ఫ్యాక్ట్ చెక్: పుష్ప-2 సినిమాను తెలంగాణలో బ్యాన్ చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

పుష్ప-2 సినిమాను తెలంగాణలో బ్యాన్

Update: 2024-12-23 02:19 GMT

పుష్ప-2 సినిమా ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కొడుకు శ్రీ తేజ్ 15 రోజులు అయినా కూడా ఐసీయూలోనే ఉన్నాడు. అతడి ఆరోగ్యం కుదుటపడుతోంది అని వైద్యులు చెబుతున్నారు.


2024, డిసెంబర్ 21వ తేదీ సాయంత్రానికి శ్రీ తేజ్ ఆరోగ్యం మెరుగుపడిందని, నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకుంటున్నాడని హెల్త్ బులిటెన్ లో తెలిపారు. కాకపోతే అప్పుడప్పుడు జ్వరం వస్తుందని, త్వరలోనే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. శ్రీతేజ్ చికిత్స ఖర్చులను మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రకటించారు.

చనిపోయిన మహిళ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ ఓనర్ తో పాటు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.

పుష్ప-2 సినిమాను తెలంగాణలో బ్యాన్ చేశారంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Full View


వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు



 


ఫ్యాక్ట్ చెక్:

పుష్ప-2 సినిమాను తెలంగాణలో బ్యాన్ చేసినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

మేము సంబంధిత కీ వర్డ్స్ సెర్చ్ చేయగా తెలంగాణలో బెనిఫిట్ షో లను రద్దు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది తప్పితే, సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు చెప్పలేదు.

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పుష్ప-2 తొక్కిసలాట ఘటనపై మాట్లాడారు.

సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు.అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారని రేవంత్ రెడ్డి అన్నారు. అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదని, కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇకపై తాను బెనిఫిట్ షోలకు, ధరలను పెంచేందుకు అనుమతి ఇవ్వబోనని ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇలాగే ఉంటుందని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకూ టిక్కెట్ల ధరలను పెంచనివ్వనని తెలిపారు. ఒక కుమారుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారన్నారు. తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ బయటకు వచ్చి టాప్ లేని కారులో అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్లడం సినిమా వాళ్ల వ్యవహార శైలికి అద్దం పడుతుందన్నారు. థియేటర్ యాజమాన్యంపై కేసులు పెట్టామని, అల్లు అర్జున్ కూడా బాధ్యతరాహిత్యంగా వ్యవహించారన్నారు. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోవచ్చని, కానీ ప్రాణాలతో చెలగాటమాడవద్దని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కానీ కొందరు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయగానే నెట్టింట పోస్టులు పెట్టారని, ఇది అన్యాయమట అంటూ ఎద్దేవా చేశారు.

ఆ మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు


సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇక్కడ చూడొచ్చు:

Full View


Full View


Full View


రేవంత్ రెడ్డి ఆరోపణలపై అల్లు అర్జున్ కూడా స్పందించారు. తన గురించి తప్పు తప్పుగా మాట్లాడుతూ ఉన్నారని తెలిపారు. ఇది ఎవరి తప్పు కాదని, పోలీసులు, సినిమా యూనిట్ అందరూ మంచి ఉద్దేశ్యంతో చేసిన విషయమే అయినా అనుకోకుండా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఆ కుటుంబానికి జరిగిన బాధను తాను చెప్పుకోలేకపోతున్నానని తెలిపారు. అభిమానుల మనసులను గెలుచుకోవాలన్న ఉద్దేశ్యమే తనకు ఉందన్నారు. ఎవరూ ఇలాంటి ఘటనను కోరుకోరని అన్నారు. ఆ బాలుడు కోలుకుంటుండం తనకు చాలా సంతోషం కలిగిస్తుందన్నారు. తాను ఎవరినీ నిందించడం లేదన్నారు. ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరించిందన్నారు. తాను కావాలని ఏమీ చేయలేదని అన్నారు. తాను ఇరవై ఏళ్ల నుంచి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనలేదన్నారు. ఎవరో తప్పుడు సమాచారం అందించారని తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని కించపర్చే విధంగా మాట్లాడటం బాధకరమన్నారు. మూడేళ్లు కష్టపడి తీసిన సినిమా సక్సెస్ అయిందన్న ఆనందం లేదని అల్లు అర్జున్ అన్నారు.


Full View


Full View



తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బెనిఫిట్ షోలను క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 21, 2024న తెలంగాణ అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు.

Full View


Full View


పుష్ప-2 సినిమాను బ్యాన్ చేసినట్లు మాకు ఎలాంటి కథనాలు కనిపించలేదు.

ఇక BookMyShow, Paytm సైట్స్ లో పుష్ప-2 సినిమా బుకింగ్స్ రాబోయే రోజులకు తెరచే ఉన్నాయని కూడా గుర్తించాం.


కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. పుష్ప-2 సినిమాను తెలంగాణలో బ్యాన్ చేయలేదు.


Claim :  పుష్ప-2 సినిమాను తెలంగాణలో బ్యాన్ చేశారు
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News