ఫ్యాక్ట్ చెక్: sarvashikshaabhiyan.com అనే వెబ్ సైట్ ఉద్యోగాల పేరిట మోసం చేస్తోంది. దయచేసి నమ్మకండి
సమగ్ర శిక్షా అభియాన్ అనేది భారతదేశంలోని పాఠశాల కోసం తీసుకుని వచ్చిన విద్యా పథకం. పిల్లలకు అందించే విద్యకు సంబంధించిన
సమగ్ర శిక్షా అభియాన్ అనేది భారతదేశంలోని పాఠశాల కోసం తీసుకుని వచ్చిన విద్యా పథకం. పిల్లలకు అందించే విద్యకు సంబంధించిన నాణ్యతను మెరుగుపరచడం, పాఠశాలలో సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం పిల్లల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009 అమలుకు మద్దతును అందించడమే కాకుండా జాతీయ విద్యా విధానం (NEP) 2020 సిఫార్సులకు అనుగుణంగా సిద్ధం చేసి ఉంచారు.
పాఠశాల విద్యకు సార్వత్రిక ప్రవేశం, అక్షరాస్యత, లింగ సమానత్వం, సమగ్ర విద్య, ఉపాధ్యాయ శిక్షణ, వృత్తి విద్య, క్రీడలు, ఫిజికల్ ఎడ్యుకేషన్, డిజిటల్ కార్యక్రమాలు, పిల్లలకు మద్దతు వంటి కార్యక్రమాలతో సహా పాఠశాల విద్యకు ఇది సమగ్ర విధానాన్ని కలిగి ఉంటుంది. సర్వశిక్షా అభియాన్ (SSA) కింద ప్రత్యేక పథకాలను సమర్థవంతంగా అందించడం కూడా సాధ్యమవుతుంది. ప్రాథమికంగా ప్రీ-ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్య ను కవర్ చేయడమే లక్ష్యం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని నియమిస్తుంది.
సర్వశిక్షాభియాన్ అనే వెబ్‌సైట్ అనేక ఉద్యోగ నియామక లింక్‌లతో సర్క్యులేషన్‌లో ఉంది. ఔత్సాహిక అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెబ్‌సైట్ చెబుతూ ఉంది. ప్రైమరీ స్కూల్ టీచర్లు, ల్యాబ్ టెక్నీషియన్, చప్రాసీ మొదలైన ఉద్యోగ అవకాశాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
వైరల్ వెబ్సైట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.
వెబ్ సైట్ పేజీకి సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వెబ్‌సైట్ నిరుద్యోగులను మోసం చేసే విధంగా రూపొందించారు. ఇది నిజమైన వెబ్‌సైట్ కాదు. భారత ప్రభుత్వ సమగ్ర శిక్షా అభియాన్ పథకానికి సంబంధించినది కాదు.వెబ్‌సైట్ హోమ్ పేజీలో భారత ప్రభుత్వ లోగో కనిపించదు.
ఈ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన రిక్రూట్‌మెంట్ ప్రకటనలలో ఒకదానిపై క్లిక్ చేసినప్పుడు, మొత్తం ఉద్యోగ ఖాళీలు 98305 అని ఉంది.ఇది చాలా పెద్ద సంఖ్య. ఉపాధ్యాయులకు అవసరమైన అర్హత 10, 12 లేదా అంతకంటే ఎక్కువ అని అందులో ఉంది.
అప్లై నౌ పై క్లిక్ చేసినప్పుడు, వెబ్‌సైట్ ఫోన్ నంబర్, ఇమెయిల్ ఐడి మొదలైన వాటితో సహా దరఖాస్తుదారుకు సంబందించిన అన్ని వివరాలను సేకరించింది.
ఈ ప్రక్రియ ముగింపులో, అప్లికేషన్ రుసుము కోసం రూ. 950 తీసుకోడానికి QR కోడ్‌ను చూడవచ్చు.
ఈ స్క్రీన్‌షాట్‌లో చూపించిన UPI ఐడీ sarvashiksha123@abcdicici అయినప్పటికీ, బ్యాంక్‌లోని వినియోగదారు పేరు ‘దీపక్ కుమార్’ అని సూచిస్తుంది, ఏ ప్రభుత్వ విభాగం లేదా పథకం పేరు కాదని గుర్తించాం.
PIB వాస్తవ తనిఖీ బృందం కూడా ఈ వెబ్‌సైట్ నకిలీ వెబ్‌సైట్ అని, భారత ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం కలిగి లేదని కూడా ప్రకటించిందని మేము కనుగొన్నాము.
PIB తన వెబ్‌సైట్‌లో ఒక వివరణను కూడా ప్రచురించింది. నిరుద్యోగులను మోసం చేయడానికి అనేక వెబ్‌సైట్‌లు స్కీమ్‌ల పేరుతో (www.sarvashiksha.online, https://samagra.shikshaabhiyan.co.in, https://shikshaabhiyan.org.in) వంటివి సృష్టించినట్లు విద్యా మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. ఈ వెబ్‌సైట్‌లు ఔత్సాహిక అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను అందిస్తున్నట్టు కనపడతాయి. వెబ్‌సైట్ లేఅవుట్, కంటెంట్, ప్రెజెంటేషన్ అంతా అసలు వెబ్‌సైట్ లాగానే ఉంటూ దరఖాస్తుదారుల నుండి డబ్బును తీసుకుంటూ నిరుద్యోగులను తప్పుదారి పట్టిస్తాయి. ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చే, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం డబ్బు డిమాండ్ చేసే ఇతర వెబ్‌సైట్‌లు/సోషల్ మీడియా ఖాతాలు మరిన్ని ఉన్నాయి.
అటువంటి వెబ్‌సైట్‌లలో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోకుండా సంబంధిత శాఖ/ వ్యక్తిగత విచారణ/ టెలిఫోన్ కాల్/ ఇ-మెయిల్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌ను దృవీకరించుకోవాలి, ఏది ఒరిజినల్ సైట్, ఏది మోసపూరిత వెబ్ సైట్ నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు. ఈ వెబ్‌సైట్‌లలో దరఖాస్తు చేసుకునే ఏ వ్యక్తి అయినా సొంత డబ్బును పోగొట్టుకోవడమే కాకుండా, కీలక సమాచారాన్ని కూడా ఇతరుల చేతుల్లోకి చేరిపోతుంది అని గుర్తించాలి. మార్చి 2022లో కూడా ఇదే తరహాలో ఈ వెబ్ సైట్ ద్వారా మోసాలకు తెగబడ్డారు. కానీ వెబ్‌సైట్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యోగ అవకాశాల పేరుతో ఔత్సాహిక అభ్యర్థులను మోసం చేస్తోంది.
కాబట్టి, sarvashikshaabhiyan.com వెబ్‌సైట్ ప్రామాణికమైన వెబ్‌సైట్ కాదు. భారత ప్రభుత్వ సమగ్ర శిక్షా అభియాన్‌కి సంబంధించినది కాదు. అలాంటి వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్త వహించండి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Claim : sarva shiksha abhiyan వెబ్‌సైట్ భారత ప్రభుత్వానికి సంబంధించినది. ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది
Claimed By : Website
Fact Check : False