ఫ్యాక్ట్ చెక్: మహిళలకు రాత్రిపూట ఉచిత ప్రయాణం హెల్ప్‌లైన్ నంబర్ లూథియానాకు పరిమితం

మహిళలపై నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. కలకత్తాలో ఓ వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశంలో మహిళల భద్రతపై ఆందోళన రేకెత్తించింది. ఆర్‌జి కర్ ఆసుపత్రిలో డాక్టర్‌పై అత్యాచారం, హత్యను ఖండిస్తూ కోల్‌కతా నగరంలో వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

Update: 2024-08-22 10:41 GMT

helpline

మహిళలపై నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. కలకత్తాలో ఓ వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశంలో మహిళల భద్రతపై ఆందోళన రేకెత్తించింది. ఆర్‌జి కర్ ఆసుపత్రిలో డాక్టర్‌పై అత్యాచారం, హత్యను ఖండిస్తూ కోల్‌కతా నగరంలో వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కోల్‌కతాలో 100 కంటే ఎక్కువ ప్రదేశాలలో నిరసనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చుట్టుపక్కల పట్టణాలకు, అనేక ఇతర భారతీయ నగరాలకు కూడా ఈ నిరసనలు వ్యాపించాయి.

వీటన్నింటి తర్వాత.. చాలా మంది వినియోగదారులు ‘రాత్రిపూట మహిళల భద్రత కోసం, పోలీసులు ఉచిత, సురక్షితమైన రైడ్ సౌకర్యానికి సంబంధించిన హెల్ప్‌లైన్ ను 7837018555 నంబర్‌తో ప్రారంభించారని పేర్కొంటూ తెలుగులో సందేశాలను పంచుకోవడం ప్రారంభించారు.

“రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకని వారు పోలీసు హెల్ప్‌లైన్ నంబర్‌లను (1091 మరియు 7837018555) సంప్రదించి వాహనం కోసం అభ్యర్థించవచ్చని పోలీసులు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. వారు 24x7 గంటలు పని చేస్తారు. కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని PCR వాహనం/SHO వాహనం ఆమెను సురక్షితంగా ఆమె గమ్యస్థానానికి తీసుకెళ్తాయి. ఇది ఉచితంగా చేయబడుతుంది. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి. మీ భార్య, కుమార్తెలు, సోదరీమణులు, తల్లులు, స్నేహితులు మరియు మీకు తెలిసిన మహిళలందరికీ నంబర్‌ను పంపండి.. సేవ్ చేయమని వారిని అడగండి.. పురుషులందరూ దయచేసి మీకు తెలిసిన మహిళలందరికీ షేర్ చేయండి…. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఖాళీ సందేశం లేదా మిస్డ్ కాల్ ఇవ్వగలరు.. తద్వారా పోలీసులు మీ లొకేషన్‌ను కనుగొని మీకు సహాయం చేయగలరు. భారతదేశం అంతటా వర్తిస్తుంది”. అనే మెసేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.


Full View

Full View
వాట్సాప్‌లో కూడా మెసేజ్ వైరల్ అవుతోంది.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. హెల్ప్‌లైన్ నంబర్ -7837018555 అనేది లూథియానా, పంజాబ్ పోలీసులు ఈ ప్రాంతంలోని మహిళల కోసం అందించిన ‘ఉచిత రైడ్’ సౌకర్యం కోసం వినియోగిస్తూ ఉన్నారు.

మేము ట్రూకాలర్‌లో 7837018555 నంబర్‌ను సెర్చ్ చేసినప్పుడు, ఆ నంబర్ లూథియానా పోలీసులకు చెందినదని మేము కనుగొన్నాము.


డిసెంబర్ 2019లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. లూథియానా, పంజాబ్ వెలుపల ఉన్న అనేక మందితో సహా రాత్రిపూట ఇంటికి డ్రాప్ చేసే సౌకర్యాల గురించి నగరవాసులు ఆరా తీస్తూ లూథియానా పోలీసుల మహిళా హెల్ప్‌లైన్ నంబర్‌లకు 3000 కంటే ఎక్కువ కాల్‌లు వచ్చాయి. కొందరు UP, బీహార్, మహారాష్ట్ర, కేరళ వంటి సుదూర ప్రాంతాల నుండి కూడా కాల్ చేశారు. లూథియానా పోలీసుల రెండు హెల్ప్‌లైన్ నంబర్లు - 1091, 7832018555 ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యాయి. పలు కుటుంబాలు కూడా తమ ఇంటి మహిళలు సాయంత్రం వరకు పని చేస్తున్నారని, వారికి సరైన రక్షణ కల్పించాలంటూ కూడా హెల్ప్‌లైన్‌కు కాల్ చేస్తున్నారు. అయితే ఈ నంబర్ లూథియానాలోని మహిళలకు మాత్రమేనని కాల్ చేసిన వారికి పోలీసులు చెప్పారు.

మేము హిందుస్థాన్ టైమ్స్‌లో ప్రచురించిన మరొక కథనాన్ని కూడా కనుగొన్నాము. ఈ హెల్ప్‌లైన్ నంబర్ లూథియానాకు సంబంధించిందని, పంజాబ్‌లోని లూథియానాలో మహిళల సహాయం కోసం తీసుకుని వచ్చారని తెలిపారు.

వైరల్ నంబర్ లూథియానా పోలీసులకు చెందినది అయినప్పటికీ, అనేక రాష్ట్రాల్లోని రాష్ట్ర పోలీసులు సంవత్సరాలుగా మహిళల కోసం భద్రతా విభాగాన్ని ప్రారంభించారు. ఉదాహరణకు, తెలంగాణ పోలీసులు వివిధ పద్ధతులను ఉపయోగించి సంప్రదించగలిగే మహిళా భద్రతా విభాగాన్ని ప్రారంభించారు. వారి వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ నంబర్‌ను కూడా ప్రచురించారు – 8712656858 నెంబర్ కు అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాలని కోరారు. ఇక ప్రాంతాల వారీగా సంప్రదించడానికి ఇతర అధికారుల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి.

ఇండియా టుడే ప్రకారం, తమిళనాడు పోలీసులు రాత్రిపూట రవాణా అవసరమైన మహిళల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా ప్రారంభించారు. 1091, 112, 044-23452365, 044-28447701 నంబర్లను సంప్రదించమని కోరారు.
MTNL ముంబై, ముంబై పోలీసుల సహకారంతో, SMS ఆధారిత సేవ "ట్రావెల్ సేఫ్ వెన్ అలోన్"ను ప్రారంభించింది. ఒంటరిగా ప్రయాణించేటప్పుడు లేదా అర్ధరాత్రి సమయాల్లో మహిళల భద్రత కోసం ఈ సేవ ప్రత్యేకంగా ప్రారంభించారు. మహిళలపై నేరాలు రోజురోజుకు పెరుగుతున్నందున.. ఈ SMS ఆధారిత సేవ ద్వారా ఎవరైనా టాక్సీ/ఆటో నంబర్లు మొదలైన వాటి గురించిన సమాచారాన్ని 9969777888కి SMS ద్వారా పంపవచ్చు.

జాతీయ మహిళా కమిషన్ వెబ్‌సైట్‌లో దేశవ్యాప్తంగా పలు నగరాలు, ప్రాంతాలకు సంబంధించితిన్ కొన్ని ఇతర హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ చూడొచ్చు. హైదరాబాద్ పోలిస్ ఈ ప్రచారం తప్పు దారి పట్టించేది అని తెలిపారు. 
అందువల్ల, వైరల్ అవుతున్న హెల్ప్‌లైన్ నంబర్‌లు దేశం మొత్తానికి పని చేయవు. ఈ నంబర్‌లు పంజాబ్‌లోని లూథియానాకు సంబంధించినవి. వివిధ రాష్ట్రాల పోలీసులు వేర్వేరు హెల్ప్‌లైన్ నంబర్‌లతో మహిళల కోసం ఇలాంటి సేవలను ప్రారంభించారు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim :  హెల్ప్‌లైన్ నంబర్ 7837018555 కు మహిళలు రాత్రిపూట కాల్ చేస్తే భారతదేశంలో ఎక్కడైనా ఉచితంగా, సురక్షితమైన రైడ్‌ని పొందవచ్చు
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News