినిమాలో నటిస్తూనే మరో వైపు ప్రజల సమస్యల గురించి తన వాయిస్ ను వినిపిస్తూ ఉన్నారు. తమిళగ వెట్రి కజగం పార్టీని ఫిబ్రవరి 2, 2024న విజయ్ స్థాపించారు. తమిళనాడు, పుదుచ్చేరిలో విజయ్ పార్టీ పోటీ చేయనుంది. పార్టీ స్థాపించిన తేదీ నుండి పార్టీ అధ్యక్షుడిగా విజయ్ నాయకత్వం వహిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయం సీషోర్ టౌన్, 8వ అవెన్యూ, పనైయూర్, చెన్నైలో ఉంది. విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం ప్రారంభించిన తర్వాత 2026 ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
కాంచీపురం జిల్లా పరందూర్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఏకనాపురం గ్రామస్తులతో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ కలిశారు. విమానాశ్రయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులను కలుసుకున్న ఆయన డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. చెన్నైకి కొత్త విమానాశ్రయానికి తాను వ్యతిరేకం కాదని, 20,000 కోట్ల రూపాయలతో 5,746 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు కోసం సారవంతమైన వ్యవసాయ భూములను సేకరించడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు విజయ్ స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు ద్వారా అధికార పార్టీకి కొంత లాభం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పరందూరు, ఏకనాపురం, చుట్టుపక్కల గ్రామాలలో వ్యవసాయ భూములు కోల్పోతారని విజయ్ ఆరోపించారు. వ్యవసాయ భూములను సేకరించడమే కాకుండా, నీటి వనరులను ధ్వంసం చేసి నిర్మించే కొత్త ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్‌తో హైడ్రో ఎకోలాజికల్ సమస్యలు వస్తాయని, వరదలకు దారితీస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మరో వైపు విజయ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను తాజాగా కలిశారంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. హీరో విజయ్ తో పాటూ పక్కనే దర్శకుడు వంశీ పైడి పల్లి కూడా ఉన్నారు.
'ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన తమిళ హీరో విజయ్, దర్శకుడు వంశీ పైడిపల్లి' అంటూ పోస్టులు పెట్టారు.
మరో వైపు విజయ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను తాజాగా కలిశారంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. హీరో విజయ్ తో పాటూ పక్కనే దర్శకుడు వంశీ పైడి పల్లి కూడా ఉన్నారు.
'ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన తమిళ హీరో విజయ్, దర్శకుడు వంశీ పైడిపల్లి' అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. 2022 లో విజయ్, కేసీఆర్ ను కలిసిన ఫోటోలను ఇటీవలివిగా పోస్ట్ చేస్తున్నారు.
నటుడు విజయ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ భేటీకి సంబంధించిన కథనాల కోసం మేము వెతికాం. అయితే మాకు ఇటీవల భేటీ జరిగినట్లుగా ఎలాంటి కథనాలు లభించలేదు.
ఇక వైరల్ అవుతున్న ఫోటోను మేము గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. 2022లో విజయ్.. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసినట్లుగా పలు కథనాలు లభించాయి. చాలా వరకూ వైరల్ ఫోటోను పోలి ఉన్నాయి.
"Vijay, Vamshi Paidipally meet CM KCR" అంటూ May 19, 2022న https://www.123telugu.com/ లో కథనాన్ని మేము చూశాం. విజయ్ 66వ సినిమా 'వారిసు'కు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఆయనతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. వంశీ పైడిపల్లి తాను, విజయ్ కేసీఆర్‌ను కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫోటోలో ముగ్గురూ తెల్లటి వస్త్రధారణలో కనిపిస్తారు. అప్పట్లో విజయ్ వారిసు సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరిగింది. ఆ సమయంలో కేసీఆర్, వంశీ పైడిపల్లి విజయ్‌ల భేటీ లాంఛనంగా జరిగినట్లు సమాచారం.
"Was a pleasure meeting Honorable @TelanganaCMO Sri.KCR garu along with @actorvijay Sir... :) అంటూ వంశీ పైడిపల్లి తన ట్విట్టర్ ఖాతాలో మే 18, 2022న ఫోటోను పోస్టు చేశారు. వైరల్ ఫోటో, వంశీ పైడిపల్లి పోస్టు చేసిన ఫోటో ఒకటేనని మేము ధృవీకరించాం.
మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా.. 2022 సంవత్సరం మే నెలలో విజయ్, కేసీఆర్ భేటీకి సంబంధించిన పలు కథనాలు మాకు లభించాయి.
వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. విజయ్ తన 66వ సినిమా షూటింగ్ కు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. మే 18న హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు విజయ్. తెలంగాణ సీఎంవో అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా ఫొటోలను కూడా షేర్ చేశారు.
"తమిళ సినీ హీరో @actorvijay ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా విజయ్ ని సీఎం శాలువాతో సన్మానించారు." అంటూ తెలంగాణ సీఎంఓ ట్వీట్ ను చూడొచ్చు.
కాబట్టి, ఈ వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. కేసీఆర్ ను విజయ్ కలిసింది కూడా ప్రగతి భవన్ లో.. ఫామ్ హౌస్ లో కాదు. 2022 లో అప్పటి సీఎం కేసీఆర్ ను కలిసిన ఫోటోలను ఇటీవలివిగా పోస్టు చేస్తున్నారు.
Claim : తమిళ నటుడు విజయ్ జోసెఫ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఇటీవల కలిశారు
Claimed By : Social Media Users
Fact Check : Misleading