ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది అంబేద్కర్ అసలైన వాయిస్ కాదు
అంబేద్కర్ కు చెందిన ఆడియో అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్‌ను అగౌరవపరిచారని ఆరోపిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ప్రచారాన్ని తీవ్రతరం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 21, 2024న ప్రకటించింది. వారం రోజుల పాటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. "అంబేద్కర్ సమ్మాన్ సప్తా" అని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
డిసెంబరు 22, 23 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తారని, డిసెంబర్ 24న ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గౌరవ యాత్రలు నిర్వహిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు. రాజ్యసభలో ప్రసంగం సందర్భంగా అమిత్ షా అంబేద్కర్‌ను అగౌరవపరిచారని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
రాజ్యసభలో మాట్లాడిన అమిత్ షా.. ఈ మధ్య అంబేద్కర్..అంబేద్కర్..అంబేద్
అంబేద్కర్ కు చెందిన ఆడియో అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కొందరు వ్యక్తులు కలిసి కూర్చున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాయిస్ ఓవర్ లో భారత ప్రజాస్వామ్యం, భారతదేశంలోని అణగారిన తరగతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 1931లో లండన్‌లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు స్వరం అని ప్రచారం చేస్తున్నారు.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాయిస్ అంబేద్కర్ కు చెందినది కాదు. మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన అంబేద్కర్ సినిమాలోనిది.
మొదట వైరల్ పోస్టుల్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ఉపయోగించి Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాము. 1931 సెప్టెంబరు 7 నుండి డిసెంబర్ 1 వరకు లండన్‌లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లోని ఫోటో అని పలు ఫలితాలు చూపించాయి. ఇందులో ప్రముఖ వ్యక్తులు మహాత్మా గాంధీ, బ్రిటిష్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలిసి కూర్చున్నారు.
వైరల్ అవుతున్న వాయిస్ అంబేద్కర్ కు చెందినది కాదు. మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన అంబేద్కర్ సినిమాలోనిది.
మొదట వైరల్ పోస్టుల్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ఉపయోగించి Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాము. 1931 సెప్టెంబరు 7 నుండి డిసెంబర్ 1 వరకు లండన్‌లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లోని ఫోటో అని పలు ఫలితాలు చూపించాయి. ఇందులో ప్రముఖ వ్యక్తులు మహాత్మా గాంధీ, బ్రిటిష్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలిసి కూర్చున్నారు.
https://flashbak.com/albert-einsteins-letter-gandhi-eternal-law-love-387683/ direct link
వైరల్ వాయిస్ కు సంబంధించిన ఆడియోను విని, మేము Googleలో సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను అమలు చేశాం. ఒరిజినల్ ఆడియో ఉన్న సినిమా మాకు లభించింది.
ఈ ఆడియో 2000 లో రిలీజ్ అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బయోపిక్ కు సంబంధించింది. డాక్టర్ అంబేద్కర్ బయోపిక్‌గా రిలీజ్ అయిన సినిమా మలయాళ నటుడు మమ్ముట్టి వాయిస్‌ని కలిగి ఉంది.
1:37:20 టైమ్‌స్టాంప్ వద్ద, డాక్టర్ అంబేద్కర్ పాత్రకు సంబంధించిన ప్రసంగాన్ని మనం వినొచ్చు. అది వైరల్ వీడియోలో ఉన్నదే అని అర్థం చేసుకోవచ్చు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో “Dr Babasaheb Ambedkar’s Writings and Speeches Part II” వైరల్ ఆడియోలో వినిపించిన మొత్తం ప్రసంగాన్ని కూడా మేము కనుగొన్నాము. 1930 నవంబర్ 20న జరిగిన రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఐదవ సమావేశంలో డాక్టర్ అంబేద్కర్ అట్టడుగు వర్గాలకు రాజకీయ అధికారం అవసరం గురించి మాట్లాడారు. పూర్తి ప్రసంగం 503-535 పేజీలలో చూడవచ్చు.
https://www.mea.gov.in/images/
వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదంటూ పలు మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. సినిమాలోని సన్నివేశానికి సంబంధించిన ఆడియోను తీసుకుని ఇదే నిజమైన వాయిస్ అని చెబుతూ ఉన్నారు.
Claim : వైరల్ ఆడియో మళయాళ సినిమా లోనిది. అది మమ్ముట్టి వాయిస్
Claimed By : Social Media Users
Fact Check : False