ఫ్యాక్ట్ చెక్: రామ జన్మభూమి నిర్మాణం జరుగుతున్న అయోధ్యలో జటాయు పక్షులు రాలేదు.. వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు
చాలా సంవత్సరాల తర్వాత, జటాయువు బృందం అయోధ్యలో కనిపించింది. ఇది ఒక అద్భుతం.
రోడ్డు పక్కన రాబందుల గుంపుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. రాబంధులు రామాయణంలోని జటాయువు వారసులే ఈ రాబంధులని.. పలువురు వినియోగదారులు చెబుతున్నారు. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి ముందు జటాయువు బృందం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను సందర్శించిందనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు సంబంధించిన పేరడీ ఖాతా (@Snatani__1) ద్వారా వైరల్ వీడియో X లో పోస్ట్ చేశారు. క్యాప్షన్ లో "చాలా సంవత్సరాల తర్వాత, జటాయువు బృందం అయోధ్యలో కనిపించింది. ఇది ఒక అద్భుతం. జైతు సనాతన్, జై శ్రీ రామ్, జై గోవింద్." ఈ పోస్ట్‌కి లక్షకు పైగా వ్యూస్ రావడమే కాకుండా.. వేల సంఖ్యలో లైక్స్, రీట్వీట్స్ వచ్చాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము ఇన్‌విడ్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి వీడియోని సెర్చ్ చేశాం. Googleని ఉపయోగించి కీలక ఫ్రేమ్‌లలో ఒకదానిపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. మేము చేసిన ఈ పరిశోధన వైరల్ వీడియోను కలిగి ఉన్న 2021 నుండి ఫేస్‌బుక్ పోస్ట్‌కు దారితీసింది. అక్టోబర్ 8, 2021న, 'Dooz دوز' పేరుతో ఉన్న Facebook పేజీలో "మీకు ఈ పక్షి పేరు తెలుసా?" అని అడిగే అరబిక్ క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసినట్లు గుర్తించాం.
మార్చి 2022లో, IPS అధికారి దీపాంశు కబ్రా (@ipskabra) ఈ వీడియోను పంచుకున్నారు. "నిస్సందేహంగా, ఏదో ఓ విషయం కోసం అత్యవసర సమావేశం జరుగుతోంది" అని చమత్కరించారు.
రాబందుల వైరల్ వీడియోను చూడండి అనే శీర్షికతో TV 9 మరాఠీ 2022లో వైరల్ వీడియోను ప్రదర్శించింది.
"వీడియోలో రోడ్డు పక్కన ఉన్న రాబందులు గుంపును చిత్రీకరించారు... ఈ విధంగా గుమిగూడిన రాబందులను గమనిస్తే వారు ఒక ముఖ్యమైన సమస్యపై అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారనే అభిప్రాయం కలుగవచ్చు" అని మీడియా నివేదిక తెలిపింది. ఆ రాబంధులకు సంబంధించిన ప్రదేశం గురించి మేము సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నాం. అయితే ఈ వీడియో మాత్రం ఇప్పటిది కాదనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం.
రాబందుల సమూహాన్ని చూపించే వైరల్ వీడియో పాతది, 2021 నుండి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది.
రామాయణం లేదా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఎలాంటి లింక్ చేయలేదు.
Claim : A video showing a group of vultures near the roadside has become widely popular on social media. Users are suggesting that these birds are descendants of Jatayu, a demigod from the ancient Indian epic, The Ramayana.
Claimed By : Social Media Users
Fact Check : Misleading